నాలుగు సూత్రాల ఆధారంగా బ‌డ్జెట్‌

Date:

లోక్‌స‌భ‌లో నిర్మ‌ల బ‌డ్జెట్‌
బ‌డ్జెట్‌లో ఏమున్నాయంటే
నాలుగోసారి ప్ర‌వేశ‌పెట్టిన నిర్మ‌లాసీతారామ‌న్‌
రెండోసారి వ‌రుస‌గా పేప‌ర్‌లెస్ బ‌డ్జెట్‌
న్యూఢిల్లీ, ఫిబ్ర‌వ‌రి1:
2022-2023 వార్షిక బ‌డ్జెట్‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మంగ‌ళ‌వారం ఉద‌యం 10గంట‌ల‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన క్యాబినెట్ ముందు ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఉంచారు. బ‌డ్జెట్‌ను క్యాబినెట్ ఏక‌గ్రీవంగా ఆమోదించింది. ఉద‌యం 11 గంట‌ల‌కు నిర్మ‌ల బ‌డ్జెట్‌ను లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. వ‌రుస‌గా ఆమె రెండోసారి పేప‌ర్‌లెస్ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండేలా బ‌డ్జెట్‌ను యాప్‌లో పెట్టారు. 2014 నుంచి త‌మ ప్ర‌భుత్వం పౌరుల సాధికారిత‌కు కృషి చేస్తోంద‌న్నారు. కొవిడ్ టీకాల‌పై విశేష కృషి చేశాం. కొవిడ్ క‌ట్ట‌డికి ఇది బాగా స‌హ‌క‌రించింద‌ని నిర్మ‌లా సీతారామ‌న్ చెప్పారు.
బ‌డ్జెట్ ముఖ్యాంశాలు

నాలుగు సూత్రాల ఆధారంగా బ‌డ్జెట్‌
1) ప్ర‌ధాని గ‌తి శ‌క్తి యోజ‌న‌, 2) స‌మీకృత అభివృద్ధి, 3) అభివృద్ధి ఆధారిత పెట్టుబ‌డులు, 4) ప‌రిశ్ర‌మ‌ల‌కు ఆర్ధిక ఊతం

ప్ర‌జ‌ల ప్రాణాల ర‌క్ష‌ణ‌లో కొవిడ్ టీకా క‌లిసొచ్చింది
ఆత్మ నిర్భ‌ర భార‌త్ మంచి ఫ‌లితాల‌ను ఇచ్చింది.
ఎయిర్ ఇండియాను టాటాకు విజ‌య‌వంతంగా బ‌దిలీ చేశాం
త్వ‌ర‌లో ఎల్ఐసీ ప‌బ్లిక్ ఇస్యూ
25 అమృతోత్స‌వానికి ఈ బ‌డ్జెట్ పునాది
పార‌ద‌ర్శ‌క‌మైన స‌మీకృత అభివృద్ధికి ఈ బడ్జెట్ పునాది
భార‌త్‌ను అగ్ర‌గామిగా నిలిపేందుకు ప్ర‌ణాళిక‌లు
ఉత్ప‌త్తి ఆధారంగా 14 రంగాల‌లో అభివృద్ధి
డీబీటీ ద్వారా పేద‌ల‌కు నేరుగా ఆర్థిక సాయం
వ‌చ్చే ఐదేళ్ళ‌లో 13 ల‌క్ష‌ల కోట్ల ఉత్పాద‌క‌త‌కు ప్రోత్సాహకాలు
నీలాంచ‌ల్ నిస్పాత్ నిగ‌మ్ ప్రైవేటుప‌రం
ప‌ర్వ‌త‌మాల ప్రాజెక్టు కింద ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన అభివృద్ధి
ప‌ర్వ‌త‌మాల ప్రాజెక్టు కింద 8 రోప్ వేల అభివృద్ధి
60 కిలోమీట‌ర్ల దూరానికి ఒక్కో రోప్ వే
నాలుగు చోట్ల మ‌ల్టీ మోడ‌ల్ లాజిస్టిక్ పార్కులు
కొండ ప్రాంతాల‌లో ప‌ర్యాట‌క అభివృద్దికి అవ‌కాశాలు
నాలుగు ప్ర‌ధాన సూత్రాల ఆధారంగా బ‌డ్ఎట్‌
ప్ర‌ధాని గ‌తిశ‌క్తి యోజ‌న‌, స‌మీకృత అభివృద్ధి ఆధారంగా బ‌డ్జెట్‌
ఉత్పాద‌క అభివృద్ధి ఆధారిత పెట్టుబ‌డులు ఆధారంగా బ‌డ్ఎట్‌
ప‌రిశ్ర‌మ‌ల‌కు ఆధారంగా బ‌డ్జెట్‌

