అత్యధిక కాలం సీఎంగా ఉన్నది ఆయనే….

0
131
The Chief Minister of Sikkim, Shri Pawan Kumar Chamling calling on the Prime Minister, Shri Narendra Modi, in New Delhi on June 15, 2016.

రికార్డు సృష్టించిన సీఎంలు

ఇరవై ఏళ్ళు పైగా పదవిలో ఆరుగురు
(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)

భారత దేశంలో ఇరవైఏళ్ళకు పైగా సీఎంలుగా వ్యవహరించిన వారు ఆరుగురు. వారిలో అగ్రస్థానం సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ ఛాంలింగ్ కు దక్కుతుంది. ఆయన డిసెంబర్ 12 , 1994 నుంచి మే 26 , 2019 అంటే 24 సంవత్సరాల 165 రోజులు పదవిలో ఉన్నారు.

తదుపరి ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ 24 సంత్సరాల 99 రోజులు (5 మార్చి 2000 – 12 జూన్ 2024 ),

బెంగాల్లో జ్యోతి బసు 23 సంవత్సరాల 137 రోజులు (21 జూన్ 1977 – 5 నవంబర్ 2000 ),

అరుణాచల్ ప్రదేశ్ లో గెగోంగ్ అపాంగ్ 22 ఏళ్ల 250 రోజులు (18 జనవరి 1980 – 19 జనవరి 1999 , 3 ఆగష్టు 2003 – 9 ఏప్రిల్ 2007 ),

మిజోరాంలో లాల్ తన్వాలా 22 ఏళ్ల 60 రోజులు,

హిమాచల్ ప్రదేశ్ లో వీరభద్ర సింగ్ 21 ఏళ్ల 13 రోజులు,

త్రిపురలో మాణిక్ సర్కార్ 19 ఏళ్ల 363 రోజులు,

తమిళనాడులో కరుణానిధి 18 ఏళ్ల 362 రోజులు,

పంజాబ్ లో ప్రకాష్ సింగ్ బాదల్ 18 ఏళ్ల 350 రోజులు,

హిమాచల్ ప్రదేశ్లో యశ్వంత్ సింగ్ పార్మర్ 18 ఏళ్ల 83 రోజులు ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు.


బుధవారం నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్ర బాబు నాయుడు ఇంతవరకూ 13 ఏళ్ల 245 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తొలిసారి 1995 సెప్టెంబర్ ఒకటో తేదీనుంచి మే 14 2004 వరకూ, రెండో సారి 8 జూన్ 2014 నుంచి 30 మే 2019 వరకూ సీఎంగా పనిచేశారు.

బీహార్లో నితీష్ కుమార్ 17 ఏళ్ల 296 రోజులు,

నాగాలాండ్లో నిఫియు రివ్ 17 ఏళ్ల 108 రోజులు,

బీహార్లో శ్రీకృష్ణ సిన్హా 17 ఏళ్ల 51 రోజులు,

మధ్య ప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహన్ 16 ఏళ్ల 284 రోజులు,

రాజస్థాన్లో మోహన్ లాల్ సుఖాదియా 16 ఏళ్ల 194 రోజులు,

గోవాలో ప్రతాప్ సింగ్ రాణే 15 ఏళ్ల 325 రోజులు,

నాగాలాండ్లో ఎస్.సి. జమీర్ 15 ఏళ్ల 151 రోజులు,

ఢిల్లీలో షీలా దీక్షిత్ 15 ఏళ్ల 25 రోజులు,

ఛత్తీస్ ఘర్లో రమణ్ సింగ్ 15 ఏళ్ల 10 రోజులు,

మణిపూర్లో ఓక్రమ్ ఇబోబి సింగ్ 15 ఏళ్ల ఎనిమిది రోజులు,

అసోంలో తరుణ్ గొగోయ్ 15 ఏళ్ల ఆరు రోజులు,

రాజస్థాన్ అశోక్ గెహ్లాట్ 15 ఏళ్ల ఆరు రోజులు,

మిజోరాంలో జోరం తంగా 15 ఏళ్ళు.

పుదుచ్చేరిలో ఎన్. రంగ స్వామి 15 ఏళ్ల ఐదు రోజులు,

మేఘాలయాలో విలియం ఏ. సంగ్మా 14 ఏళ్ల 221 రోజులు,

వెస్ట్ బెంగాల్లో విధాన్ చంద్ర రాయ్ 14 ఏళ్ల 159 రోజులు,

తమిళనాడులో జె. జయలలిత 14 ఏళ్ల 124 రోజులు,

సిక్కింలో నర్ బహదూర్ భండారి 13 ఏళ్ల 277 రోజులు,

ఒడిశాలో జె.బి. పట్నాయక్ 13 ఏళ్ల 155 రోజులు,

మమతా బెనర్జీ 13 ఏళ్ల 23 రోజులు,

అసోంలో విమల ప్రసాద్ చలియా 12 ఏళ్ల 318 రోజులు,

గుజరాత్ లో నరేంద్ర మోడీ 12 ఏళ్ల 227 రోజులు,

హర్యానాలో భజన లాల్ 11 ఏళ్ల 300 రోజులు,

హర్యానాలో బన్సీలాల్ 11 ఏళ్ల 283 రోజులు,

మహారాష్ట్రలో వసంత రావు నాయక్ 11 ఏళ్ల 78 రోజులు,

జమ్మూ కాశ్మీర్ ఫరూక్ అబ్దుల్లా 11 ఏళ్ల 15 రోజులు,

ఉత్తర ప్రదేశ్లో జి.బి. పంత్ 11 ఏళ్ల 13 రోజులు,

కేరళలో కే. నయనార్ 10 ఏళ్ల 355 రోజులు,

పుదుచ్చేరిలో ఎం.ఓ.హెచ్. ఫరూక్ 10 ఏళ్ల 250 రోజులు,

వెస్ట్ బెంగాల్లో బుద్ధదేవ్ భట్టాచార్య పదేళ్ల 188 రోజులు,

రాజస్థాన్లో భైరాన్ సింగ్ షేఖావత్ పదేళ్ల 156 రోజులు,

తమిళనాడులో ఎం.జి. రామచంద్రన్ పదేళ్ల 65 రోజులు,

త్రిపురలో నృపేన్ చక్రవర్తి పదేళ్ల 31 రోజులు,

రాజస్థాన్లో వసుంధర పదేళ్ల ఎనిమిది రోజులు,

మధ్యప్రదేశ్లో దిగ్విజయ్ సింగ్

పదేళ్ల ఒక రోజు సీఎం పదవిలో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here