రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లిన శేషేంద్రశర్మ

Date:

మే ౩౦న శేషేంద్ర వర్థంతి
(ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్)

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది
కన్నుల్లో నీరు తుడిచీ కమ్మటి కల ఇచ్చింది
శేషేంద్ర శర్మ కేవలం ఒక్కటేఒక్కట పాట రచించిన మహానుభావుడు. ఎంత లోతుకి దిగి ఆలోచన చేసుకుంటాడో. ఏమనుకుంటాడో. పాట ఒకటి వచ్చింది అంటే చాలు. అర్థం చేసుకోవడానికి. కమ్మటి కలం ఇచ్చింది అనే భావన కళ్ల ముందు కనబడుతుంది కదా.
రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లిందీ
దీనురాలి గూటిలోన దీపంగా వెలిగిందీ
శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపిందీ
ఆకు రాలు అడవికి ఒక ఆమని దయచేసిందీ

పై సినీ గీతాన్ని వినండి, చదవండి.
ముగ్గులు వేస్తుంది ఈ భావన. దీపమై వెలుగుతుంది. ఏ వేణువుకైనా శూన్యలోనే ఉంటుంది కదా. కనుక ఆ శూన్యంలో స్వరాలు కలుపుతున్నాయి. ఆకు రాలు అడవికి ఒక ఆమని దయచేసింది. ఆ మాటలు మాట్లాడుకుంటాయి. ఆశలు, ఆకులు, దిగులు, రాలిపోయేవి. ఆమనిని తెప్పిస్తుంది. అది అడవి. అందులో ఏదో ఆశ. ఆకాశంలో నుంచి నదికి దిగి అక్కడ నదీ తీరాన నిలబడి ఒక పడవ వస్తుందని, ఎవరైనా వస్తారా అనీ, వస్తే బాగుండును అనుకుంటూ, వచ్చి తీరుతుందనే నమ్మకం…
విఫలమైన నా కోర్కెల వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినబడి అంతలో పోయాయి
కొమ్మల్లో పక్షుల్లారా!
గగనంలో మబ్బుల్లారా!
నది దోచుకుపోతున్న నావను ఆపండీ!
రేవు బావురుమంటోందని నావకు చెప్పండీ!
ఈ పాట లింకు ఇక్కడ https://www.youtube.com/watch?v=fgmx0Q887RI

అక్కడే గుమ్మంలోనే కోర్కెలు వేలాడుతున్నాయి. అవి విఫలమైనాయి. ఆశలు వస్తాయా రావా, వినబడతాయా లేదా. పక్షుల్లారా అని పిలుస్తున్నాయి, మబ్బుల్ని రమ్మంటున్నారు. నది దోచుకుంటున్నది. నావను ఆపుతున్నారు. రేవు అక్కడే ఏడుస్తున్నది బావురుమని. ఇది మేఘ సందేశం కాదు. నదీ సందేశం. నావకు సందేశం. భావగీతికా సందేశం. ఇంకా వస్తారు అనే ఆశ… రచయితను, గేయాన్ని, స్వరరచయితను, కథానాయికను బతికిస్తుంది.
గంభీరమైన, స్పష్టమైన, లోతైన, గాఢమైన, కనబడని, వినబడని, ఈ భూమి నుంచి ఆకాశం దాకా వినబడేట్టు అరుస్తున్నట్టు స్పష్టంగా చెప్పగలిగిన కవి ఎవరు?
బాధాభిషేకం మనసంతా నిండిన మహాకవి, రచయిత, తెలుగు సంస్కృత భాషల్లో అద్భుతమైన పట్టు కలిగిన గొప్ప నవలా రచయిత. శర్మగారితో కలిసి, వారి ఇంట్లో చాలా సేపు సాహితీ వైభవం గురించి ముచ్చట్లు చెప్పుకునే అవకాశం వచ్చింది ఈ రచయితకు. చాలా సార్లు శేషేన్ ప్రసంగాలను కూడా వినగలడం అదృష్టం.

జూన్ మొదటి తేదీన…
నీ మీద ప్రేమకు స్వల్పమైన అభివ్యక్తి- నాయనా
నాకుంబుత్రుడు నాకు తండ్రియున్ నన్నత్యంత ప్రేమాన్విత
ప్రాకారంబయి కాచుచుండు కవితాప్రాగర్భ్య ధౌరేయుడున్
సాకారంబగు నైతికత్వమును ఛాయాదాయివృక్షంబునున్
ధీకాంతి స్ఫురదాస్యు సాత్యకిని నే దీవింతు శేషేంద్రుడన్.
శుభమస్తు- ఇట్లు-మీ నాయన- శేషేంద్రశర్మ (11.5.2001)

