మోడీ మెగా సందడి

0
124

ప్రమాణ స్వీకారం ఒక ఎత్తు
మెగా బ్రదర్స్ ఎపిసోడ్ మరొక ఎత్తు
పవర్ స్టార్ ప్రాధాన్యత తెలియజేసిన సంఘటన
కేసరపల్లి, జూన్ 12 :
ఎపి రాజకీయాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఎంతో ప్రధానమంత్రి తెలియజెప్పారు.

పవన్ కళ్యాణ్ పదవి స్వీకార ప్రమాణం చేసిన వెంటనే, ప్రధాని చెవిలో ఏదో చెప్పినట్టు కనిపించింది. ఏమై ఉంటుందని అందరూ ఉత్సుకతకు లోనయ్యారు.

ఏమి చెప్పారని విషయం కార్యక్రమం పూర్తైన అనంతరం తెలిసింది. గ్రూప్ ఫోటో అయిపోగానే ప్రధాని పవన్ కళ్యాణ్ చేతిని పట్టుకునే దాదాపుగా లాక్కుంటూ ఆయన అన్న చిరంజీవి వద్దకు తీసుకొచ్చారు.

ఈ దృశ్యాన్ని చూసిన అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేశారు. ఇద్దరి చేతులూ పట్టుకుని పైకెత్తి సభకు ప్రధాని అభివాదం చేశారు.

అక్కడితో ఆగకుండా మెగా బ్రదర్స్ ను అభినందిస్తూ దాదాపు ఐదు నిముషాలు వారితో సంభాషించారు. అందుకు సంబంధించిన చిత్రమాలిక ఇది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here