తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్
రాష్ట్రంలో పండిన ధాన్యం అంతా కొనాలి
ప్రధాన మంత్రికి కె. చంద్రశేఖరరావు లేఖ
హైదరాబాద్, మార్చి 23: ధాన్యం సేకరణపై దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు డిమాండ్ చేశారు. తెలంగాణలో పండివన ధాన్యం అంతా కొనుగోలు చేయాలని ఆయన ప్రధాన మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేసీఆర్ ప్రధానికి ఒక లేఖ రాశారు. పంజాబ్‌లో ఒకలా… మిగిలిన రాష్ట్రాల్లో ఒకలా సేకరణ విధానం ఉందనీ, దీనికి చరమగీతం పాడాలనీ, దేశవ్యాప్తంగా ఏకరూప సేకరణ విధానం అవసరమని ఆ లేఖలో అభిప్రాయపడ్డారు. పంజాబ్‌లో మాదిరిగా తెలంగాణలోనూ ఖరీఫ్‌లో 90శాతం ధాన్యాన్ని సేకరించేందుకు వీలుగా ఎఫ్‌సిఐని ఆదేశించాలని కోరారు. ఎఫ్‌సిఐ అనుసరిస్తున్న విధానాలు సందేహాలకు తావిచ్చేవిగా ఉంటున్నాయన్నారు.
దేశవ్యాప్తంగా ఒకే సేకరణ విధానం
Date: