వాజపేయి ఇంటర్వ్యూ మరువలేని అనుభూతి

Date:

తిట్టేందుకు వచ్చిన డిస్ట్రిబ్యూటర్…
ఈనాడు – నేను: 2
(సుబ్రహ్మణ్యం వి ఎస్ కూచిమంచి)
జీవితం మన చేతుల్లో ఉండదని చెప్పడానికి నేనే ఓ మంచి ఉదాహరణ. కోస్తావాణి నుంచి సెలవు తీసుకున్న నన్ను మా పెదనాన్నగారైన కూచిమంచి సత్య సుబ్రహ్మణ్యం గారు విజయవాడలోని జనతా సాయంకాల దినపత్రికకు వెళ్ళమన్నారు. దాని వ్యవస్థాపక ఎడిటర్‌ మొవ్వా రామ్మోహన్‌రావుగారు. మృదుస్వభావి. వ్యాపారం బాగా వంటబట్టిన మనిషి. సుబ్రహ్మణ్యం గారు నన్ను పంపించారనగానే మరో మాట లేకుండా అక్కడి ఎడిటర్‌ శాస్త్రిగారిని పిలిచి ‘ఇతని పేరు సుబ్రహ్మణ్యం.. కూచిమంచివారి బంధువు. ఈరోజు నుంచి మనకు రిపోర్టర్‌’ అని పరిచయం చేశారు. అది విన్న శాస్త్రి గారు మహదానందపడ్డారు. ఎందుకంటే ఆయనకూడా మా పెదనాన్నగారి దగ్గర పనిచేసినాయనే. అక్కడ రిపోర్టింగ్‌తో పాటు డెస్కులో కూర్చుని ఇంగ్లీషునుంచి తెలుగుకు అనువాదాలు కూడా నేర్చుకున్నాను. పూర్తిగా తెలుగు మీడియంలో చదివిన నాకు ఆ పని కొంచెం(కొంచెమేమిటి బాగానే) కష్టమనిపించింది. కొరుకుడు పడలేదు.
ఏ బాక్స్ కంటైనింగ్ డేట్స్
ఓ వార్త రాస్తూండగా.. ఎ బాక్స్‌ కంటైనింగ్‌ డేట్స్‌ అనే పదాన్ని తేదీలు వేసి ఉన్న పెట్టె అని తర్జుమా చేశాను. శాస్త్రిగారు దాన్ని చూసి ఏం మాట్టాడలేదు. అదే కాపీని ఆయన తిరగరాశారు. ప్రింట్‌ అయిన తరవాత ఆ వార్తను ఆసాంతం చదవమని సూచించారు. ఆయన పక్కనే కూర్చుని ఆ పని చేశాను. అందులో నేను రాసిన తేదీలు వేసి ఉన్న పెట్టె పదం కనిపించలేదు. ప్రశ్నార్థకంగా చూసిన నాతో ఆయన.. అది ఖర్జూరాలున్న పెట్టె.. తేదీలు వేసి ఉన్న పెట్టె కాదంటూ.. బోసి నోటితో నవ్వుతూ ఆప్యాయంగా వెన్నునిమిరారు. సిగ్గుతో చచ్చిపోయానారోజు. ఏమీ అనకపోవడం.. నన్ను ఆయన హెచ్చరించిన తీరూ దానికి కారణం.
జీతం ఐదు వందలు
ఇంతవరకూ నేను అక్కడి జీతం చెప్పలేదుకదూ. ఐదువందలు.. వారానికి నూట ఇరవై ఐదు రూపాయలిచ్చే వారు రామ్మోహనరావు గారు. ఉదయానే ఎనిమిదింటికి ఆయనతో పాటు టిఫిన్‌, ఘుమఘుమలాడే ఫిల్టర్‌ కాఫీ అందేవి. మొదటి వారం జీతంతో భోజనం కూపన్ల పుస్తకం కొన్నాను. జగన్నాథమని డిగ్రీలో నా సీనియర్‌ విజయవాడలోనే మెడికల్‌ రిప్రెజెంటేటివ్‌. ముందు అతని రూముకి చేరాను. అద్దెగా ఒక డెబ్బై ఐదు రూపాయలు అతనికి ఇవ్వాల్సి వచ్చేది. రెండోవారం మిగిలిన యాబై రూపాయలనూ దాచుకుని మూడో వారం జీతం కలిపి రెన్‌ అండ్‌ మార్టిన్‌ గ్రామర్‌ బుక్‌, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ కొన్నాను. రోజు వీటిని మోసుకెడుతూండే వాడిని. ఏమిటయ్యా అవి అంటూ ఓ రోజు ప్రశ్నించారు రామ్మోహనరావు గారు. విషయం వివరించే సరికి.. నిజమేనయ్యా.. నేనూ ఆలోచించలేదు..