(మాడభూషి శ్రీధర్)
అన్నమయ్య రచించి, స్వర రచన చేసి, పాడిన అద్భుతమైన పాటలపై 616వ జయంతి సందర్భంగా ఈ వ్యాసం.
(సర్వధారి సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు (మే 9, 1408) కడప జిల్లా లోని రాజంపేట మండలం తాళ్ళపాక గ్రామంలో అన్నమయ్య జన్మించాడు). నిత్య పూజలివిగో అంటూ అనునిత్యమూ శ్రీవేంకటేశునికి పూజలు చేయాలని అన్నమయ్య ప్రబోధిస్తున్నారు.
ఒక కీర్తన ఇది.
నిత్య పూజలివిగో నెరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి
పరమాత్మునికి నిత్య పూజలివిగో
తనువే గుడియట తలయె శిఖరమట
పెను హృదయమే హరి పీఠమట
కనుగొన చూపులే ఘన దీపములట
తన లోపలి అంతర్యామికినినిత్య ౨
పలుకే మంత్రమట పాదయిన నాలుకే
కలకల మను పిడి ఘంటయట
నలువైన రుచులే నైవేద్యములట
తలపులోపలనున్న దైవమునకునిత్య ౨
గమన చేష్టలే అంగరంగ గతియట
తమి గల జీవుడే దాసుడట
అమరిన ఊర్పులే ఆలవట్టములట
క్రమముతో శ్రీ వెంకటరాయునికి
(https://www.youtube.com/watch?v=JMhLhqgBBSo) (మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గానం వినవచ్చు)
అర్థ వివరణ
మన శరీరం ఒక గుడి. తన శిఖరం. మన హృదయం పెద్దయి ఉంటే అదే పీఠం, మనందరికీ కనిపించేవే దీపాలు. ఆ హృదయం లోపల శ్రీవేంకటేశునికి స్తోత్రాలు మంత్రాలే పలుకు. ఆ పలుకులు రకరకాలైనవి. ప్రతివాడూ ప్రతిక్షణం ఏదో ఒకటి ఎప్పడికీ అది కావాలనీ. ఇది కావాలనీ అంటూ ఉంటాడు. గుళ్లో వినిపించే ఆ ధ్వని చేసే నాలుక గణగణ మని మోగే గంటలు. ఆ గంటలు మోగుతూ ఆరగింపులు నివేదన చేసే రుచులు వస్తువులు.
నడకలే వేంకటేశునికి అన్ని భోగాలు. వాటిని అంగరంగ వైభోగాలు. తమి అంటే ఆసక్తి కలిగిన జీవుడు. ఊపిరి ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు (శ్వాసించడం) అనే పద్దతి విసనకర్రలతో సేవజేయడం. వాటిని ఆలవట్టములు అంటారు. అవన్నీ ఓ క్రమంగా చేయడమే సేవలు.
నిజంగా నేర్చుకుంటే మన కంటిముందు కనిపించే వేంకటేశునికి ఇవే పూజలు, నిత్యపూజలు అంటూ అన్నమయ్య నిత్యపూజలివివో ప్రకటిస్తున్నారు. అంత అందమైన, చిన్న చిన్నపదాలతో పాదాలతో ఈ ఆరాధన గురించి వివరిస్తున్నారు. అనుకుంటేనే… అనుకోకపోతే ఏం చెప్పగలం?
అంగ అంటే దేవతా విగ్రహాలు. రంగ అంటే ఆలయాలు. ఊరేగింపులు, అనుభవించే భోగాలనేవే అంగరంగ వైభోగాలు. ఈ శరీరమే దేవాలయం, అనే శంకరాచార్యుని సిద్ధాంత లక్షణాలున్న మాటలీ పాటలు. ప్రత్యక్షమంటున్నాడు అన్నమయ్య. ప్రతి అక్షర ప్రత్యక్షమైన వేంకటేశుడను అనుక్షణం చూస్తూనే ఉంటాడు.
అక్కడే నేర్చుకుంటేనే అనీ, నేర్చుకోపోతే ఏదీరాదని అంటారు. అన్నమయ్య వాగ్గేయకారుడు మాత్రమే కాదు, పన్నెండు మంది వైష్ణవ భక్తి పరులైన ఆళ్వార్.
ఈ శరీరమే గుడి. శరీరం ప్రతి క్షణం, ఉచ్చ్వానిశ్యాసలు చేసేవన్నీ అది గుడి అవుతుంది. ఆ గుడి నిత్యపూజలు అవుతాయి. ఆ గుడి శిఖరం మన తలకాయే. అప్పుడు దేవుడి వంటి మనిషి అవుతాడు. మొత్తం శరీరమే గుడి. దేవాలయం కాగలిగితే ఏమిటని వివరిస్తున్నాడు. అన్నమయ్య.
మరో కీర్తన
ఇటువంటి మరో గొప్ప కీర్తన ‘షోడశ కళానిథికి షోడశోపచారములు’. ఈ కీర్తన మొత్తం వింటే తప్ప దీని గొప్పతనం అర్థమవుతుంది. 16 ఉపచారాలు చేయాలని ఆరాధనలో ఉంటాయి.
