Thursday, September 29, 2022
HomeArchieveఫిబ్రవరి 18న 'సన్ ఆఫ్ ఇండియా'

ఫిబ్రవరి 18న ‘సన్ ఆఫ్ ఇండియా’

విడుద‌ల‌కు స‌న్నాహాలు
మోహ‌న్ బాబు హీరోగా సంచ‌ల‌నాత్మ‌క చిత్రం
హైద‌రాబాద్‌, ఫిబ్ర‌వ‌రి 2:
స‌న్ ఆఫ్ ఇండియా చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. కలెక్షన్‌ కింగ్‌ డా. మంచు మోహన్‌బాబు హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం డైమండ్‌ రత్నబాబు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌తో కలసి విష్ణు మంచు నిర్మించారు.
చిత్రకథానాయకుడిగా డాక్టర్‌ మోహన్‌బాబు అదనంగా చిత్రానికి స్క్రీన్‌ప్లే బాధ్యతను కూడా నిర్వహించారు. ప్రముఖతారాగణమంతా ప్రధానపాత్రలను పోషించిన ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ చిత్రం డాక్టర్‌ మోహన్‌బాబు మార్కు డైలాగులు, యాక్షన్‌ ఎపిసోడ్స్‌, ఊహించని మలుపులతో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది.

ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 18న విడుదల చేస్తున్నట్టు ఈ రోజు (2.2.2022) మోహన్ బాబు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించారు.
డా.మోహన్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, తనికెళ్ల భరణి, అలీ, వెన్నెల కిషోర్, ఫృథ్వీ రాజ్, రఘుబాబు, రాజా రవీంద్ర, రవిప్రకాష్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీతం సమకూర్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