ఆర్.డీ. బర్మన్ జయహో
ఆర్. డీ. బర్మన్ జయంతి ఇవాళ.
గొప్ప చలనచిత్ర సంగీత దర్శకుల్లో ఒకరు.
(రోచిష్మాన్, 9444012279)
శంకర్-జైకిషన్ తరువాత, ఎమ్.ఎస్. విశ్వనాద(థ)న్ తరువాత మనదేశంలో వచ్చిన దార్శనిక (visionary) సంగీత దర్శకుడు ఆర్.డీ. బర్మన్.
భారతదేశ సినిమా సంగీతానికి అవసరమైన మలుపు , మార్పు తీసుకొచ్చారు ఆర్.డీ. బర్మన్. తన కాలానికి అతీతంగా ఆలోచించి తదనంతర కాలానికి అవసరమయ్యే ఆలోచనగా నిలిచారు ఆర్.డీ. బర్మన్.
ఒకదశ తరువాత మనదేశ సినిమా పాటలు ఆర్.డీ. బర్మన్ చూపిన మార్గంలోనే నడిచాయి. ఇళైయరాజాకు ఎ.ఆర్. రహ్మాన్‌కు ఆర్.డీ. బర్మన్ స్ఫూర్తి. ఎ.ఆర్. రహ్మాన్ ఇళైయరాజాకు భిన్నంగా సాగినా ఆర్.డీ. బర్మన్‌కు అతీతం కాలేదు.
ఎన్నో అద్భుతమైన పాటలు చేశారు ఆర్.డీ. బర్మన్. అరబీ, వెస్టన్ , కర్ణాటక, హిందూస్థానీ సంగీతాల్ని చాల గొప్పగా మేళవించే వారు బర్మన్. ఉదాహరణకు ప్యార్ కా మోసమ్ (1969) సినిమాలోని “తుమ్ బిన్ జావూన్ కహాన్…” పాట. ఈ పాట ఆర్.డీ.బర్మన్ పటిమకు ఒక మచ్చుతునక. అరబీ prelude తరువాత ప్రతిభావంతంగా వెస్టన్‌లో
పల్లవి మొదటి melodyని అందుకుని కర్ణాటకంలో రెండవ melodyని కొనసాగించి హిందూస్థానీలో సంచారం చేసి పల్లవిని ముగిస్తారు. ఈ పాట
Interludes, చరణాలను వెస్టన్, హిందుస్తానీలలో చేశారు. ఆశ్చర్యకరమైన నిర్మాణం ఈ పాట. ఇలా కొన్ని పాటల్ని విశేషమైన ప్రతిభతో చేశారు బర్మన్.
Bridge passagesపై, leading notesపై,
base line orchestrationపై గొప్ప అవగాహన ఉన్న వారు ఆర్.డీ. బర్మన్. Super fine tunes and base chords and excellent arrangements and sounding excellenceతో మార్గదర్శకంగా నిలిచి ఉండిపోయే ఎన్నో పాటలు చేశారు ఆర్.డీ. బర్మన్.
Base line orchestrationపై అవగాహనతో, ఆ ఆవశ్యకతను గుర్తించి శంకర్-జైకిషన్ “ఏ రాత్ భీగీ భీగీ…” వంటి పాటలతో ఆ తరహా నిర్మాణాన్ని మన పాటల్లోకి తెచ్చినా ఆర్. డీ. బర్మన్ base line orchestrationను ప్రధానమైనదిగానూ, వాడుకగానూ చేసేశారు. ఇళైయరాజా, రహ్మాన్ ఈ అంశాన్ని అందిపుచ్చుకున్నారు. ముఖ్యంగా రహ్మాన్ అంతర్జాతీయ స్థాయి base line orchestrationను మనదేశంలో చలామణిలోకి తెచ్చారు.

లతా మంగేష్కర్ పాడిన “క్యా జానూ సజన్…”, ఆశా భోస్లే పాడిన “కత్ రా కత్ రా మిల్తీ హై…” వంటి అరుదైన countermelodies పాటలు చేశారు ఆర్.డీ. బర్మన్.
అత్యున్నమైన సంగీత దర్శకుడు శంకర్(జైకిషన్) ఒక సందర్భంలో ఆర్. డీ. బర్మన్ గురించి “he is scaling new heights… అతడితో సంగీతం చేయించుకోండి” అని ఒక నిర్మాతతో చెప్పారట.
గొప్ప సంగీత దర్శకుడైన ఎస్. డీ. బర్మన్ కొడుకు ఆర్. డీ. బర్మన్. తన తండ్రి సంగీతం కన్నా శంకర్-జైకిషన్ సంగీతవల్ల ఆర్. డీ. బర్మన్ ఎక్కువగా ప్రభావితమయ్యారు. శంకర్-జైకిషన్ తరువాత దేశ సినిమా సంగీతాన్ని ఎక్కవగా ప్రభావితం చేశారు. ఉన్నతమైన సంగీత దర్శకుడు ఎమ్.ఎస్.విశ్వనాదన్ కూడా ఆర్. డీ. బర్మన్ ప్రభావంతో పాటలు చేశారు.
ఆశా భోస్లే తన భార్య అయినా ఆర్.డీ. బర్మన్ లతా మంగేష్కర్‌తో “రైనా బీతిజా జాఎ…” (అమర్ ప్రేమ్), “నాజా ఓ మేరే హమ్ దమ్…”( ప్యార్ కా మౌసమ్), “సీలీ హవా ఛూగఈ…” (లిబాస్), “తేరే బినా జియా జాఎ నా…”(ఘర్), “తేరే లిఎ పల్‌కోన్ కీ ఝాలర్…” (హర్‌జాఈ) వంటి పలు మహోన్నతమైన పాటలను పాడించారు. నిజానికి ఆయన లతా చేత పాడించినన్ని గొప్ప పాటలు ఆశా చేత పాడించలేదు. దీన్ని బట్టి ఆయన వృత్తిధర్మాన్ని ఏ మేరకు కలిగి ఉండేవారో తెలుసుకోవచ్చు.
కిషోర్ కుమార్ చేత “చింగారీ కోఈ భడ్‌కే…” (అమర్ ప్రేమ్), “హమే తుమ్ సే ప్యార్ కిత్‌నా…” (కుద్‌రత్) వంటి పలు ఉదాత్తమైన పాటలు పాడించారు ఆర్. డీ. బర్మన్.
అనిల్ బిశ్వాస్ దేశ తొలిదశ ప్రముఖ సినిమా సంగీత దర్శకుడు. సజ్జాద్ హుసైన్‌ను గొప్ప సంగీత దర్శకుడు అని ప్రశంసించిన అనిల్ బిశ్వాస్ మళ్లా ఆర్.డీ. బర్మన్‌నే ప్రత్యేకంగా ప్రశంసించారు.
A sublime composer and a visionary film music-director R D. Burman.

(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)