బుర్రలు చచ్చుపడుతున్నాయెందుకు?

0
604

(వాసిరెడ్డి అమర్నాథ్)
(ఈ వ్యాసం శీర్షిక చూసి, మనకి సంబంధించింది కాదులే అని మరొక అంశానికి వెళ్లిపోవద్దు. ఇప్పుడు అధికశాతం మంది ఇలాగే ఇబ్బంది పడుతున్నారు. ఏమిటా సమస్య… దానికి కారణాలు… పరిష్కారాలను కూడా రచయిత ఇందులో సూచించారు. మన కోసం కాదు మన భావితరాల కోసం దీనిని పూర్తిగా చదవండి. సోషల్ యానిమల్ అనే పదానికి అర్ధం తెలుసుకోండి)
👎 లక్ష రూపాయిల జీతం వచ్చే సాఫ్ట్వెర్ ఇంజనీర్ రెండు కోట్లకు బెట్టింగ్ కాస్తాడు .
ఎలా కట్టాలని ?

👎పదో తరగతి ఫెయిల్ అయ్యి వ్యవసాయ కూలీ పని చేసుకొంటున్న యువకుడు BMW కారు కొనలేదని తల్లితండ్రుల పై కోపం తో ఆత్మ హత్య చేసుకొంటాడు.
డబ్బులు ఎక్కడినుంచి వస్తాయని ?
అప్పో సప్పో చేసి … కారు కొన్నారే అనుకొందాము ..దాన్ని వేసుకొని ఎక్కడికి వెళుదామని ? దానికి వారానికి రెండు సార్లు పెట్రోల్ / డీజిల్ ఎలా కొట్టించాలని ? నెలకో ఆరు నెలలకో సర్వీసింగ్ ఎలా చేయించాలని ?

👎ప్రియుడితో కలిసి భర్త ను మర్డర్ చేసిన భార్య !
పోలీసుల నుండి ఎలా తప్పించుకొందామని ?

మామూలు మనుషులే కాదు .
ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులు.. రాజకీయ నాయకులు..
వారు వీరు అని తేడా లేదు.
జనాల్లో ఇంగిత జ్ఞానం చచ్చింది.
విచక్షణ.. ఓపిక, ఏకాగ్రత , జ్ఞాపక శక్తి మట్టిలో కలిసిపోయింది .
లోకమంతా జోంబీల మయం.

ఎందుకిలా ??

అంతా రీల్స్ మయం .. జగమంతా రీల్స్ మయం ..
రీల్స్ .. రీల్స్ .. రీల్స్ !
ఇరవై సెకండ్ల రీల్స్ !
ఇన్స్టంట్ కిక్ .
క్రమేపీ మెదడు దీనికి అలవాటు పడిపోతుంది .

దీని వల్ల…
1 ఎక్కువ సేపు ఒక పని దృష్టి పెట్టలేని స్థితి వచ్చేస్తుంది .
ఏదైనా క్షణాల్లో అయిపోవాలి .
నిజ జీవిత సమస్యలు క్షణాల్లో పరిష్కారం కావు .
వాటి పై దృష్టి పెట్టాలి .
లోతుగా ఆలోచించాలి .
ఒక్కో సారి… వారం.. పది రోజులు ఆలోచించాలి !
రీల్స్ జీవుల మెదడుకు అంత ఓపిక ఉండదు .
ఏదో తోచింది చేసేస్తారు .
2 . అంటే ఇంగిత జ్ఞానం కొరవడుతుంది.
తక్షణ ఫలితాలకు అలవాటు పడిన మనసు షార్ట్ కట్స్ ను కోరుకొంటుంది.
సమస్య ఏమిటంటే జీవితం లో చాలా వాటికి షార్ట్ కట్స్ ఉండవు.

అధిక తిండితో పది ఇరవై ఏళ్ళు పెంచిన బరువును వారం లో తగ్గించుకోవాలంటే కుదురుతుందా ?
డబ్బాలో వచ్చే పచ్చ మందు బరువు తగ్గిస్తుందంటే నమ్మేస్తారు.
ఈజీగా బకరాలు అయిపోతారు .
కిడ్నీ లు పోయాక కానీ అసలు విషయం అర్థం కాదు .
పాడయిన కిడ్నీ ల రిపేర్ కు ఇంకో దొంగ మార్గం పడుతారు.
దానితో ఇంకో దెబ్బ . దెబ్బ మీద దెబ్బ .. కోలుకోలేని దెబ్బలు .
3 . ఇరవై సెకన్లలో కిక్కు కు అలవాటు పడిన మెదడు ఎక్కువ సేపు పని చెయ్యడానికి ఇష్టపడదు .
అంటే ఏకాగ్రత … దానితో పాటే జ్ఞాపక శక్తి చచ్చిపోతుంది .
విద్యార్థుల్లో చదువు నాశనం .
మన పిల్లాడు చదవడు అని తెలుసు .
కాపీ లు కొట్టించి , దొంగ మార్కులు ఇచ్చి .. బడులు.. టీచర్లు .. విద్యాధికారులు తంటాలు పడుతుంటే .. వచ్చిన బోగస్ మార్కులను చూసి మురిసిపోయే తల్లీతండ్రీ ..

