ప్రశంసలూ … తిరస్కారాలూ.. తీపి చేదు జ్ఞాపకాలు

Date:

రామోజీ పత్రికలను పోల్చే విధం
చైర్మన్ వ్యాఖ్యపై అందరికీ ఉత్కంఠ
ఈనాడు – నేను: 20
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)


ఈనాడులో ఉన్న మరో గొప్ప లక్షణం ప్రోత్సహించడం.. అదీ రామోజీరావుగారి ప్రశంసలు పొందడమంటే ఎంత గొప్ప. ప్రతిరోజూ ఆయన అన్ని దినపత్రికలూ చూసిన తరవాత.. ఈనాడును చూస్తారు.. ప్రతి ఎడిషనూ పరిశీలిస్తారు. ర్యాండమ్‌గా చూసుకుంటూ ఆయనకు నచ్చిన వార్తను ఆసాంతం చదువుతారు. శీర్షిక నచ్చిందా… ఒకే… వార్తంతా చదివి అందుకు తగ్గట్టుగా ఆయన వ్యాఖ్య రాస్తారు. ఎర్రసిరాతో రాసిన ఆ కామెంట్లు చూడ్డం మొదట్లో నాకు మహా సరదాగా ఉండేది. శీర్షికలూ, సందర్భాలూ గుర్తులేవు గానీ… ఆయన రాసిన కొన్ని కామెంట్లు… కొంచెం బాధించేవి.. కానీ దాని వెనుక ఆయన తపన అర్థమైంది కొన్నాళ్ళకు…
ఓ సీనియర్‌ రాసిన శీర్షికకు ఆయనిచ్చిన కామెంట్‌ ఇది…
ఈ శీర్షిక పెట్టిన గాడిద ఎవరు…
ఆయనకెంత బాధ కలిగుంటే అలాంటి వ్యాఖ్య రాసేవారు.. ఎర్ర సిరాతో రాసిన ఆయన రాత కూడా గమ్మత్తుగా గజిబిజిగా ఉండేది.
బుర్ర ఉండే ఈ వార్త రాశారా…
గుడ్‌…
వె.గుడ్‌.
వె.వె.గుడ్‌
అభినందనలు
ఇలా వార్తను బట్టి ప్రశంసలు ఉండేవి.
ఆర్‌ఆర్‌జి..(రీసెర్చి అండ్‌ రిఫరెన్సు గ్రూప్‌)… దీనిని గురించి ఒక భాగంలో వివరిస్తాను.
వసు(వసుంధర)
ఆ.అ.(ఆదివారం అనుబంధం)
సం.పే(సంపాదక పేజీ)

ఇలా సూచనలూ చేసేవారు…..అంటే అలాంటి సూచనలు చూసి సంబంధిత బాధ్యులు స్పందించాలి.

పొరపాటున మెయిన్‌ పేజీలో ప్రచురించాల్సిన వార్తను మినీకి పరిమితం చేస్తే దాని పరిణామాలు విపరీతంగా ఉండేవి. వెంటనే కాకపోయినా.. మరుసటి మీటింగ్‌లో దాని ఫలితం తెలిసొచ్చేది.. ప్ర తి సమావేశానికి ప్రతి డెస్క్‌ సభ్యుడూ తప్పని సరిగా నివేదిక సమర్పించాలి. ఆ మూడు నెలలలో ఏమేం చేశాం. సాధించిన ఘనతలేమిటి.. మన వార్తల వల్ల ప్రజలకు చేకూరిన ప్రయోజనాలేమిటి.. వార్తలకు వచ్చిన స్పందనలు ఏమిటి? ఒకవేళ నెగటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ వస్తే ఎందుకొచ్చింది. దానిని ఎలా అధిగమించాము. వార్తల వల్ల ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా.. ఆ అంశంపై సమీక్షించుకున్నామా.. లేదా… ఇలా అన్ని అంశాలనూ సృజించాలి ఆ నివేదికలో..
ఇందులో మరో విశేషం…
చైర్మన్‌(రామోజీరావు)గారి కామెంట్లను కూడా పొందుపరచాలి అందులో..
గుడ్ కామెంట్స్‌ ఎన్ని…. నెగటివ్‌ కామెంట్స్‌ ఎన్ని… కూడా సంఖ్యలో సూచించాలి.
సమావేశానికి వారం రోజుల ముందుగానే ఇవన్నీ హైదరాబాద్‌ చేరాలి. వాటికోసం వారం రోజుల కసరత్తు…
ఆ వారం రోజులూ అదనంగా రెండు మూడు గంటలు ఉండాల్సి వచ్చేది..
ఇంత కష్టపడి రూపొందించిన నివేదికలకు సమావేశంలో స్పందన బాగుంటే… ఆ శ్రమను మరిచేవాళ్ళం. తిట్లు తింటే ఎలా ఉంటుందో చెప్పక్కరలేదుగా…
ఫలితం ఎలాగున్నా అన్ని అంశాలనూ క్షుణ్ణంగా చర్చించేవారాయన..తగినట్లుగా దిశానిర్దేశమూ చేసేవారు..
సమావేశాలలో ఆయన చేసిన వ్యాఖ్యలు కొన్ని
‘మీలో ఎవరు ఏ కులమో నాకు తెలీదు… పేరు చివరున్న అక్షరాలను బట్టి కొందరు తెలుస్తారు..కానీ.. సుబ్ర హ్మణ్యం… ఆ పేరును బట్టి ఏ కులమో నిర్ణయించలేం కదా…నాకు కులాభిమానం లేదు..’

