సెమి ఫైనల్లో ఆసీస్ చిత్తు
జెమీమా సెంచరీ… విజయానికి బాట వేసిన కౌర్ భాగస్వామ్యం
(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)
ఐ.సి.సి. మహిళల ప్రపంచ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్లోకి భారత జట్టు దూసుకెళ్లింది. జెమీమా వీరోచిత పోరాటంతో 339 పరుగుల లక్ష్యాన్ని భారత మహిళలు ఐదు వికెట్ల తేడాతో ఛేదించారు. జెమీమా రోడ్రిగ్ (115 బంతుల్లో సెంచరీ), కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ (89 ) పరుగులతో చెలరేగారు. ఇద్దరు మూడో వికెట్ కు 167 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 59 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో వీరిద్దరూ నిలకడగా ఆడారు. కౌర్ నిష్క్రమణ అనంతరం జెమీనాకు దీప్తి శర్మ తోడయ్యారు. ధాటిగా ఆడారు. చివరి పది ఓవర్లలో 82 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆ సమయానికి జెమీమా 95 , దీప్తి శర్మ 18 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. 41 వ ఓవర్లో దీప్తి (24 ) రనౌట్ అయ్యారు. తర్వాత రిచా ఘోష్ బ్యాటింగుకు దిగారు. నాలుగో బంతిని సిక్సర్ కొట్టారు. పదకొండో బంతిని కూడా సిక్సర్ కొట్టారు. అప్పటికి విజయ లక్ష్యం నలభై పరుగులు. చివరి ఐదు ఓవర్లలో విజయ లక్ష్యం 34 . ఈ దశలో రిచా జోడి ( 26 ) అవుటయ్యారు. అమంజోత్, జెమీమాకు తోడుగా బ్యాటింగుకు వచ్చారు. జెమీమా (127 ), అమన్ జ్యోతి (15) జోడీ భారత జట్టును విజయతీరాలకు చేర్చింది.

ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. లీక్ ఫీల్డ్ 119 , ఎల్లిస్ పెరి 77 , గార్డనర్ 63 పరుగులు చేశారు. ఒక్క బంతి మిగిలిఉండంగా ఆస్ట్రేలియా జట్టు 338 పరుగులకు ఆలవుటైంది.

