రేవంత్ దెబ్బకు డిజిటల్ మీడియా గిలగిలా

0
75

ఫలించిన రేవంత్ రెడ్డి వ్యూహం?!
కేసులు – ప్రభుత్వ హెచ్చరికలతో బి.ఆర్.ఎస్.కు దెబ్బ మీద దెబ్బ!
ప్రభుత్వంపై విమర్శల అంశంలో ఆచి తూచి అడుగేస్తున్న సోషల్ మీడియా!

ఇటీవలి కాలంలో డిజిటల్ (సోషల్) మీడియా పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఫలితంగా డిజిటల్ మీడియా గతంలో మాదిరిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడడం లేదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల ఎన్ టీవీ లో అసంబద్ధ కథనాలు ప్రసారం చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం కూడా ఇందుకు కారణం కావచ్చని వారు భావిస్తున్నారు.

భారతీయ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన డిజిటిల్ మీడియా కూడా రేవంత్ రెడ్డి పైన, ప్రభుత్వం పైన కథనాల యుద్ధం (Narrative war) గతంలో మాదిరిగా చేయలేక పోతుంది. వాస్తవంగా చెప్పుకుంటే సోషల్ మీడియా పైన కాంగ్రెస్ పార్టీ కంటే బి ఆర్ ఎస్ పార్టీకే మంచి పట్టుంది. అందుకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి సోషల్ మీడియాలో ఇష్టానురీతిన రీతిన కథనాలు ప్రచారం చేసి రేవంత్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది.

దీన్ని అధిగ మించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ ఒక వ్యూహం ప్రకారం అడుగులు వేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు, దానిపై సిట్ దర్యాప్తు చేయడం. BRS ప్రభుత్వ కాలంలో అక్రమంగా ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపణ చేయడమే కాదు KCRకి సమన్లు జారీ చేయడం సంచలనం సృష్టించింది. ఇదే కేసులో కేటీర్, హరీష్ రావులను విచారించడం. అలాగే KTR పై ఫార్ములా E రేస్ కు సంబంధించిన కేసు. దీనిపై కేటీర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి ఇచ్చారు.

మరో వైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసు పై (KCR & Harish Rao) Justice Ghose Commission రిపోర్ట్‌లో KCR బాధ్యత ఉందని పేర్కొన్నారు. హరీష్ రావు పైన విచారణ, కేసును సీబీఐకి అప్పగించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం.

ఈ మూడు కేసులతో BRS పార్టీలో తీవ్ర కలకలం రేగింది. కెసిఆర్ ని టచ్ చేస్తే తెలంగాణ భగ్గుమంటుందని సోషల్ మీడియాలో హెచ్చరిస్తూ ఆ పార్టీ వారు ఎంతగా రెచ్చగొట్టినా ఫలితం లేకపోయింది.

స్థానిక గ్రామ, మండల, మున్సిపల్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు తన సోషల్ మీడియాను ఎంతగా ఉపయోగించిన బి ఆర్.ఎస్ కు ఫలితం లేకపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికే ప్రజలు పట్టం కట్టారు. దాంతో బి ఆర్ ఎస్ సోషల్ విభాగం బాగా డీలాపడిపోయింది.

Stuttgart, Germany – April 5, 2021: Logo of social media icons marketing network Facebook, Instagram, YouTube, Twitter and WhatsApp on the internet in Stuttgart, Germany.

ఫలితంగా సోషల్ మీడియా ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంపై ఇష్టాను రీతిగా కథనాలు వండి వార్చడంలో వెనుకడుగు వేస్తున్నాయి, బి.ఆర్.ఎస్. పార్టీ సోషల్ విభాగాన్ని దెబ్బ తీయడంలో ముఖ్యమంత్రి రేవంత్ వేసి ప్లాన్ సక్సెస్ అయింది.

ఇటీవలి కాలంలో డిజిటల్ మీడియాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ బహిరంగ సభలో చేసిన హెచ్చరికలు….
👉 ఫేక్ న్యూస్‌పై కఠిన చర్యలు తప్పుడు వార్తలు (fake news), రూమర్లు ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తాం.
👉ప్రజలను తప్పుదోవ పట్టించే కంటెంట్‌పై పోలీస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు.
👉వ్యక్తిగత దూషణలు / అసత్య ప్రచారం నేతలపై ఆధారంలేని ఆరోపణలు, దూషణలు చేస్తే డిఫమేషన్ కేసులు వేస్తామని చెప్పారు
👉“యూట్యూబ్ జర్నలిజం పేరుతో ఎవ్వరినైనా అవమానించొద్దు” అని సూచించారు.
👉 రిజిస్ట్రేషన్ & అకౌంటబిలిటీ డిజిటల్ మీడియా కూడా బాధ్యతగా పని చేయాలి.
అవసరమైతే రిజిస్ట్రేషన్ వ్యవస్థ తీసుకువస్తామని సంకేతం ఇచ్చారు. “ఎవరు న్యూస్ ఇస్తున్నారు? వారి బాధ్యత ఎవరిది?” అన్న ప్రశ్న లేవనెత్తారు.
👉 సోషల్ మీడియాలో తప్పు సమాచారం, ఎడిటెడ్ వీడియోలు, ట్రోలింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు. IT Act & IPC సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని చెప్పారు.
👉ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం ప్రభుత్వ నిర్ణయాలపై వాస్తవాలు చెక్ చేయకుండా తప్పుగా ప్రచారం చేస్తే “అలాంటి ఛానళ్లను వదిలిపెట్టం” అని హెచ్చరించారు.

ప్రధాన ఉద్దేశ్యం …
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరికలో ప్రధాన ఉద్దేశ్యం వున్నది, అదేమంటే “ సోషల్ మీడియా కు స్వేచ్ఛ ఉంది… కానీ బాధ్యతతో కూడా ఉండాలి” అన్నదే ఆయన భావన. జర్నలిజం పేరుతో ఫేక్ కంటెంట్, దూషణలు, మిస్‌లీడింగ్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మొత్తం మీద సోషల్ మీడియాలో గతంలో మాదిరిగా దూకుడుగా వ్యవరించడంలో వెన్నకి తగ్గాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here