మరో సమావేశంలో….

‘నేను మిమ్మల్ని ఎంపిక చేసుకునేటప్పుడు… చాలా జాగ్రత్తగా చూస్తాను.. నా ఎంపిక ఎప్పుడూ తప్పు కాదు. సంతలో గేదెల్ని కొనడానికి వెళ్ళినప్పుడు.. సుళ్ళు చూసే దాన్ని ఎంపిక చేసుకుంటాం… అంతే కదా…మిమ్మల్ని ఎంపిక చేసుకునేటప్పుడూ నాకు కొన్ని పరామితులు(పెరామీటర్స్‌) ఉంటాయి. వాటిని పాటిస్తాను.’

ఇంకొక సమావేశంలో

‘పని చేసినవాడే తప్పులు చేస్తాడు… పనిచేయని వాడి దగ్గర తప్పులేం దొరుకుతాయి..
అయినా తప్పు చేసిన వారు వాటిని మళ్ళీ చేయకూడదు..కొత్త తప్పులు చేయాలి..సరిదిద్దుకుంటూ ముందడుగు వేయాలి’

‘మీ వార్తా రచనతో నన్ను మెప్పించండి. నన్ను మెప్పిస్తే.. పాఠకుణ్ణి మెప్పించినట్లే… పాఠకుణ్ణి దృష్టిలో ఉంచుకునే నేను పత్రికను చదువుతాను..’
(ఇది ఆయన ఆత్మ విశ్వాసాన్ని సూచిస్తుంది. పాఠకులు ఏమి ఆలోచిస్తారో తానూ అలానే చేస్తానని చెప్పడం రామోజీ గారి భావం కావచ్చు)
‘పాఠకులే దేవుళ్ళు…. వారినెప్పుడూ కించపరచవద్దు…’

ఇలా ఎన్నని చెప్పను… అన్నీ అవగాహన పెంపొందించేవిలా ఉండేవి…
కలకాలం గుర్తుపెట్టుకునేలా ఉండేవి.. ఆ సూచన చేస్తున్నప్పుడు అదో రకమైన ఆప్యాయత ఉండేది ఆ స్వరంలో

నాకు వచ్చిన గుడ్‌ కామెంట్లలో అధిక భాగం కాకినాడ, రాజమండ్రి జోనల్‌ పేజీలకు వచ్చినవే.

ఒక తప్పిదం ఫలితం ఆజన్మ శిక్ష
ఓ సారి జోనల్‌ పేజీలో దొర్లిన తప్పిదం నన్ను గజగజలాడించింది…
ఆ పేజీ వెళ్ళేది 2500మందికే అయినా… ముద్రణలో శాశ్వతంగా ఉండిపోతుంది… కదా.. .
తప్పు జరిగితే ఆగ్రహించే రామోజీరావుగారు దీనిమీద ఎలా స్పందించారు… ఏం జరిగిందీ.. మరిన్ని కామెంట్లూ విశేషాలూ వచ్చే భాగంలో…..

ప్రభువు మనసెరిగి ప్రవర్తించకుంటే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

సీఎంకు దుర్గ గుడి అర్చకుల శుభాకాంక్షలు

విజయవాడ: నూతన ఆంగ్ల సందర్భాన్ని పురస్కరించుకుని విజయవాడలోని దుర్గ గుడి ప్రధాన...

వాస్తవాల నిర్థారణ ఈనాడుకు పట్టుగొమ్మ

ఒక వార్తను రూఢీ చేసుకోవడం వెనుక…లోక్ నాయక్ జేపీ మృతి వార్త...

రైటప్ లో తప్పు … రామోజీ రియాక్షన్

ఆ చూపు ఇప్పటికీ గుర్తుందిఈనాడులో సిస్టం ఎలా ఉంటుందంటే…ఈనాడు-నేను: 21 (సుబ్రహ్మణ్యం వి.ఎస్....