చిరుధాన్యాల అభివృద్ధికి ప్రోత్సాహం
ఉత్ప‌త్తి ఆధార ప్రోత్సాహ‌కాల‌తో 14 రంగాల్లో క‌నిపించిన అభివృద్ధి
2023ను తృణ ధాన్యాల సంవ‌త్స‌రంగా ప్ర‌క‌ట‌న‌
ఎమ్‌ఎస్ఎమ్ఈల‌కు మార్కెటింగ్‌కు ప్ర‌త్యేక పోర్ట‌ల్‌
ర‌సాయ‌న ర‌హిత (ఆర్గానిక్‌)
వ్య‌వ‌సాయానికి మ‌రింత ప్రోత్సాహం
న‌దుల అనుసంధానానికి 5 డిపిఆర్‌లు

ప్ర‌ధాని ఈ విద్య కింద ఒక్కో త‌ర‌గ‌తికీ ఒక్కో చానెల్‌
ఒక‌టి నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కూ ప్ర‌త్యేక చానెల్స్‌
విద్యార్తులంద‌రికీ అందుబాటులోకి ఈ కంటెంట్‌
క్రెడిట్ గ్యారంటీ ప‌థ‌కానికి 2 ల‌క్ష‌ల కోట్ల ఆర్థిక నిధులు
మాన‌సిక స‌మ‌స్య‌ల‌కు టెలి క‌న్స‌ల్టెన్సీ స‌దుపాయం
పీపీపీ న‌మూనాలో ఆహార శుద్ధి ప‌రిశ్ర‌మలు

పీఎం గ‌తి శ‌క్తి కింద ఎక్స్‌ప్రెస్ వేలు

20వేల కోట్ల‌తో 20వేల కిమీల ఎక్స్‌ప్రెస్‌వేలు

వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల విలువ పెంపున‌కు స్టార్ట‌ప్‌ల‌కు సాయం
వంట నూనెల దిగుమ‌తిపై ఆధార‌ప‌డ‌కుండా దేశీయంగా ఉత్ప‌త్తి
ప్ర‌ధాని ఈ విద్య కింద 12 చానెళ్ళు 200కు పెంపు
రైతుల‌కు అద్దె ప్రాతిప‌దిక‌న వ్య‌వ‌సాయ ప‌నిముట్లు ఇచ్చేందుకు ప్ర‌త్యేక ప‌థ‌కం
ఉద్యోగులు, కార్మికుల్లో నైపుణ్యాభివృద్ధికి ఆన్‌లైన్ సౌక‌ర్యం
1.5 ల‌క్ష‌ల పోస్టాఫీసుల ద్వారా నెట్ బ్యాంకింగ్‌, ఆన్‌లైన్, ఏటీఎం సేవ‌లు
వ్య‌వ‌సాయ వ‌ర్శిటీల్లో సిల‌బ‌స్ మార్పులు
జీరో బ‌డ్జెట్ ఫార్మింగ్‌, సేంద్రియ‌సాగుకు ప్రోత్సాహం
కాలం తీరిన చ‌ట్టాల‌కు చెల్లుచీటి
సాగురంగంలో యాంత్రీక‌ర‌ణ‌కు ప్రోత్సాహం
మ‌హిళా, శివు సంక్షేమం కోసం మిష‌న్ శ‌క్తి, వాత్స‌ల్య‌, స‌క్షం, అంగ‌న్‌వాడీ
వ‌రి, గోధుమ కొనుగోళ్ళ మ‌ద్ద‌తు ద‌ర‌ల‌కు 2.37 లక్ష‌ల కోట్లు
జిల్లాల వారీ వెనుక‌బ‌డిన ప్రాంతాల్లో అభివృద్ధికి ప్ర‌త్యేక ప‌థ‌కం

దేశవ్యాప్తంగా ఏకీకృత రిజిస్ట్రేష‌న్‌
డీడ్‌లు, రిజిస్ట్రేష‌న్ల‌కు ఆధునిక వ్య‌వ‌స్థ‌
రైల్వేల‌తో ఇత‌ర ప్ర‌యాణ సౌక‌ర్యాల అనుసంధానం
ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల నిర్మాణంలో
ఈ ఏడాది దేశ‌వ్యాప్తంగా అందుబాటులోకి 5జి
ఈ పాస్ పోర్టుల జారీకి కొత్త టెక్నాల‌జీ
75జిల్లాల్లో 75 డిజిట‌ల్ బ్యాంకింగ్ యూనిట్లు
గంగా ప‌రివాహం వెంబ‌డి నేచుర‌ల్ ఫార్మింగ్‌
గోదావ‌రి-కృష్ణా, కృష్ణా-పెన్నా, పెన్నా-కావేరి అనుసంధానానికి కృషి
న‌దుల అనుసంధానానికి 5 డిపిఆర్‌లు
ఉపాధ్యాయుల‌కు డిజిట‌ల్ నైపుణ్యాలకు ప్రోత్సాహం