నీలా కొత్తగా పాత్రికేయంలోకి వచ్చేవారికి ఇవి అవసరమనే ఆలోచనే నాకు రాలేదు. అంటూ మొత్తం పన్నెండు డిక్షనరీలు తెప్పించారు. సూర్యరాయాంధ్ర నిఘంటువు కూడా అందులో ఉంది. వాటికోసం ప్రత్యేకంగా ఒక బల్ల చేయించి, పెట్టారు.
సినిమా సమీక్ష.. గందరగోళం
రిపోర్టర్‌గా నా విధులు అన్నీ ఇన్నీ కావు. ఉదయం ఎనిమిదికి వెడితే రాత్రి సెకండ్‌ షో చూసి ఇంటికి చేరే వాణ్ణి. ఇది చదివి నాకు సినిమా పిచ్చి ఉందనుకునేరు. ఇది కూడా విధిలో భాగమే. వారానికి కనీసం మూడు సినిమాలు చూసి రివ్యూలు రాయడం నావంతు. ఓ సారి నటశేఖర కృష్ణ సినిమా … దొంగ(పేరు సరిగా గుర్తు లేదు అప్పట్లో మనం కృష్ణకి యాంటీ ఫ్యాన్‌) చూసి రివ్యూ చడామడా రాసేశాను. రెండో రోజు ఉదయం మామూలుగా ఆపీసుకు వచ్చాను. అప్పటికే పంచె కట్టుకున్న ఓ పెద్దాయన రామ్మోహనరావుగారితో కూర్చుని ఉన్నారు. కొద్ది సేపటికి లోపలకు పిలిచారు. ఈయనెవరో తెలుసా.. సీరియస్‌గా అడిగారు. తెలీదండి..
ఈయన లక్ష్మీ ఫిలింస్‌ అధినేత
నిన్న నువ్వు రాశావే.. రివ్యూ దానిగురించి మాట్లాడ్డానికి వచ్చారు.
అంటూ ఇతనేనండి సుబ్రహ్మణ్యం.. మన కూచిమంచి వారి తమ్ముడి కుమారుడు అంటూ
పరిచయం చేశారు.
అప్పటిదాకా సీరియస్‌గా ఉన్న ఆయన మొహం ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయింది.
ఇందాకట్నుంచీ ఈ విషయం నాకు చెప్పలేదు. నా తిట్లన్నీ తిన్నారు. ముందే చెప్పుంటే మారుమాటడకపోయేవాణ్ణి కదా రావు గారు! అంటూ ఆయన నొచ్చుకున్నారు.
సరే..అంటూ నన్ను దగ్గరికి పిలిచి సాయంత్రం ఫస్ట్‌ షోకు మళ్ళీ రా.. అని చెప్పి వెళ్ళిపోయారు.
వెనక్కి చూస్తే రావుగారు ముసిముసిగా నవ్వుతున్నారు. ఏమిటండి అనడిగా.. వెళ్ళు నీకే తెలుస్తుంది అన్నారు.
ఆ రోజుల్లో రివ్యూలు
సాయంత్రం శైలజా థియేటర్‌కి వెళ్ళా. నేరుగా మేనేజర్‌ రూమ్‌లోకి తీసుకెళ్ళారు. సినిమా మొదలయ్యే సమయానికి థియేటర్‌లోకి నడిచాం. సినిమా చూస్తుండగా ఆయన వివరించడం మొదలు పెట్టారు. సినిమా తీయడంలో కష్టాలు.. అయ్యే ఖర్చు.. పడే శ్రమా..