అతి పెద్ద జానపద నృత్యంగా గుర్తింపు
సర్టిఫికెటును సీఎంకు అందజేసిన మంత్రి
హైదరాబాద్, సెప్టెంబర్ 30 : తెలంగాణ రాష్ట్రం సాంస్కృతిక పరంగా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించింది. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని సరూర్ నగర్ మైదానంలో అతిపెద్ద బతుకమ్మను ఏర్పాటు చేసి, కార్యక్రమాన్ని నిర్వహించారు. 63 అడుగుల ఎత్తుతో ఈ బతుకమ్మను రూపొందించారు. ఈ సందర్భంగా చేసిన జానపద నృత్యాన్ని అతిపెద్ద జానపద నృత్యంగా గిన్నిస్ బుక్ గుర్తించింది.
ఈ మేరకు గిన్నిస్ బుక్ నిర్వాహకుల నుంచి ధ్రువపత్రం అందింది. దీనిని ముఖ్యమంత్రికి అందించారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, టూరిజం డిపార్ట్మెంట్ ఎండీ క్రాంతి మర్యాదపూర్వకంగా కలిశారు. గిన్నిస్ ధ్రువ పత్రాన్ని ఆయనకు అందజేశారు. మంత్రి జూపల్లి, టూరిజం అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