డిజిట‌ల్ చెల్లింపులు, డిజిట‌ల్ బ్యాంకింగ్‌కుఈ ఏడాది కూడా మ‌రింత ప్రోత్సాహం
కాంట్రాక్ట‌ర్ల‌కు ఈ బిల్లుల చెల్లింపుల‌కు అవ‌కాశం
బిల్లులు చూసుకునేందుకు అవ‌కాశం
పీఎం ఆవాస్‌యోజ‌న‌లో 80ల‌క్ష‌ల గృహాలు
ర‌క్ష‌ణ ఉత్ప‌త్తుల దిగుమ‌తులు త‌గ్గించి, స్వ‌యం స‌మృద్ధికి ప్రోత్సాహం
400 వందే భార‌త్ రైళ్లు
విద్యా రంగంలో తొలిసారి డిజిట‌ల్ వివ్వ‌విద్యాల‌యాలు
ఎగుమ‌తుల వృద్ధికి ప్రోత్సాహ‌కాలు
ఇక నుంచి చిప్ాధారిత పాస్‌పోర్టుల జారీ
ర‌క్ష‌ణ రంగంలో ప్రైవేటు సంస్థ‌ల‌కు అవ‌కాశం
డ్రోన్ శ‌క్తి ప‌థ‌కంలో భాగంగా స్టార్ట‌ప్‌ల‌కు ప్రోత్సాహం
బ్లాక్ చైన్ వినియోగించి డిజిట‌ల్ రుపీ విధానం
పంట‌ల ప‌రిశీల‌న‌, మందుల పిచికారీకి కిసాన్ డ్రోన్స్‌
112 ఏస్పిరేష‌న్ జిల్లాల్లో 95 శాతం వైద్య సౌక‌ర్యాలు మెరుగు

బొగ్గు ద్వారా గ్యాస్ ఉత్పత్తికి నాలుగు ప్రైవేట్ ప్రాజెక్టులు
రాష్ట్రాల‌కు ల‌క్ష కోట్ల‌తో ఆర్థిక సాయ నిధి ఏర్పాటు
న‌ల్ సే జ‌ల్‌కింద రెండేళ్ళ‌లో 5.7కోట్ల మందికి నీరు

బ‌డ్జెట్ అంచనాలు 39.45 కోట్ల రూపాయ‌లు
ద్ర‌వ్య లోటు 6.9శాతం
20225-26 నాటికి 4.5 శాతానికి త‌గ్గించ‌డం ల‌క్ష్యం
ప్ర‌స్తుతానికి ఆదాయ వ‌న‌రులు 22.84 కోట్ల రూపాయ‌లు

దేశ ఆర్థికాభివృద్ధికి డ్రైవ‌ర్లుగా స్టార్ట‌ప్స్‌
మూల‌ధ‌న పెట్టుడుల‌కు 10.68ల‌క్ష‌ల కోట్లు కేటాయింపు
త్వ‌ర‌లో భ‌వ‌నాల ఆధునిక బైలాస్ విడుద‌ల‌
ప‌ట్ట‌ణ ప్ర‌ణాళిక సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్సీల‌కు 10.65 కోట్లు
ఐటీ రిట‌ర్న్‌ల దాఖ‌లులో వెసులుబాటు
రెండేళ్ళ వ‌ర‌కూ వ్య‌క్తిగ‌త రిట‌ర్న్స్ దాఖ‌లుకు అవ‌కాశం

జిఎస్టి 2022 జ‌న‌వ‌రి ఆదాయం 1,43,086 కోట్లు
ఇప్ప‌టి వ‌ర‌కూ ఇది అత్య‌ధికం
కొవిడ్ అనంత‌రం ఆర్థికాభివృద్ధికి ఇది సూచ‌న‌
ప‌న్ను చెల్లింపుదారులు ఇందుకు ప్ర‌ధాన కార‌ణం
క్రిప్టో క‌రెన్సీ లావాదేవీల‌పై 30శాతం ప‌న్ను
డిజిట‌ల్ క‌రెన్సీ ద్వారా ఆదాయం, ఆస్తుల బ‌దిలీపై 30శాతం ప‌న్ను
కేంద్ర ఉద్యోగుల‌తో స‌మానంగా రాష్ట్ర ప్ర‌భుత్వోద్యోగుల‌కు ఎన్‌పీఎస్ డిడ‌క్ష‌న్‌
జిఎస్‌డిపిలో 4 శాతం వ‌ర‌కూ ద్ర‌వ్య‌లోటుకు అనుమ‌తి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Uddhav Thackeray: Congress riding Shiv sena tiger?

(Dr Pentapati Pullarao) In November 2019, Uddhav Thackeray broke of...

US Elections vs Indian Polls

Plethora of similarities in campaigning style (Anita Saluja) As the US...

శిల్ప చేసిన భగీరథ విఫల యత్నం

త్వరలో సమస్య పరిష్కారానికి HMWSSB ఎం.డి. హామీ (కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)ఎవరికైనా వ్యక్తిగతంగా...

ఇండియన్ బ్రాండ్ అంబాసడర్ టాటా

ఉప్పు నుంచి ఉక్కు వరకూ…టీ నుంచి ట్రక్ వరకూఅప్రెంటిస్ నుంచి చైర్మన్...