ఇలా.. ఏడాదిపైన పడే శ్రమను నువ్వు రాసిన ఒక్క రివ్యూతో జనం ఛీ అనేలా చేసేశావంటూ చెప్పారు. రివ్యూ రాసేటప్పుడు.. నీకెంత కోపం ఉన్నా.. దాన్ని అన్యాపదేశంగా చెప్పాలి తప్ప నేరుగా…. అంటూ ఉపదేశించారు. అప్పుడనిపించింది నిజమే కదా అని.. (ఆ రివ్యూ కాపీ నా దగ్గర లేదు. ఉండుంటే అది కూడా ఇక్కడ పోస్టు చేసి ఉండేవాడిని) ఆ రోజు నుంచి సమీక్షలు రాయడంలో కడు జాగ్రత్తలు తీసుకునే వాడిని. అప్పట్లో రెంటాల గారు సమీక్షలు రాయడంలో దిట్ట. ఆయనకూడా నాలో మార్పు చూసి భుజం తట్టారు. జర్నలిజంలో నాకు ఇది రెండో పాఠం.
అదో సాహసం
కొన్నాళ్ళ తర్వాత అప్పటి మేయర్‌ గారి ఇంటి మీద ఓ ఇన్వెస్టిగేటివ్‌ ఐటమ్‌ రాశాను. ఆయనిల్లు గుణదల కొండమీద ఉండేది. విజయవాడంతా నీటికి కటకటలాడుతుండేది. మేయర్‌గారింటికి మాత్రం ప్రత్యేక పైప్‌లైన్‌ వేసి నీటిని అందించేవారు. ఈ విషయాన్ని ఓ కార్పొరేటర్‌ నా చెవిన వేశారు. రామ్మోహనరావు గారితో చెప్పకుండా ఓ రాత్రి ఆ ప్రాంతానికి వెళ్ళి ఫొటోలు తీసుకున్నాను. వార్తరాసేసి, మేయర్‌గారిని అడిగాను. అలాంటిదేం లేదని చెప్పారు. ఆయన వెర్షన్‌ కూడా కలిపి, ఇచ్చాను. రామ్మోహనరావుగారు కూడా దాన్ని నిర్థారించుకుని ప్రచురించారు. అప్పుడో రకమైన అలజడి. వార్త తప్పంటారు మేయర్‌. మా దగ్గర ఆధారాలున్నాయంటాం మేం. రెండు రోజులకు సద్దుమణిగింది.
డోగిపర్తి శంకరరావు…
డోగిపర్తి శంకరరావు గారు, బీజేపీ నాయకుడు. ఫార్మాసూటికల్‌ బిజినెస్‌. భార్య కార్పొరేటర్‌. చాలా వరకూ సమాచారాలు ఆయనే అందించే వారు. వ్యాపారవేత్త కదా రామ్మోహనరావు గారు ఆయననుంచి ప్రకటనలు తెమ్మన్నారు. బాగోదేమో అనుకుంటూనే అడిగా. నెలకెంత కావాలి అనడిగారాయన. మీ ఇష్టం చెప్పాను నేను. మూడు వేల రూపాయల ప్రకటనలు చాలా అంటూ అప్పటికప్పుడే చెక్‌ చేతిలో పెట్టారు.
ఓఎన్‌జిసి పార్టీ
కృష్ణా గోదావరి బేసిన్లో సహజవాయు నిక్షేపాలను కనుగొన్న సందర్భంగా ఓఎన్‌జిసి కాంధారి హొటల్‌లో డిన్నర్‌ ఇచ్చింది. అన్ని రకాల డ్రింక్స్‌, ఆహారపదార్థాలూ అక్కడ ప్రత్యక్షమయ్యాయి. అలాంటి పార్టీ చూడడం అదే ప్రథమం నాకు. ఎలా వ్యవహరించాలోకూడా తెలీదు నాకు. అక్కడే ఈనాడుకు చెందిన మోటూరి వెంకటేశ్వరరావుగారు, సురేష్‌ గారు, కొమ్మినేని శ్రీనివాసరావుగారు, ఆంధ్ర పత్రిక శాస్త్రిగారు, డెక్కన్‌ క్రానికల్‌ శ్రీరాములు గారు, ఆలిండియా రేడియో కరస్పాండెంట్‌ ఆర్‌విఆర్‌ కృష్ణారావుగారు పరిచయమయ్యారు. ఈనాడు రిపోర్టర్‌ సీతారాం కలిసి పరిచయం చేసుకున్నారు. తాను కూడా జనతానుంచే ఈనాడుకు వెళ్ళానని చెప్పారు. నాలో ఆశ చిగురించింది. ఓహో జనతాలో పనిచేస్తే ఈనాడులో ఉద్యోగం ఖాయమన్న నిశ్చయానికి వచ్చేశాను.


