వయసులో పెద్దవాడైనా అందుకే స్నేహం కుదిరింది
ఈరోజు ..’ పేకేటి శివరాం ‘ పుట్టినరోజు
(ఎ.రజాహుస్సేన్)
పేకేటి శివరాం…నటుడు, రచయిత, దర్శకుడు ,
నిర్మాత..ఫొటోగ్రాఫర్..ఇంకా…ఇంకా…అన్నిటికి
మించి సహృదయుడు..నా మిత్రుడు..!!
కన్నడ సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగిన….
దర్శకుడు..నిర్మాతగా కూడా. ఎన్నో సినిమాల్లో
నటించాడు దర్శకత్వం వహించాడు..సినిమాలు నిర్మించాడు.
పేకేటి శివరాం..ఈ తరానికి అంతగా…
తెలీకపోవచ్చు గానీ, మాతరం వారికి
బాగా తెలుసు…!!
“ఇల్లరికం లో వున్నా మజా,..
అది అనుభవించితే తెలియునులే
భలే ఛాన్సులే…..
లలలామ్..లలలామ్ లకీ ఛాన్సులే “!!
ఈ పాట ఇప్పటికీ సూపర్ హిట్టే…

రేలంగి, రమణారెడ్డి తో పాటు పేకేటి పై
‘ఇల్లరికం ‘ సినిమాలో చిత్రీకరించబడింది.
అక్కినేని నాగేశ్వరరావు దేవదాసైతే…
అతనిస్నేహితుడు ‘భగవాన్ ‘ గా పేకేటి
శివరాం నటించాడు.
తెలుగు ప్రేక్షకులకు దేవదాస్ గా అక్కినేని
ఎలా గుర్తుండిపోయారో…భగవాన్ గా…..
పేకేటి అలా గుర్తుండిపోయారు…శరత్
దేవదాసు. భగవాన్ పాత్రలో చిరస్మరణీయమైన నటనను కనబరిచాడు పేకేటి శివరాం..గారు.
ఇక వద్దంటే డబ్బు..సినిమాలో ఎన్టీఆర్
స్నేహితుడిగా పేకేటి శివరామ్ చిరకాలం గుర్తుండేలా నటించారు…
ఇక ఎన్టీఆర్ ప్రొడక్షన్ హౌస్ లో ఓ సినిమా
కు..దర్శకత్వం వహించారు….!
చాలాకాలం మద్రాసులో , బెంగుళూరులో
వున్నారు..చివరి రోజుల్లో హైదరాబాద్ లో
కూడా వున్నారు.అప్పుడే పేకేటి శివరాం..
గారితో నాకు పరిచయం కలిగింది…

(పేకేటి శివరాంకు కుడి పక్కన ఉన్నది వ్యాస రచయిత రజా హుస్సేన్)
నా వయసు ఆయన కంటే చాలా తక్కువే..
అయినా…అది మా మధ్య స్నేహానికి అడ్డు
కాలేదు ..గొప్ప మేధావి.నడిచే చలన చిత్రం..
ఆయన పుట్టినరోజున ఇలా గుర్తుచేసుకోవ
డాన్ని ‘ప్రివిలేజ్’ గా భావిస్తున్నాను…!!