చివరాఖరికి సీబీఎస్సీ ఫలితాలను సైతం తలకిందులు చేసే ఉన్నత స్థితికి తెలుగు రాష్ట్రాల విద్యా వవస్థలు తయారయ్యాయి .
ఒక బోకు స్కూల్. (కార్పొరేట్ కాదు . అక్కడ మరీ ఇంత దయనీయ స్థితి ఉండదు)
అనే క బ్రాంచ్ లు
పరమ చెత్త సరుకు .
గత పదేళ్లలో ఆ స్కూల్ వివిధ బ్రాంచ్ ల ప్రిన్సిపాళ్లు అనేక మంది .. సుమారుగా పది మంది దాక .. టీచర్ పోస్ట్ కోసం ఇంటర్వ్యూ కొచ్చారు.నా దగ్గర 60 మార్కులు వస్తే సెలెక్ట్ అయినట్టు . ఈ బడి ప్రిన్సిపాళ్లు కనీసం ఇరవై మార్కులు సాధించలేదు.
వీరి సిబిఎస్సీ బడిలో 595 మార్కులు ..
దేవుడా .. కాపీ కొట్టడం కూడా చేతకాని వారికి ఇన్ని మార్కులు వచ్చాయంటే .. ఎంత మతలబు జరిగి ఉండాలి ?
(ఒళ్ళు మండిన నేను ఆ మధ్యలో ఒక పని చేద్దాము అనుకొన్నా.. 600 కు 600 .. 590 మార్కులు వచ్చిన విద్యార్థులు .. వారికి చదువు చెప్పిన గురువులకు ఆహ్వానం .. మూడో తరగతి లెవెల్ లో ఒక టెస్ట్ పెడుతా ! ఉదాహరణకు అమ్మ , బడి .. చదువు .. ఇలా సింపుల్ టాపిక్స్ ఇస్తా . ఒక్కో దానిపై నాలుగు వాక్యాలు రాయాలి . అక్షర దోషాలు .. వాక్య నిర్మాణ దోషాలు ఉండకూడదు. పిల్లలు… వారికి చదువు చెప్పిన గురువులు ఒకే చోట కూర్చొని రాయండి . తప్పులు లేకుండా రాస్తే లక్ష బహుమానం అని పేస్ బుక్ పై పోస్ట్ చేసి బహిరంగ ఛాలెంజ్ విసురుదాము అనుకొన్నా .. “గురువుల్ని అవమానిస్తున్నాడు”… అనో ఇంకో పద్ధితిలోనో కాంట్రవర్సీ చేసేస్తారని ఆ ప్రయత్నం మానుకొన్నా).

4 .రీల్స్ ప్రియులు డోపామైన్ లూప్ లో వ్యక్తి చిక్కుతారు.
ఎప్పుడూ ఏదో కిక్కు కావాలి.
ఒకే సారి మూడు నాలుగు పనులు చెయ్యడం మొదలెడతారు .
టీవీ ఆన్ చేసి చూస్తూ మధ్య మధ్యలో సెల్ ఫోన్ చూడడం .. టీవీ లో చానెల్స్ మార్చడం .. సెల్ ఫోన్ లో ఒక పక్క రీల్స్ ఇంకో పక్క సోషల్ మీడియా.. ఏ పని నింపాదిగా చేయలేరు . హైపర్ యాక్టివిటీ .. అసహనం .. దీని వల్ల స్ట్రెస్ పెరుగుతుంది. స్ట్రెస్ వల్ల కార్టిజాల్ హార్మోన్ .. దాన్ని వల్ల గుండె సమస్యలు . అంటే మానసిక శారీరక రోగాలు … వెరసి కలిసి ఫార్మాసురులు లాభ పడుతారు .
✅✅✅✅
1 . రీల్స్ చూడొద్దు .
2 . పుస్తకాలు న్యూస్ పేపర్స్ మ్యాగజైన్స్ చదవండి .
౩. చెస్ లాంటి మెదడుకు పదును పెట్టే గేమ్స్ ఆడండి .
4 . పిల్లలతో భార్య / భర్తతో మనసు విప్పి మాట్లాడండి . వీలైనంత ఎక్కువ సమయం గడపండి .
5 . తరచూ బందువులతో మిత్రులతో కలవండి … మాట్లాడుకోండి
ఒక్కటి గుర్తు పెట్టుకోండి .. కరోనా సమయం లో మీకు అలవాటు చేసినవి .. సామజిక ఎడం పాటించడం .. వేరే వారి ఇళ్లకు వెళ్లక పోవడం .. ఇల్లు దాటి బయటకు పోకపోవడం .. ఇవన్నీ మిమల్ని ముంచడానికే .. ఆన్లైన్ వ్యాపారాలు .. ఓటిటి మొదలు పోర్న్ దాక .. పెంచుకోవడానికి .. మానసిక శారీరక రోగుల్ని చేసి దోచుకోవడానికే .. కాబట్టి ఫార్మసురులు చెప్పినదానికి సరిగ్గా భిన్నంగా చెయ్యండి .
మనిషి సామాజిక జీవి . సామాజిక భావోద్వేగ తెలివితేటలు లేకుండా పిల్లల్ని పెంచితే రోబో యుగం లో వారు యూబీఐ బిచ్చగాళ్లుగా మిగిలిపోతారు
శుభోదయం !

(వ్యాస రచయిత ప్రముఖ విద్యావేత్త, స్లేట్ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here