వాజపేయితో ముఖాముఖి
భారతీయ జనతా పార్టీ జాతీయ సమావేశాలు విజయవాడలో ఏర్పాటయ్యాయి. దీని కవరేజికి నా ప్రణాళిక నాకుంది. వెంకయ్యనాయుడు గారు ప్రెస్‌మీట్‌ పెట్టి వివరాలు చెప్పారు. మెల్లగా ఆయన పక్కన చేరాను. సార్‌ నాకు వాజపేయి గారి ఇంటర్వ్యూ ఇప్పించడని అడిగాను. వెంకయ్యనాయుడుగారిలో గొప్పతనం అదే. అడిగిన వాడు చిన్న రిపోర్టరా.. పేరున్నవాడా.. పెద్ద పత్రికవాడా అని చూసేవారు కాదు. వెంటనే తలూపారు. బహిరంగ సభ రోజున చెప్పి, నిన్ను ఆయన పక్కన కూర్చోబెడతా. ఐదు నిముషాలు మాట్లాడుకో అన్నారు. పట్టలేని ఆనందమేసింది. కానీ ఏదో మూల చిన్న అనుమానం. అవకాశం దొరుకుతుందా లేదా అని. రోజు రానే వచ్చింది. మొదటి వరుసలో మధ్యలో అద్వానీ గారు కూర్చున్నారు. పక్కన సీటు ఖాళీఉంది. కొద్దిసేపటికి వాజపేయి గారు మెల్లిగా నడుచుకుంటూ వచ్చి పక్కన కూర్చున్నారు. ఆ పక్క కుర్చీ ఖాళీ. కార్యకర్తలు కర్రలతో దడి కట్టి నిలబడ్డారు. ఎక్కడినుంచో వెంకయ్యగారు గబగబా బయటికొచ్చారు. రా.. రా.. అని చేతులూపుతున్నారు. గబగబా అక్కడికెళ్ళాను. కార్యకర్తలు అడ్డుపడ్డారు. మనవాడేలే అంటూ ఒక కర్రని తప్పించి నన్ను వాజపేయి గారి పక్కన కూర్చోపెట్టారు. ఒక్కసారి ఒళ్ళు జలదరించింది. నోటమాటరాలేదు నాకు. హౌ ఆర్‌ యూ! వాజపేయి గారి ప్రశ్న.. ఐ యామ్‌ ఫైన్‌ సర్‌ నా సమాధానం. కర్తవ్యం గుర్తొచ్చింది. ట్రాన్స్‌నుంచి బయట పడి మాట్లాడాను. ఐదునిముషాలయ్యింది. వాజ్‌పేయిగారిని వేదికపైకి పిలుస్తున్నారు. వెంకయ్య గారొచ్చి.. సంతోషమేనా.. అంటూ నన్ను మళ్ళీ బయటకు పంపారు. తరువాతి రోజు సాయంత్రం ఎడిషన్‌లో నా పేరుతో వాజ్‌పేయిగారి ఇంటర్వ్యూ పబ్లిష్‌ అయ్యంది. ఏ ఇతర పేపరూ ఆయన ఇంటర్వ్యూ ఇవ్వలేదు. మిగిలిన నేతలివి వచ్చాయి. ఇది నేను మరిచిపోలేని సంఘటన. అందుకు వెంకయ్యగారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఈనాడు సురేష్‌ గారుకూడా ఎప్పుడు ఇంటర్వ్యూ చేశావు?అని ఆశ్చర్యంగా అడగడం నన్ను మరింత ఉప్పొంగేలా చేసింది.
తరువాత వారం రోజులకి నా జీవితం మరో మలుపు తిరిగింది. అది నన్ను చెన్నై చేర్చంది.
(ఆ వివరాలు రేపు…)

