మెతడ్‌‌ యాక్టింగుకు ఐకాన్ దిలీప్ కుమార్

0
224

జులై 07 ఆయన వర్ధంతి
(రోచిష్మా‌న్, 9444012279)

అత్యున్నతమైన సినిమా నటుడు దిలీప్ కుమార్. దిలీప్ కుమార్ వర్ధంతి ఇవాళ. ఆయనకు నివాళి.

Dilip kumar is an excellent epitome of method acting.

అంతర్జాతీయంగా సరైన‌‌, మేలైన నటనా‌ విధానంగా‌‌ పరిగణించబడుతున్న మెతడ్‌‌ ఆక్టింగ్‌కు ఉత్కృష్టమైన ప్రతీక (icon) దిలీప్ కుమార్.

రషా (రష్యా) దేశపు Steven levitsky మెతడ్(మెథడ్ కాదు) ఆక్టింగ్ ఆవశ్యకతను అమలు లోకి తెచ్చాక‌ ప్రపంచం అదే‌ సరైంది‌, మేలైంది అని అన్నాక ఆ మెతడ్ ఆక్టింగ్‌కు సరైన‌ లేదా ఒక‌ గొప్ప వ్యక్తీకరణ దిలీప్ కుమార్.

ఇంగ్లిష్‌‌ నటుడు Marlon Brando కన్నా ముందే దిలీప్ కుమార్ మెతడ్‌ ఆక్టింగ్‌ను ఆచరణలోకి తెచ్చారు.

మొహమ్మద్ యూసఫ్ ఖాన్. ఇది దిలీప్ కుమార్ అసలు పేరు.1944లో విడుదలైన “జ్వార్ భాటా” హిందీ‌ సినిమాతో పరిచయమయారు.

నటుడు మోతీలాల్‌తో మనదేశంలో సహజమైన, సరైన, అంతర్జాతీయమైన చలనచిత్ర నటన మొదలయింది. గొప్ప నటుడు అశోక్ కుమార్ కూడా conceptualized performance చెయ్యలేదు. దిలీప్ కుమార్ conceptualized performance చేశారు. ఆయనకు ముందు అది లేదు.

దిలీప్ కుమార్ కు‌ మంచి‌ rhythm sense ఉంది.‌ మళ్లా‌ ఒక్క‌ రాజ్ కపూర్‌కు‌ తప్పితే‌ అలాంటి rhythm sense మన దేశంలో‌ మరో నటుడికి‌‌ లేదు.

మామూలుగా కళాకారులు “జనరంజకత్వం‌ కోసం” అని అంటూంటారు. కానీ దిలీప్ కుమార్ అలా‌‌ కాకుండా తాను ఒక ఉన్నతమైన స్థాయిలో నుంచుని ఆ స్థాయికి జనాలను తీసుకెళ్లారు. నటనలో బహుశా ఒక్క దిలీప్ కుమార్ కు‌ మాత్రమే ఇది సాధ్యపడిందేమో? మన ఎన్. టీ. రామారావు, కన్నడ‌ రాజ్ కుమార్‌ వంటి వాళ్లు జనరంజకత్వం కోసం ఉన్నత స్థాయి నుంచి కొన్ని సందర్భాలలో కిందకు దగక తప్పలేదు.

భారత‌దేశపు గొప్ప నటులందరికీ దిలీప్ కుమార్ అభిమాన నటుడు. మన రామారావు తన అభిమాన నటుడు దిలీప్ కుమార్‌ అని చెప్పారు. తమిళ్ష్ సి(శి)వాజి గణేస(శ)న్ “నేను దిలీప్ కుమార్‌ అభిమానిని” అని గట్టిగా‌నే‌ చెప్పారు.

కమల్‌హాసన్ అన్నయ్య చారుహాసన్ తమ కుటుంబానికి అభిమాన నటుడు దిలీప్ కుమార్‌ అని ఈ వ్యాస రచయితతో చెప్పేవారు.

భారతదేశంలో పుట్టిన‌ విశ్వస్థాయి నటనా‌ నక్షత్రం‌‌ దిలీప్ కుమార్.

Dilip Kumar, an exqisite and an exemplory actor.

దిలీప్ కుమార్ – మాలన్ బ్రాండో (Marlon brando) ఈ ఇద్దరూ ప్రపంచంలోని మహోన్నతమైన నటులు. కొందరు దిలీప్ కుమార్‌పై
బ్రాండో ప్రభావం ఉంది అంటారు. అది తప్పు. బ్రాండోకు ముందే నటనలో ఆ స్థాయి చింతన, ధోరణి, ప్రతిభ దిలీప్ కుమార్‌కు‌ ఉండేవి. 1953‌లో‌ వచ్చిన Wild one సినిమాతో‌ బ్రాండో ప్రపంచానికి మంచి నటుడిగా తెలియవచ్చారు. దిలీప్ కుమార్‌ అప్పటికే హిందీ సినిమాల్లో గొప్పగా నటించారు.

Method Acting పద్ధతిని, రష ( Russia,‌ రష్య కాదు) దేశపు నాటక దర్శకుడు, నటుడు స్టేనిస్‌లేఫ్స్‌కీ (Stanislavsky 1863-1938) సూత్రీకరించారు‌. అది 1930ల నాటికి హాలివుడ్ కు చేరింది.‌ 1947కు పుంజుకుంది. Montgomery Clift, James Dean, Marlon Brando అమేరిక సినిమాలో మెతడ్ ఆక్టింగ్ త్రిమూర్తులు. దిలీప్ కుమార్ వాళ్ల కన్నా ముందే మెతడ్ ఆక్టింగ్‌ను సరిగ్గా ఆకళింపు చేసుకున్నారు. వాళ్ల కన్నా వయసులోనూ దిలీప్ పెద్ద. 1922లో పుట్టారు దిలీప్.

మాలన్ బ్రాండో ,‌ దిలీప్ కుమార్ ఇద్దరూ మహోన్నతమైన నటులు. అయితే బ్రాండో దేవదాస్, కోహినూర్, వంటి సినిమాలు చేసి ఉండక పోవచ్చు. పాత్రపోషణా వైవిధ్యంలో దిలీప్ పరిధి బ్రాండో కన్నా విస్తృతమైంది. పాటల అభినయంలో lip movement, rhythm sense బ్రాండో ప్రదర్శించలేదు కదా? బ్రాండో కన్నా దిలీప్ గొప్ప నటుడు.

దిలీప్ నటనా విధానం ఎప్పటికీ మనదేశ నటులకు ఆదర్శం. మన దేశంలో వచ్చిన అంతర్జాతీయస్థాయి నటుడు దిలీప్ కుమార్.


(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here