యు.కె.లో కె.సి.ఆర్.కు కృతజ్ఞత సభ

Date:

పార్లమెంట్ కమిటీ హాలులో ఏర్పాటు
అంబేద్కర్ యుకె సంస్థ నేతృత్వం
లండన్, మే 10 :
గడిచిన నెలలో హైద్రాబాదులో ప్రపంచంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పినందుకు తెలంగాణ సీఎం కెసిఆర్ కు కృతఙ్ఞతలు చెప్పేందుకు యూకే పార్లమెంట్ కమిటీ హాల్ లో ” కెసిఆర్ కృతజ్ఞత సభ” ఏర్పాటైంది. బ్రిటన్ కు చెందిన అంబేద్కర్ యూకే సంస్థ & ప్రవాస భారతీయ సంస్థల ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించారు.
125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ స్థాపన చేసినందుకు., తెలంగాణ సచివాలయానికి డా.బిఆర్.అంబేద్కర్ పేరు పెట్టినందుకు..దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నందుకు.ముఖ్యమంత్రి కేసీఆర్ కు బ్రిటన్ ఎంపీలు, కౌన్సిలర్లు ప్రజా ప్రతినిధులు. పెద్ద ఎత్తున హాజరైన ఎన్నారై సంఘాలు బ్రిటన్ పౌరులు కృతజ్జతలు తెలిపారు.


దళితజనోద్ధరణకు కంకణం కట్టిన తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును బ్రిటన్ సమాజం ప్రశంసించింది. వివక్షకు గురవుతూ విస్మిరించబడిన ఎస్సీ కులాల సమున్నత అభివృద్ధికోసం సిఎం కేసీఆర్ దార్శనికతతో దేశచరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న పథకాలు కార్యాచరణ దేశంలో ఇప్పటికే వో విప్లవాన్ని సృష్టిస్తున్నాయి. దళితబహుజన సబ్బండ కులాల అభ్యున్నతికోసం సిఎం కేసీఆర్ కార్యాచరణ దేశం నలుదిక్కులనుంచి ప్రశంసలు అందుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ ఖ్యాతి విశ్వానికి పాకింది. ఇప్పటికే తన లేఖద్వారా ముఖ్యమంత్రి కెసిఆర్ అభివృద్ధి కార్యాచరణను ప్రశంసిస్తూ లేఖ రాసిన బ్రిటన్ ఎంపీలు సోమవారం నాడు లండన్ ఇతర ప్రజాప్రతినిధులు బ్రిటన్ పౌరులు ఎన్నారైలతో కలిసి ‘‘ సిఎం కేసీఆర్ కు కృతజ్జతలు తెలుపుతూ సభను నిర్వహించారు.


‘అంబేద్కర్ యూకే సంస్థ‘, ‘ప్రవాస భారతీయ సంస్థ’ ల ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో కేసీఆర్ ను అభినందానలతో ముంచెత్తింది. యూకే పార్లమెంట్ కమిటీ హాల్ లో ఏర్పాటు చేసిన ” కెసిఆర్ కృతజ్ఞత సభ” కు యూకే ఎంపీలు వీరేంద్ర శర్మ , నవేదు మిశ్ర, బారోన్ కుల్దీప్ సింగ్ సహోట, ఇంకా పలువురు స్థానిక కౌన్సిలర్లు హాజరయ్యారు. బ్రిటన్ లో నివసిస్తున్న పలువురు ప్రముఖ ఎన్నారైలతో పాటు, స్థానిక ప్రవాస సంఘాల నాయకులు, తెలంగాణ ఎఫ్ డి సీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, తదితరులు ఈ కృతజ్జతా సభకు హాజరయ్యారు.

బ్రిటన్ పార్లమెంట్ కమిటీ హాల్లో, సమన్వయకర్త సిక్కా చంద్రశేఖర్ అధ్యక్షతన ప్రారంభమైన కేసీఆర్ కృతజ్జత సభ’ కార్యక్రమంలో ముందుగా అంబెడ్కర్ చిత్ర పటానికి పూలతో నివాళులులర్పించారు. అనంతరం…అంబెడ్కర్ విగ్రహ ఆవిష్కరణ, సచివాలయ ప్రారంభ వేడుక తో పాటు దళిత బంధు పథకం అమలు తీరు, దళిత బందు విజయగాథలతో కూడిన వీడియోలను హాజరైన అతిధులకు ప్రదర్శించి వివరించారు.