#Vajapayee #Venkayyanaidu

1 COMMENT

  1. వాజ్ పాయ్ గారి ఇంటర్వ్యూ కి సహకరించడం వెంకయ్యనాయుడు గారి గొప్పతనం… థాంక్యూ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పుష్కర శ్లోకాలు… అన్వేషణ

వేద పండితుల నుంచి సన్నిధానం వరకూగౌతమి గ్రంధాలయం గొప్పదనం….ఈనాడు - నేను:...

రామోజీ వర్కింగ్ స్టైల్ అలా ఉంటుంది…

నాకు ఆయన నుంచి వచ్చిన తొలి ప్రశంస?నేను - ఈనాడు: 15(సుబ్రహ్మణ్యం...

రామోజీ కామెంట్స్ కోసం చకోర పక్షుల్లా….

టీం వర్క్ కు నిదర్శనం సైక్లోన్ వార్తల కవరేజ్ఈనాడు - నేను:...

కర్ఫ్యూలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే….

విజయవాడ ఉలికిపాటుకు కారణం?ఈనాడు - నేను: 13(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)పని పూర్తయింది....
slothttps://www.rajschool.com/slot onlinehttps://sai-ban.com/https://britoli.com/https://www.anabias.com/https://bcrbltd.com/https://s2aconsultingfze.com/https://rock-poker.com/https://koinhoki88.org/https://koinhoki88.net/https://rawsolla.com/https://koinhoki888.com/https://koinhoki88.com/https://infomedan.net/qqplazaslot gacorslot gacor koinhoki88slot gacor terbaru koinhoki88koinhoki88koinhoki88slot777https://usfinancehelp.com/https://collectingdiecasttoystoday.com/https://nyonyaguru.com/https://topindo-pulsa.com/https://gojekonline.com/https://dafrastar.com/https://www.reliantholdings.net/https://www.opalcitysview.com/https://lumarca.info/https://alt-qqaxioo.com/https://www.capuletlondon.com/https://www.tithaimart.com/https://www.trungvuongus.com/https://tropicalbioenergy.com/https://www.capitol-peak.com/https://pisswife.com/https://gamvipvn.com/https://www.elfutbolesnuestro.com/https://ampdsmart.com/https://schiffsilver.com/https://theicemall.com/https://shebenik.com/https://popvoxawards.com/https://www.adwebconsultancy.com/https://www.technotchsolutions.com/https://threekookaburras.com/https://marcjacobsonsale.com/https://www.forexrehberim.net/https://dreamlifefactory.com/https://www.videosocialcreative.com/https://www.oregonwetlands.net/https://www.americaneve.com/https://www.iamthelongtail.com/https://www.privatelivesbroadway.com/https://travelamateurs.com/https://sustaintheline.com/https://geekforcefive.com/https://galaksinews.com/https://sejutateknologi.com/https://harimausumateranews.com/https://diarysaham.com/https://lacakonline.com/https://undangansah.com/https://kottakkalayurvedapharmacy.com/https://kabforums.org/https://bhootmedia.com/https://erectie-goedkoop.com/https://heylink.me/Bandargaming-/https://qqcrownbos.com/https://bbqburgersmore.com/https://bjwentkers.com/https://mareksmarcoisland.com/https://safepaw.com/https://www.caretuner.com/https://myvetshop.co.za/https://rtxinc.com/https://voice-amplifier.co.uk/https://shamswood.com/