మహాకవి శేషేంద్ర శర్మగారి కుమారుడు సాత్యకికి ప్రేమతో ఇచ్చిన పద్యమనే గొప్ప సంపద ఇది.
శేషేంద్ర శర్మ స్వయంగా రాసిన మాటలు చదువుకోవాల్సిందే. ఎంత ప్రేమ? ఎంత ‘‘ప్రేమాన్విత ప్రాకారంబయి కాచుచుండు’’ అంటూ సాత్యకిని ఆశీర్వదిస్తున్నారు. ఎంత ప్రేమ. ‘కవితాప్రాగర్భ్య ధౌరేయుడున్’ అనడం ఎంతో గంభీరంగా ఉంది కదా. (వైద్య సమస్యల్లో నుంచి కోలుకోవాలని, మామూలుగా పూర్తిగా మేలుకోవాలని శుభాకాంక్షలతో, మిత్రుడు సాత్యకి సౌజన్యంతో)

వృక్షాలు పుష్ప దేవతలై తేలిపోతూ ఉన్నాయి
బాధల, గాథలయి వినబడే విధంగా ఈ రచన గురించి ఏమనాలి. ఎన్ని పుస్తకాలు రాసి చెప్పినా పూర్తవుతుందా?

శేషేంద్ర రచనలో ఎవరైనా దేనికోసం.. పువ్వెడు వసంతం కోసం అదే ఈ కవిత వసంతం కోసం

పువ్వెడు వసంతం కోసం
వసంత ఋతువు వచ్చిందో లేదో ఆ కోకిల కంఠం ఎలా పేలిపోతోందో చూడు
వృక్షాలు పుష్ప దేవతలై తేలిపోతూ ఉన్నాయి
వాక్యాలు పట్టాలు తప్పి ప్రేమ లోయల్లోకి దొర్లిపోతున్నాయి
మాటలు , పాటలు నినాదాల మైదానాల మీద
రాళ్లై చెప్పులై రాలుతున్నాయి
మిత్రమా ! ఒక్క క్షణ కాలం మరిచిపోదాం
ప్రజల కన్నీళ్లు పుస్తకాలుగా మార్చి అమ్ముకు తినే కవుల్ని
ఇది చెట్ల మీద ఆకులూ పువ్వులూ ప్రవహిస్తున్న కాలం
పంచభూతాలన్నీ కుట్ర చేసి మన మీద విసిరేస్తున్న ఇంద్రజాలం
ఇప్పుడు గులాబీలు కూడా నీ చిరునవ్వుల్ని కాపీ కొడుతున్నాయి
నీవిప్పుడు ఒక జాబువై, రైలెక్కి , ప్లేనెక్కి, వానెక్కి ఎప్పుడెప్పుడు నా చేతుల్లో
వాలిపోదామా అని ఒక ప్రగాఢ స్వప్న పరిమళాల్లో లీనమయిపోతున్నావు
కానీ నా ఆత్మ కథ నీకేం తెలుసు ?
ఇవాళ నా కథలో ఏ తేనెటీగా వాలడానికి ఒక్క పువ్వు కూడా లేదు
వసంతాలకు ఈనాడు నేను వాసయోగ్యం కానేమో !
ఎప్పుడు ఆకులు రాలుతాయో
ఎప్పుడు నగ్న శాఖల్లో
నక్షత్రాలు పూస్తాయో నాకు తెలీదు
వసంతాలు వస్తున్నాయ్
వసంతాలు పోతున్నాయ్
ఒక్క పువ్వెడు వసంతం కోసం చెట్లు ఆకులన్నీ రాల్చుకుంటున్నాయి
సజీవ భావోద్వేగంలో జీవితం సత్యాక్షరాలు రాలుస్తుంది
వెయ్యి దీపజ్యోతుల భుజం తడుతూ ఒక్కక్క గాలికెరటం కదులుతుంది
రేపు –
ఎండల పాండిత్యం అనుభవిస్తున్న కర్షకుడికి
అదే ఒక పువ్వులాంటి కబురు

కోకిల కంఠం ఎలా పేలిపోతున్నాయనే భావన. మరి కొన్ని బ్రహ్మాండమైన భావనలు: ‘పుష్ప దేవతలై, వాక్యాలు పట్టాలు తప్పి, పాటలు నినాదాల, రాళ్లై చెప్పులై రాలుతున్న’ అన్నారు. ‘‘కన్నీళ్లు పుస్తకాలుగా మార్చి అమ్ముకుతినే కవుల్ని’’ అనే పదాల్లో ఎంత కసి, ప్రశ్న, ఆవేదన… ఈ వ్యాసంలో ప్రతిక్షణం ప్రతికణం, ప్రత్యక్షం కనిపించే కవిత్వం ఇది కదా. ఇక్కడ పుష్పాలు ప్రవహిస్తాయి. పంచభూతాలు కుట్ర చేస్తున్నాయి. గులాబీలు కూడా నీ చిరునవ్వుల్ని కాపీ కొడుతన్నాయట. గొప్ప కవితలన్నీ కాపీచేసుకునే వాళ్లు ఉంటారంటే, ఎంత గొప్ప? ఎంత నీచం? వాటికి కావలసింది ..
స్వప్న పరిమళాల్లో లీనమయిపోతున్నావు అంటున్నాడు. అవి నగ్న శాఖల్లో.. అవి అందులో నక్షత్రాలు పూస్తాయి. ఒక్క పువ్వెడు వసంతం కోసం ఆకులన్నీ అని ప్రకటిస్తున్నారు. ఇది ‘‘పువ్వెడు’’ కొత్త ఆలోచనలు రాల్చుకుంటున్నాయి. ఇది సజీవ భావోద్వేగం. సత్యాక్షరాలు రాలుస్తుంది. వెయ్యిదీప జ్యోతులు, ఎండల పాండిత్యం అనుభవించే కర్షకుడికి కబురు పంపిస్తున్నారట.
ఎన్ని ఎన్నెన్ని భావనలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి. ఆ శేషేంద్రుని మెదళ్ల పొరల్లో అక్కడ ఏమున్నాయి. ఎక్కడ సృష్టిస్తున్నాయి. ఎక్కడినుంచి తయారు చేసారు. ఇది ఎంత రాసినా విన్నా చదివినా సరిపోదు. ఎన్ని పేజీలని ఇవ్వగలను. అక్కడ మనం కొత్త భావనలు కొనుక్కోవచ్చు, అడుక్కోవచ్చు. కొత్తవి కనిపెట్టవచ్చు.

