ర‌హ‌దారుల‌ను సౌక‌ర్యంగా తీర్చి దిద్దండి

Date:

నిరంత‌రం నిర్వ‌హ‌ణ ప‌నులు చేప‌ట్టాలి
బాధ్య‌త‌ల వికేంద్రీక‌ర‌ణ దిశ‌గా చ‌ర్య‌లు
ఆర్ అండ్ బి, పంచాయ‌తీ రాజ్ స‌మీక్ష‌లో సీఎం కేసీఆర్‌
హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 17
: స్వరాష్ట్రంలో పటిష్టంగా తయారు చేసుకున్న తెలంగాణ రోడ్లు రవాణా వత్తిడి వల్ల, కాలానుగుణంగా మరమ్మత్తులు చోటు చేసుకుంటాయని, వాటిని గుంతలు లేకుండా సౌకర్యవంతమైన ప్రయాణానికి వీలుగా నిరంతరం నిర్వహణ పనులు చేపట్టాలని, తెలంగాణ రోడ్లు రవాణాకు సౌకర్యవంతంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రోడ్లు భవనాలు, పంచాయితీ రాజ్ శాఖల మంత్రులు అధికారులకు స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పెరిగిన వనరులతో, రాష్ట్ర స్వయం ఉత్పాదక శక్తితో, రాష్ట్రంలో అభివృద్ధి పనుల పరిమాణం రోజు రోజుకూ పెరుగుతున్నదని సిఎం అన్నారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న గుణాత్మక ప్రగతికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో కావాల్సినంత సిబ్బందిని నియమించుకుని, బాధ్యతల వికేంద్రీకరణ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.


రోడ్లు భవనాల శాఖ, పంచాయతీ రాజ్ శాఖల పరిథిల్లో క్షేత్రస్థాయిలో పనులను మరింత పటిష్టపరిచేందుకు చేపట్టవలసిన నియామకాలు తదితర అభివృద్ధి కార్యాచరణ పై గురువారం నాడు సిఎం కెసిఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. ‘‘ సాంప్రదాయ పద్దతిలో కాకుండా చైతన్యవంతంగా విభిన్నంగా ఇంజనీర్లు ఆలోచన చేయాలె. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుని, వానలకు వరదలకు పాడయిన రోడ్లను ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేయాలె. చెక్కు చెదరకుండా అద్దాల మాదిరి గా రోడ్లను ఉంచేందుకు నిరంతర నిర్వహణ చేపట్టాల్సిన బాద్యత ఆర్ అండ్ బి ., పంచాయితీ రాజ్ శాఖలదే. ఈ దిశగా మీ శాఖల్లో పరిపాలన సంస్కరణలు అమలు చేయాలె. క్షేత్రస్థాయిలో మరింతమంది ఇంజనీర్లను నియమించుకోవాలె..’’ అని సిఎం కెసీఆర్ తెలిపారు.


ఇతర శాఖల మాదిరే ఆర్ అండ్ బీ శాఖకు కూడా ఈఎన్సీ అధికారుల విధానం అమలు చేయాలన్నారు. ప్రతి 5 లేదా 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు వొక ఎస్ ఈ వుండే విధంగా, టెర్రిటోరియల్ సీ ఈ లను కూడా నియమించాలన్నారు. పటిష్టంగా పనులు జరగాలంటే ఎస్ ఈ ల సంఖ్య, ఈ ఈ ల సంఖ్య ఎంత వుండాలో ఆలోచన చేయాలన్నారు. శాఖలో పెరుగుతున్న పనిని అనుసరించి ప్రతిభావంతంగా పర్యవేక్షణ చేసే దిశగా పని విభజన జరగాలన్నారు. ఇందుకు సంబంధించి అధికారులు సమీక్షించుకుని ప్రభుత్వానికి తుది నివేదికను అందచేస్తే వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదించే అవకాశమున్నదని సిఎం అన్నారు.
‘‘ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ, పంచాయితీ రాజ్ శాఖలను పటిష్టం చేసుకునేందుకు పలు మార్గాలను అనుసరించాల్సి వుంది. శాఖల్లో బాధ్యతల పునర్విభజన., వానలకు వరదలకు కొట్టుకు పోయిన రోడ్ల (ఎఫ్ డి ఆర్) ను మరమ్మత్తులు నిర్వహణ., కిందిస్థాయి ఇంజనీర్లు మరమ్మత్తులు తదితర పనులకు సత్వర నిర్ణయం తసుకుని పనులు చేపట్ట దిశగా నిధుల కేటాయింపు, వంటి మార్గాలను అవలంబించాలన్నారు. ఇందుకు సంబంధించి వర్క్ షాపులు నిర్వహించుకుని తగు నిర్ణయాలు తీసుకోవాలని సిఎం అన్నారు.