ఆసీస్ కు థర్డ్ ఎంపైర్ బాసట

అన్యాయంగా జైస్వాల్ ను పవెలియనుకుమరో స్టుపిడ్ ఇన్నింగ్స్ ఆడిన పంత్(సుబ్రహ్మణ్యం వి.ఎస్....
slothttps://www.rajschool.com/slot onlinehttps://sai-ban.com/https://britoli.com/https://www.anabias.com/https://bcrbltd.com/https://s2aconsultingfze.com/https://rock-poker.com/https://koinhoki88.org/https://koinhoki88.net/https://rawsolla.com/https://koinhoki888.com/https://koinhoki88.com/https://infomedan.net/qqplazaslot gacorslot gacor koinhoki88slot gacor terbaru koinhoki88koinhoki88koinhoki88slot777https://usfinancehelp.com/https://collectingdiecasttoystoday.com/https://nyonyaguru.com/https://topindo-pulsa.com/https://gojekonline.com/https://dafrastar.com/https://www.reliantholdings.net/https://www.opalcitysview.com/https://lumarca.info/https://alt-qqaxioo.com/https://www.capuletlondon.com/https://www.tithaimart.com/https://www.trungvuongus.com/https://tropicalbioenergy.com/https://www.capitol-peak.com/https://pisswife.com/https://gamvipvn.com/https://www.elfutbolesnuestro.com/https://ampdsmart.com/https://schiffsilver.com/https://theicemall.com/https://shebenik.com/https://popvoxawards.com/https://www.adwebconsultancy.com/https://www.technotchsolutions.com/https://threekookaburras.com/https://marcjacobsonsale.com/https://www.forexrehberim.net/https://dreamlifefactory.com/https://www.videosocialcreative.com/https://www.oregonwetlands.net/https://www.americaneve.com/https://www.iamthelongtail.com/https://www.privatelivesbroadway.com/https://travelamateurs.com/https://sustaintheline.com/https://geekforcefive.com/https://galaksinews.com/https://sejutateknologi.com/https://harimausumateranews.com/https://diarysaham.com/https://lacakonline.com/https://undangansah.com/https://kottakkalayurvedapharmacy.com/https://kabforums.org/https://bhootmedia.com/https://erectie-goedkoop.com/https://heylink.me/Bandargaming-/https://qqcrownbos.com/https://eastofanfield.com/https://nyonyabesar.com/https://direktoriwisata.com/ https://bbqburgersmore.com/ https://bjwentkers.com/ https://mareksmarcoisland.com/ https://richmondhardware.com/ https://revolo.co.uk/video/ https://apollog.uk/top/ https://abroadnext.global/m/ https://optimalqatar.me/ https://pixelpayments.com/ https://plinyrealty.com/ https://ilkaylaw.com/ https://mycovinadentists.com/ https://www.callnovodesk.com/ https://www.untax.com/ https://www.socialhire.io/ https://www.therosenthallaw.com/ https://www.charlietakesanadventure.com/ https://www.hausefbt.com/ https://www.tripvacationrentals.com/ https://tfm.digital/ https://teethinadayuk.com/ https://schrijnwerkerschoten.be/ https://daddara.in/file/ https://www.atsenvironmental.com/ slot gacor https://absolutegraniteandmarble.com/ https://abyssinianbunacoffee.com/ https://acumenparentalconsultancy.com/ https://adeyabebacoffee.com/ https://afrocessories.co/ https://alkinzalim.com/ https://alphabetconsult.com/ https://amhararegionsolarenergyassociation.com/ https://angazavijiji.co.ke/ https://www.bezadsolutions.com/ https://bigonealuminium.co.tz/ https://brentecvaccine.com/ https://byhengineering.com/ https://centercircle.co.tz/ https://delitescargo.com/ https://ecobeantrading.com/ https://ejigtibeb.com/ https://enrichequipment.com/ https://enterethiopiatours.com/ https://ethiogeneralbroker.com/ https://ethiopiancoffeeassociation.org/ https://ethiopolymer.com/ https://excellentethiopiatour.com/ https://extracarepharmaceuticals.com/ https://eyobdemissietentrental.com/ https://fiscanodscashewnuts.com/ https://flocarebeauty.com/ https://fluidengineeringandtrading.com/ https://fostersey.com/ https://geezaxumfetl.com/ https://gollaartgallery.com/ http://amgroup.net.au/ https://expressbuds.ca/ https://pscdental.com/ https://livingpono.blog/ https://thejackfruitcompany.com/ https://thewisemind.net/ https://www.sk-group.ca/ https://www.spm.foundation/ https://mmmove.com/ https://touchstoneescrow.com/ https://www.asuc.edu.mk/