మహిళల ప్రపంచ క్రికెట్లో భారత సంచలనం

0
138

తొలిసారి టోర్నీ గెలిచిన హర్మన్ టీం
షఫాలీ వర్మ ఆల్రౌండ్ ప్రతిభ
(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)

భారత మహిళా క్రికెటర్లు మెన్ ఇన్ బ్లుకి ఏమాత్రం తీసిపోకుండా ఆడారు. నవి ముంబైలో ఆదివారం జరిగిన ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి విజయం సాధించారు. ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమెంట్లో భారత్ సత్తాచాటింది. సౌత్ ఆఫ్రికాను 53 పరుగుల తేడాతో ఓడించి కప్ గెలుచుకుంది. ప్రపంచ కప్ అందుకోవడం ఇదే భారత మహిళలకు తొలి సారి. 2017 లో ఫైనల్స్ కు చేరినప్పటికీ, రన్నర్ అప్ గా సరిపెట్టుకోవాల్సివచ్చింది. ఈ సారి హర్మన్ ప్రీత్ బృందం పట్టుదలగా ఆడి కప్ చేజిక్కించుకుంది. షఫాలీ వర్మ ఆల్రౌండ్ ప్రదర్శన ( 87 పరుగులు, రెండు వికెట్లు) చేసి, భారత్ కు విజయం చేకూర్చారు. దీప్తి శర్మ 5 వికెట్లు పడగొట్టారు. ఇరవయ్యవ ఓవర్లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ షఫాలికి బౌలింగ్ ఇవ్వాలన్న నిర్ణయం సత్ఫలితాన్నిచ్చింది. షఫాలీ వరసగా రెండు ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టారు.

తొలుత టాస్ గెలిచిన దక్షిణ ఆఫ్రికా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ (87 ), దీప్తి శర్మ (58 ) సెంచరీలు చేశారు. ఓపెనర్ స్మ్రితి మంధన 45 , జెమీమా 24 , రిచా ఘోష్ 34 , హర్మన్ ప్రీత్ కౌర్ 20 పరుగులు చేశారు. మొదటి వికెట్ భాగస్వామ్యం 104 . ముప్పయ్యవ ఓవర్లో దీప్తి శర్మ బౌలింగులో జాఫా అవుటయ్యాడు. స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 148 . ఒక పక్క విట్లు పడుతున్నప్పటికీ వోల్వోర్ట్ ఒంటరి పోరాటం చేశారు.


తరవాత 299 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణ ఆఫ్రికా 15 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రిట్స్ ను అమంజోత్ రనౌట్ చేసారు. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన సున్నా పరుగులకే శ్రీ చరణి బౌలింగులో ఎల్.బి.డబ్ల్యు. అయ్యారు. మరో ఓపెనర్ కెప్టెన్ వోల్వర్ట్ 45 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు. పద్దెనిమిది ఓవర్లలో దక్షిణ ఆఫ్రికా స్కోరు రెండు వికెట్ల నష్టానికి వంద పరుగులకు చేరింది. లూస్, వోల్వర్ట్ జోడి యాభై పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. తొలి పది ఓవర్లలో 52 పరుగులు చేసిన దక్షిణ ఆఫ్రికా, తరవాతి పది ఓవర్లలో 62 పరుగులు చేసింది. షఫలి వర్మ బౌలింగులో లూస్ 25 పరుగులకు అవుటయింది. స్కోరు మూడు వికెట్ల నష్టానికి 114 . 61 పరుగులతో నాటవుట్ గా ఉన్న వోల్వోర్ట్ కు జతగా కాప్ బరిలోకి దిగింది. షఫాలీ తన రెండో ఓవర్లో కాప్ ని అవుట్ చేశారు. స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 123 . 35 ఓవర్లు ముగిసే సమయానికి దక్షిణ ఆఫ్రికా స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 183 . ఒక పక్క విట్లు పడుతున్నప్పటికీ కెప్టెన్ వోల్వోర్ట్ ఒంటరి పోరాటం చేశారు. ఆరో వికెట్ కి వోల్వోర్ట్ (90 ), డెరిక్ (33 ) యాభై పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కెప్టెన్ వోల్వోర్ట్ 96 బంతుల్లో సెంచరీ పూర్తిచేశారు. నలభైవ ఓవర్లో దీప్తి శర్మ దెర్క్సన్ ను అవుట్ చేసి భారత శిబిరంలో ఉత్సాహం నింపారు. అప్పటికి స్కోరు ఆరు వికెట్ల నష్టానికి 209 . 42 వ ఓవర్లో వోల్వోర్ట్ ఇచ్చిన క్యాచ్ ని అమంజ్యోత్ సింగ్ అద్భుతంగ పట్టి, భారత్ విజయాన్ని ఖాయం చేశారు. అదే ఓవర్లో దీప్తి ట్రయాన్ ను ఎల్.బి.డబ్ల్యు చేసి నాలుగో వికెట్ పడగొట్టారు. స్కోరు 8 వికెట్ల నష్టానికి 221 .

షఫలి వర్మ 2, దీప్తి శర్మ 4 వికెట్లు, శ్రీ చరణి ఒక వికెట్ తీశారు. మహిళా క్రికెట్ బృందం ప్రదర్శన చూడడానికి బి.సి.సి.ఐ. అధ్యక్షుడు షా, క్రికెటర్లు వివిఎస్ లక్ష్మణ్, రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్ నవి ముంబైలోని డి.వై. పాటిల్ స్టేడియానికి విచ్చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here