షోడశకళానిధికి షోడశోపచారములు
జాడతోడ నిచ్చలును సమర్పయామి
అలరు విశ్వాత్మకున కావాహన మిదె
సర్వనిలయున కాసనము నెమ్మి నిదే
అలగంగా జనకున కర్ఘ్యపాద్యాచమనాలు
జలధి శాయికిని మజ్జనమిదే
వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదె
సరి శ్రీమంతునకు భూషణము లివే
ధరణీధరునకు గంధపుష్ప ధూపములు
తిర మిదె కోటిసూర్యతేజునకు దీపము
అమృతమథనునకు నదివో నైవేద్యము
గమి(రవి)జంద్రునేత్రునకు కప్పురవిడెము
అమరిన శ్రీవేంకటాద్రి మీది దేవునికి
తమితో ప్రదక్షిణాలు దండములు నివిగో
(https://www.youtube.com/watch?v=I4ndiinNIsc ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గానం వినవచ్చు)
షోడశోపచారాలు
పూజలు ఆరాధనలు తెలిసిన వారికి షోడశోపచారాలు అర్థం చేసుకోవలసి ఉంటుంది. వచ్చినపెద్దవారికి అతిధికి సేవలు చేయాలి. ఇష్టమైన ఉపచారాలు ఇస్తాం అని,
ఆవాహనం (మనస్ఫూర్తిగా ఇంటికి తీసుకువెళ్లడం ఆహ్వానించడం), ఆసనం (వచ్చిన వారిని కూర్చోబెట్టడం), పాద్యం = కాళ్ళు కడుగుకొనేందుకు నీళ్ళివ్వడం, ఆర్ఘ్యం= చేతులు శుభ్రం చేయడానికి సాయం చేయడం, ఆచమనీయం= దాహమునకు నీళ్ళివ్వడము, స్నానం= ప్రయాణ అలసట తగ్గడానికి స్నానాలకు నీళ్లు తోడించి ఇవ్వడం, వస్త్రం= బట్టలు కట్టుకోవడానికి ఇవ్వడం, తుడిచి పొడి బట్టలివ్వడం, యజ్ఞోపవీతం= జంధ్యం ఇవ్వడం (అందరికీ కాదు, జంధ్యాలు ఉండవలసి వారికి), గంధం=చందనం లేదా అత్తరు, పుష్పం=పూవులు, ధూపం=అగరొత్తులు, దీపం=వెలుగులు, నైవేద్యం=భోజనం, తాంబూలం=మనభాషలో కిళ్లీ, పాన్, నమస్కారం=నిజానికి ముందే నమస్కారం, తరువాత కాళ్లకు దండం పెట్టడం, అమ్మ నాన్నలకు, పెద్దలకు పాదాలు తాకి ఆశీస్సులు పొందడం, ప్రదక్షిణం=గుడి గానీ. పూజాగదిలో చుట్టూ నమస్కరించూ రావడం. కొందరు తమ చుట్టూ తిరిగే పద్ధతి. కొన్ని సందర్భాలలో కానుకలు, ఉంటే నగలు కూడా ఇవ్వడం, సన్మానం అనవచ్చు. ఇవ్వన్నీ సంస్కృతి సంస్కారాలకు సంబంధించిన విషయాలు, వచ్చిన వారికి అతిధి మర్యాదలు ఇవి.
పదహార దేవతలకు ఆవాహన
అటువంటిదే అయినది ‘‘పదహారు కళలకు ప్రాణాలైన’’ అనే గీతాన్ని ప్రముఖ రచయిత. అన్నమయ్య సినిమా రచయిత శ్రీ జె వి సారథి పాట. ఈ పాట “శ్రీపద్మావతీ భూదేవీ సమేతస్య శ్రీమద్వేంకట నాయకస్య” అని మొదలౌతుంది. ‘‘(బృందం)ఓం. శ్రీపద్మావతీ భూదేవీ సమేతస్య, శ్రీమద్వేంకట నాయకస్య నిత్యషోడశోపచార పూజాం చ కరిష్యే ఆవాహయామి, ‘పదహారు కళలకు ప్రాణాలైన నా ప్రణవ ప్రణయ దేవతలకు ఆవాహనామి, (బృందం) : ఓం ఆసనం సమర్పయామి. పరువాల హొయలకు పయ్యెదలైన, నా ఊహల లలనలకు ఊరువుల ఆసనం.
“పదహారు కళలకు ప్రాణాలైన నా ప్రణవ ప్రణయ దేవతలకు ఆవాహనం” అంటూ స్వామివారికి “ఆసనం సమర్పయామి” అనగానే… ఇక్కడ “ఊహల లాలనలకు ఊరువుల ఆసనం” వేస్తాడు అన్నమయ్య అనీ, కొండపై స్వామికి “స్నానం సమర్పయామి” అని పూజించడం “పన్నీటి స్నానం” చేయిస్తాడు. తాంబూలమూ నైవేద్యమూ సాష్టాంగ వందనాలతో అక్కడ వేంకటేశ్వరునికి షోడశోపచార పూజ జరుగుతుంటే తన అన్నమయ్య అర్చనలు చేస్తుంటాడని రమ్యమైన పాటను రచించారు. ఈ పాట చూడవచ్చు. (https://www.youtube.com/watch?v=XY8JNb57_S8)
(Author is Deen, Mahindra Law College, Hyderabad and former Central RTI Commissioner)