ఈ సందర్భంగా బ్రిటన్ ఎంపీలు మాట్లాడుతూ…. అంటరానితనంపై అలుపెరుగని సమరం చేసిన గొప్ప సంఘసంస్కర్త అంబేద్కర్ గారని, దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్‌ తన జీవిత కాలం చేసిన పోరాటం మరువలేనిద’’ని వారు తెలిపారు. నేడు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వంలో అంబేద్కర్ గారి విగ్రహ ఏర్పాటు మాత్రమే కాకుండా వారి ఆశయాలకు అనుగుణంగా దళితుల సాధికారత కోసం దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిమంతంగా ఉందని బ్రిటన్ ఎంపీలు కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా దళితులు ఆర్థికంగా బలపడడమే కాకుండా సమాజం లో వారికి ఆత్మగౌరవం సముచితంగా పెరుగుతుందని సామాజిక వివక్ష, అసమానతలు తొలిగిపోతాయని బ్రిటన్ ఎంపీలు తెలిపారు. ఇంతటి గొప్ప కార్యాచరణను అమలు చేస్తున్నతెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కెసిఆర్ గారిని వారు అభినందించారు. సామాజిక ఆర్థిక వివక్షను రూపుమాపేదిశగా ఇలాంటి విప్లవాత్మక కార్యక్రమాలు చేపడుతూ…భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సిఎం కేసీఆర్ ఆదర్శంగా నిలుస్తున్నారని బ్రిటన్ ప్రజా ప్రతినిధులు ప్రసంశించారు.
బ్రిటన్ లో ఎన్నారై సంఘాల నేతలు మాట్లాడుతూ… ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మొట్ట మొదటి సారి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా తెలంగాణ నూతన సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు పెట్టడం చాలా గర్వంగా ఉందని అన్నారు.
దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పథకాన్ని అమలు చేసి ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపడమే కాకుండా సొంత వ్యాపారాలు పెట్టుకొని వారే పది మందికి ఉపాధి కలిగించే విధంగా తీర్చిదిద్ది ఆత్మగౌరవంతో బతుకేలా చేస్తున్న విధానం గొప్పగా అనిపించిందన్నారు. తర తరాలుగా సామాజిక ఆర్థిక వివక్షకు గురవుతున్న దళిత జనోద్దరణకోసం ‘దళిత పక్షపాతి’గా పనిచేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రికి అంబేద్కర్ ఫెడరేషన్ పక్షాన అభినందించి కృతఙతలు తెలుపుతున్నామని అన్నారు. తెలంగాణ స్పూర్తితో భారత దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని దళితుల సంక్షేమం పట్ల ఆయా ప్రభుత్వాలు కృషి చెయ్యాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ ఎఫ్ డీ సి చైర్మన్ అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతీ నిర్ణయం చారిత్రాత్మకమని, నేడు కెసిఆర్ పాలనపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుందని, ఇప్పటికే రైతు బంధు పథకాన్ని ఐక్య రాజ్య సమితి గుర్తించిన విషయాన్ని ప్రస్తావించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో మొదలైన దళిత బంధు నేడు రాష్ట్రవ్యాప్తంగా అమలవుతూ సాధిస్తున్న విజయ గాధలను అనిల్ కూర్మాచలం ఈ సంధర్భంగా సభకు వివరించారు.

మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎన్నో రంగాల్లో దేశానికి ఆదర్శమైందని ముఖ్యంగా అంబేద్కర్ గారిని గౌరవించుకోడమే కాకుండా నేడు దళితులు అన్ని విధాలా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి కెసిఆర్ వారికి రాజకీయంగా సముచిత స్థానం కలిపించారన్నారు. దళిత బంధు ద్వారా ఎన్నో దళిత కుటుంబాల్లో వెలుగు నింపారని తెలిపారు. కెసిఆర్ గారి నాయకత్వాన్ని నేడు దేశ ప్రజలు కోరుకుంటున్నారని, తెలంగాణ మోడల్ నేడు దేశానికి రోల్ మాడల్ అయ్యిందని తెలిపారు.


ఈ కార్యక్రమంలో వివిధ ప్రవాస సంస్థల ప్రతినిధులతో పాటు దళిత్ యూకే నెట్వర్క్ డైరెక్టర్ గజాల షేఖ్, అంబేద్కర్ యూకే సంస్థ ప్రతినిధి సుశాంత్ ఇంద్రజిత్ సింగ్, ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి,ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి, టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, టీ. డీ. ఎఫ్ చైర్మన్ కమల్ ఓరుగంటి, స్థానిక కౌన్సిలర్లు ప్రభాకర్ ఖాజా, ఉదయ్ ఆరేటి, కన్సర్వేటివ్ నాయకుడు హరి, శ్రీమతి లోకమాన్య, తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఒకే విడతలో రూ. 2 లక్షల రుణ మాఫీ: రేవంత్

తుమ్మల, పొంగులేటి ఇచ్చేది మాత్రమేఅధికారిక సమాచారంకాబినెట్ నిర్ణయాలు వెల్లడించిన సీఎంహైదరాబాద్, జూన్...

అమరావతి ఆంధ్రుల ఆశల ఆకృతి

(వాడవల్లి శ్రీధర్)అ) అమరావతి (ఆ) ఆంధ్రప్రదేశ్ రెండూ అక్షర క్రమంలో రాజధాని...

రెండు ఫైల్స్ పై పవన్ తొలి సంతకాలు

ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరణవిజయవాడ, జూన్ 19 : రాష్ట్ర ఉప...

Immediate challenges to BJP and Modi

(Dr Pentapati Pullarao) There is no challenge to the Narendra...