ఇది శేషేంద్రుని గద్యపద్య కవిత. https://www.youtube.com/watch?v=0kz2_AlsM6c
కవిసమ్మేళనంలో ఆకాశవాణి 14 ఏప్రియల్ 1983 రుధిరోద్గారి నామ ఉగాది నాడు రవీంద్ర భారతి (హైదరాబాద్) పాడించినట్టు చెప్పినది. నిర్వహించిన పెద్దలు శ్రీ సుధామ.
( http://seshendrasharma.weebly.com) interview by DoorDarshan Kendra ( D.D. Yadagiri : Hyderabad Telangana 1999). Interviewer Sri Voleti Parvathisham)
https://www.youtube.com/watch?v=wwuHRYK-XLE (Interview with Dr.Gunturu SeshendraSharma)

ఇంకా సరిపోదనుకుంటే ఇక్కడ చదువుకోవచ్చు.
Visionary Poet of the Millennium, An Indian poet Prophet, Seshendra Sharma
(October 20th, 1927 – May 30th, 2007)
http://seshendrasharma.weebly.com/
https://tribupedia.com/seshendra-sharma-memorial-tribute/
https://seshen.tributes.in/
https://www.facebook.com/GunturuSeshendraSharma/
eBooks :http://kinige.com/author/Gunturu+Seshendra+Sharma
నేను రచయితను కాదు. గుంటూరు శేషేంద్ర శర్మగారి కవిత్వాన్నే చదువుకుని, ఆలోచించి, దొరికిన కొన్ని అనర్ఘ రత్నాల గురించి సేకరించిన వ్యక్తిని మాత్రమే.

‘శూన్యమైన వేణువులో ఒక స్వరం..’
ఇదీ శేషేంద్ర ‘ఆధునిక మహాభారతం’లోని మయూర పర్వంలో తన ఆవేదన, ఆవేశం అంటూ ‘నీచుల తమాషా’ గురించి రచించినారు.
ఈ రక్తప్రవాహం కావాలి.
కానీ అందులో కొందరు పడవలు వేసుకుని ప్రయాణం చేస్తున్నారు.
కీర్తి శిఖరాలకు…
వాళ్ల లక్ష్యం కీర్తి శిఖరాలే గాని ఈ రక్తం ఎవరిదో, ఎవరివకోసం కారిందో వారి క్షేమం కాదు.
వాళ్లు తమ రక్తం ఒక్క బొట్టు కూడా కార్చరు.
పరాయివాళ్ళ రక్తం పారితే పాటలు రాస్తారు….
నేను చచ్చిపోవడం మంచిదే అయ్యింది.
చచ్చిపోతే ఈ నీచుల తమాషా చూస్తూ ఉండవచ్చు.
నాకేం కావాలి?
నా పాటల్ని పూలు పక్షులు గానం చేస్తాయి. గాలులు, ఆకాశాలు దూరతీరాలకు మోసుకుపోతాయి.
పాటలయినా, కవిత్వమైనా మనసుకు లోతైన ఆలోచన ఇస్తుంది. కాస్సేపు మనసులో చూసుకుని మనసునే మరోసారి అవునా! అవుననుకుంటా! అని అనుకునే ఆలోచన కనబడుతుంది.


(వ్యాస రచయిత కేంద్ర సమాచార కమిషన్ మాజీ కమిషనర్, మహీంద్రా లా కాలేజ్ డీన్)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Prof.Purushottam Reddy: Renowned Academician

Environmentalist and Developmental Activist  (Prof Shankar Chatterjee)     ...

We are here to help our country: Trump

This is a moment never seen before We are here...

Uddhav Thackeray: Congress riding Shiv sena tiger?

(Dr Pentapati Pullarao) In November 2019, Uddhav Thackeray broke of...

US Elections vs Indian Polls

Plethora of similarities in campaigning style (Anita Saluja) As the US...