సీఎంను కలిసిన ఆసియా కప్ హీరో

0
199

సీఎం సత్కారం : సీఎం కు బ్యాట్ బహుకరించిన వర్మ
హైదరాబాద్, సెప్టెంబర్ 30 : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంగళవారం అనుకోని బహుమతి లభించింది. ప్రముఖ క్రికెటర్, ఆసియా కప్ హీరో అయిన తిలక్ వర్మ ఆయనకు ఒక క్రికెట్ బాట్ బహుకరించారు. ఆసియా కప్ లో పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర వహించిన తిలక్ వర్మ మంగళవారం సాయంత్రం సీఎంను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తిలక్ వర్మను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్కరించారు. అభినందనలు అందజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డికి క్రికెట్ బ్యాట్ ను తిలక్ వర్మ బహుకరించారు.

సీఎం ఆ బ్యాట్ తో బ్యాట్ చేస్తున్నట్టు సరదాగా పోజు ఇచ్చారు. తాను ధరించిన జెర్సీని, టోపీని కూడా వర్మ ఆయనకు చూపించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, శాట్స్ ఎండీ సోనిబాల దేవి, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here