Wednesday, September 28, 2022
HomeArchieveయండమూరి చిత్రం 4న విడుద‌ల‌

యండమూరి చిత్రం 4న విడుద‌ల‌

“అతడు ఆమె ప్రియుడు” నుంచి
కౌశల్ సింగిల్ టేక్ డైలాగ్ రిలీజ్!!
హైద‌రాబాద్‌, ఫిబ్ర‌వ‌రి 2:
ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాధ్ తాజాగా దర్శకత్వం వహించిన వినూత్న కథా చిత్రం “అతడు-ఆమె-ప్రియుడు”. ఈ చిత్రాన్ని ఈ నెల 4న విడుద‌ల చేస్తున్నారు.
సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై స్టార్ హీరో సునీల్-బిగ్ బాస్ ఫేమ్ కౌశల్-సీనియర్ నటుడు బెనర్జీ ముఖ్య పాత్రల్లో న‌టించిన ఈచిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించారు. శ్రీ‌మతి కూనం కృష్ణకుమారి సమర్పణలో… రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ విభిన్న కథాచిత్రాన్ని నిర్మించారు.


ఈ చిత్రంలో కౌశల్ నటించిన సింగిల్ టేక్ డైలాగ్ టీజర్‌ను ఈ రోజు అంటే 02.02.22.మధ్యాహ్నం.02గం.02.నిమిషాలకు చిత్ర దర్శకులు యండమూరి వీరేంద్రనాధ్ విడుదల చేశారు. స్త్రీ ఔన్నత్యం గురించి యండమూరి రాసిన రెండు పేజీల డైలాగ్‌ను కౌశల్ సింగిల్ టేక్ లో చెప్పారు. అందుకే… ఈ డైలాగ్ ట్రైలర్ ను చిత్ర రచయిత-దర్శకుడు యండమూరి ప్రత్యేకంగా విడుదల చేశారు. నటుడిగా కౌశల్ కు ఉజ్వల భవిష్యత్ ఉందని ఈసందర్భంగా యండమూరి పేర్కొన్నారు.
ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, కెమెరా & కూర్పు: మీర్, నిర్మాణ సారధ్యం: అమర్, సమర్పణ: శ్రీమతి కూనం కృష్ణకుమారి, నిర్మాతలు: రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: యండమూరి వీరేంద్రనాధ్!!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