Tuesday, March 21, 2023
HomeArchieveఅంచెలంచెలుగా అల వైకుంఠ‌పురంలా

అంచెలంచెలుగా అల వైకుంఠ‌పురంలా

డ్ర‌మ్మ‌ర్ నుంచి విన్న‌ర్‌గా ఎదిగిన త‌మ‌న్‌
న‌వంబ‌ర్ 16 ఎస్ఎస్ త‌మ‌న్ జ‌న్మ‌దినం
(వాడ‌వ‌ల్లి శ్రీ‌ధర్‌)

ఆ స్వరాలు వింటే సీటి కోటాల్సిందే. రేసుగుర్రంలా దూకుడు. ఈ కాలం సంగీత శ్రోతల నాడి తెల్సిన సరైనోడు. అలవైకుంఠ పురంలో, బృందావనంలో వినిపించేది తన్మయత్వపరిచేది తమన్ సంగీతమే. ఆ సంగీతం వింటే నవతరం శ్రోతలకు ప్రతిరోజు పండుగ రోజే. డ్రమర్ నుంచి విన్నర్‌గా ఎదిగిన సంగీత సాధకుడు. ఆ దూకుడు ఆగదెన్నడు. సర్కారు వారి పాటలో కొత్తగా వినిపిస్తుంది.


తమన్ పూర్తి పేరు సాయిశ్రీనివాస్ తమన్. ప్రసిద్ధ దర్శక, నిర్మాత ఘంటసాల బలరామయ్య మనవడు. నెల్లూరు స్వస్థలం. చెన్నైలో పెరిగాడు. ఆయన తండ్రి అశోక్ కుమార్ ప్రముఖ దర్శకుడు చక్రవర్తి వద్ద డ్రమ్ములు వాయించేవాడు. అమ్మ సావిత్రి గాయిని. చిన్నతనం నుంచీ ఆయనకు సంగీతంపై మక్కువ పెరిగింది. ఆ స్ఫూర్తితో ఆరేళ్లకే డ్రమ్ములు వాయించడం మొదలుపెట్టాడు.

అప్పుడు తమన్ వయసు 13 ఏళ్లు. మాధవపెద్ది సురేశ్.. తమన్‌ను పిలిచి ‘భైరవద్వీపం’ సినిమాకు డ్రమ్మర్‌గా తీసుకున్నారు. తొలి పారితోషికంగా రూ.30 అందుకున్నాడు. అతి తక్కువ కాలంలో రిథమ్ డ్రమ్స్ ప్లేయర్ అయిపోయాడు. రూ.30తో ప్రారంభమైన ఆయన పారితోషికం రోజుకి రూ.3 వేలకు చేరుకుంది. ‘1994 నుంచి 1997 వరకు నాకు అతి కష్టమైన రోజులు. ఆ సమయంలో రాజ్‌కోటి, మాధవపెద్ది, బాలసుబ్రహ్మ‌ణ్యం, గంగై అమరన్, శివమణి త‌న‌ను ఆదుకున్నారని తమన్ తెలిపారు.

దర్శకుడు శంకర్ వినూత్నంగా తీసిన సినిమా ‘బాయ్స్’. ఈ సినిమాలో కథానాయకుడు సిద్ధార్థ్ స్నేహితుడిగా డ్రమ్ములు వాయించే పాత్ర చేశాడు. మణిశర్మ దగ్గర ‘ఒక్కడు’ కోసం పనిచేయడం తన జీవితాన్ని మార్చేసిందని తమన్ అంటుంటారు. ఆయన వద్ద పనిచేస్తూ ఎనిమిదేళ్లు ఉండిపోయారు. 24 ఏళ్లు వచ్చే సరికీ 64 మంది సంగీత దర్శకులతో 900 సినిమాలకు పనిచేశారు. తెలుగు, మరాఠీ, ఒరియా, మలయాళం, తమిళ్, కన్నడ.. ఇలా వివిధ భాషల్లో నంబరు 1 ప్రోగ్రామర్‌గా పేరు తెచ్చుకున్నారు. 24 ఏళ్ల వయసులో సంగీత దర్శకుడిగా పనిచేశారు.

అది తమిళ సినిమా. ఆ తర్వాత రవితేజ ‘కిక్’ సినిమాతో సిక్స్ కొట్టారు. తక్కువ కాలంలోనే 72 సినిమాలకు సంగీతం అందించారు. 2018లో వచ్చిన ‘అరవింద సమేత’, ‘అల వైకుంఠపురములో’ లాంటి హిట్లు కూడా ఉన్నాయి.. ఈ యువ సంగీత దర్శకుడికి వ్యూస్ అందిస్తోంది జన్మదినోత్సవ శుభాకాంక్షలు. (వ్యాస ర‌చ‌యిత ప్ర‌ముఖ సినీ విశ్లేష‌కుడు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