అద్దాలు – శ్రీశ్రీ

0
61

(KVS Subrahmanyam)

శ్రీశ్రీ పేరు వింటే గుర్తుకొచ్చేది ఆయన రచించిన మహాప్రస్థానం. మేధావులు కార్మికోద్ధారకులు నుంచి రాజకీయ నాయకుల వరకూ మహాప్రస్థానం కావ్యంలోని పాపులర్ పదాలను వల్లె వేస్తుంటారు. సరే తరవాత ఏమి చేస్తుంటారనేది అసందర్భం.
చెన్నైలో ఉండగా శ్రీశ్రీ గారి ఇంటికి వెళ్లే భాగ్యం దక్కింది. సరోజ శ్రీశ్రీ గారు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. దాదాపు మూడు గంటల పాటు నేనూ వైజయంతి ఉన్నాం. ఎన్నెన్నో విషయాలను సరోజ గారి నుంచి విన్నాం. శ్రీశ్రీ భోజనం చేయడానికి ఉపయోగించిన బల్ల (డైనింగ్ టేబుల్), వాడిన ఫోన్, మంచాలు కూడా చూశాం.

అన్నిటికీ మించి ఆ ఇంట్లో ప్రతి గదిలోనూ (స్నానాల గదిలో కూడా) పెద్ద పెద్ద అద్దాలున్నాయి. వాటి గురించి అడిగినప్పుడు… సరోజ గారు ఇలా చెప్పుకొచ్చారు. శ్రీశ్రీ గారికి అద్దాలంటే ఎంతో మక్కువ. బర్మా నుంచి వాటిని తెప్పించారు. ఎక్కడ కూర్చున్నా అందులో తన రూపాన్ని చూసుకుంటూ ఉండేవారని వివరించారు.


మరో విషయం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. ఒకసారి శ్రీశ్రీ గారికి ఐదు రూపాయలు అవసరపడ్డాయట. అందుకోసం ఆయన రిక్షాలో చాలా మంది దగ్గరకి వెళ్లారుట. చివరికి ఒక నిర్మాత ముప్పై రూపాయలు ఇచ్చారట. అందులోంచి ఐదు రూపాయలు తీసుకుని 25 రూపాయలు రిక్షా కార్మికునికి ఇచ్చారట. ఇలా ఎంతమంది ఉంటారు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here