కన్నడంలో భగీరథ ‘నాగలాదేవి’

0
17

విరూపాక్ష ఆలయంలో ఆవిష్కరణ సభ

హంపి, అక్టోబర్ 14: ప్రపంచంలో శిల్పకళా వారసత్వంలో విజయనగర సామ్రాజ్యానికి సముచితమైన స్థానం ఉందని విజయనగర శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం కులపతి ప్రొ. ఎం మునిరాజు పేర్కొవున్నారు.
శ్రీగంగ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటి సంస్థ హంపిలోని విరూపాక్ష దేవాలయంలో ‘నాగలాదేవి ‘ కన్నడ నవల ఆవిష్కరణ సభను ఏర్పాటు చేసింది. భగీరథ తెలుగులో రచించిన ‘నాగలాదేవి ‘ నవలను కన్నడంలోకి డాక్టర్ దేవన్న అనువదించారు. ఈ పుస్తకాన్ని మునిరాజు ఆవిష్కరించారు . ఈ సందర్భగా భగీరథనూ, దేవన్ననూ ఆయన అభినందించారు.
ప్రొ. బి.సి. ఐగోల్ ‘నాగలాదేవి’ గురించి మాట్లాడుతూ – చరిత్రలోని ఒక సరికొత్త కోణాన్ని భగీరథ ఆవిష్కరించారని ప్రశంసించారు. ఇది గొప్ప పరిశోధనా గ్రంథమన్నారు. కన్నడంలోకి నాగన్న సమర్ధవంతంగా అనువదించారని చెప్పారు.
భగీరథ మాట్లాడుతూ – కృష్ణదేవరాయలు , నాగలాదేవి నడయాడిన విరుపాక్త దేవాలయంలో ఈ కార్యక్రమం జరగాలన్న తన ఆకాంక్షను దేవన్న నెరవేర్చారని చెప్పారు. కన్నడంలో కూడా ఈ నవల పండిత పామరుల అభిమానం సంపాదిస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు. నాగలాదేవి నవల రచనకు 15 సంవత్సరాలు పరిశోధన చేశాననీ, శాసనాల సాక్షిగా దీనిని రచించాననీ పేర్కొన్నారు.


కన్నడ అనువాదకుడు డాక్టర్ దేవన్న మాట్లాడుతూ – ఈ నవలను కన్నడంలోకి అనువదించాడనికి భగీరథ అనుమతించారని, నాగలదేవిని కన్నడ పాఠకులు అభిమానించి ఆదరిస్తారననే నమ్మకం ఉందని చెప్పారు.
ఆర్టిస్ట్ శివ ప్రసాద్ అహో ఆంధ్ర భోజ శ్రీకృష్ణదేవరాయ అనే గీతాన్ని ఈ సందర్భంగా ఆలపించారు. సభకు కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ రుద్రప్ప అధ్యక్షత వహించారు. కన్నడ విశ్వవిద్యాలయం ప్రొ. ఎస్. వై. సోమశేఖర్, శ్రీమతి అన్నపూర్ణ సింగ్, పారిశ్రామికవేత్త భీమనేని భాస్కరనాయుడు, హెచ్. శ్రీనివాసరెడ్డి , పాటి సుబ్బారావు , బెల్లా తెలుగు సాంస్కృతిక సంఘం కార్యదర్శి గోపాలకృష్ణ సభలో పాల్గొన్నారు.
అతిధులను అధ్యక్షులు శ్రీమతి శకుంతల సత్కరించారు. కార్యదర్శి .డా. ఆర్. వాత్సల్య వందన సమర్పణ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here