రోడ్ల మరమ్మత్తులకోసం టెండర్లు పిలిచి వారంలోగా కార్యాచరణ ప్రారంభించాలని సిఎం అన్నారు. అందుకు సంబంధించిన కార్యాచరణ పై తక్షణమే దృష్టి కేంద్రీకరించాలని మంత్రిని ఉన్నతాధికారులను సిఎం ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో కేజీ వీల్స్ తో ట్రాక్టర్లను నడిపడం ద్వారా రోడ్లు పాడవుతున్న విషయాన్ని అధికారులు సిఎం దృష్టికి తెచ్చారు. ఈ దిశగా రైతులను ట్రాక్టర్ వోనర్లు డ్రైవర్లను చైతన్యం చేయాలని, ఇందుకు సంబంధించి కఠిన నిబంధనలు అమలు చేయాలన్నారు.


పంచాయితీ రాజ్ శాఖ ఇంజనీర్లు వారి శాఖ ఫరిధిలోని పాడయిన రోడ్లను గుర్తించి మరమ్మత్తులు చేపట్టాలన్నారు. అటవీ భూములు అడ్డం రావడం ద్వారా రోడ్ల నిర్మాణం ఆగిపోతే, సమస్య పరిష్కారానికి అటవీశాఖతో సమన్వయం చేసుకోవాలని సిఎం అన్నారు. రోడ్లకు వాడే మెటీరియల్ ఉత్పత్తిని హైద్రాబాద్ కేంద్రంగా చేసుకోవాలని తద్వారా సమయాన్ని నాణ్యతను కాపాడుకోవచ్చన్నారు. అందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని అధికారులకు సిఎం సూచించారు.
రాష్ట్రంలోని రోడ్ల మరమ్మత్తుకు రాష్ట్ర ఇరిగేషన్ శాఖకు మాదిరే ఆర్ అండ్ బీ శాఖకు కూడా మెయింటెనెన్స్ నిధులు పెంచినామని సిఎం అన్నారు. కిందిస్థాయి ఇంజనీర్లు ప్రతిచిన్న పనికి హైద్రాబాద్ వచ్చి సమయం వృథా చేసుకోకుండా, వారి వారి స్థాయిని బట్టి వారే స్వయంగా ప్రజావసరాలను దృష్ట్యా, నిధులను ఖర్చే చేసే విధంగా ప్రభుత్వం నిధులను కేటాయిస్తుంద’ అని సిఎం తెలిపారు. ఎవరితో సంబంధం లేకుండా ఖర్చు చేసేందుకు డి ఈ ఈ, ఈఈ , ఎస్ ఈ స్తాయిల్లోని ఇంజనీర్లు ఎవరిదగ్గర ఎన్ని నిధులు కేటాయించాల్నో చర్చించి నిర్ణయించాలని అధికారులకు సూచించారు. రోడ్ల మెయింటెనెన్స్ పనులు సమర్తవంతంగా వుండాలంటే ఆ భాధ్యతను ఏ స్థాయి ఇంజనీరుకు అప్పగించాలో కూడా నిర్ణయించుకోవాలని సూచించారు.
వానలు వరదల కారణంగా తెగిపోయిన రోడ్ల మరమ్మత్తులకు, సాధారణ రోడ్ల మరమ్మత్తులకు మొదటి ప్రాధాన్యతనివ్వాలని రోడ్లు భవనాల శాఖ మంత్రిని అధికారులను సిఎం ఆదేశించారు. ఇరిగేషన్ శాఖ వారి మాదిరి వొక సాప్ట్వేర్ అప్లికేషన్ ను తయారు చేసుకుని రోడ్లను నిత్యం పర్యవేక్షించాలన్నారు. వచ్చే నెల రెండో వారం లోపు రాష్ట్రవ్యాప్తంగా టెండ‌ర్లు పూర్తికావాలన్నారు. రోడ్లు ఎక్కడెక్కడ ఏమూలన పాడయ్యాయో సంబంధించిన పూర్తి వివరాలు క్షేత్రస్థాయి ఇంజనీర్ల దగ్గర వుండాలన్నారు.


‘‘ తెలంగాణ రాష్ట్రంలో నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. రాష్ట్రం చాలా అభివృద్ధి చెందింది. ప్రభుత్వం అందిస్తున్న మద్దతుతో వ్యవసాయం అనుబంధ రంగాలలో సాధిస్తున్న ప్రగతి ద్వారా పల్లె పల్లెనా ట్రాక్టర్లు హార్వెస్టర్లు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఆర్థికంగా బలపడుతున్న గ్రామీణ రైతాంగం వారి కుంటుంబాల రవాణా సౌకర్యార్థం కార్లు టు వీలర్లు కొనుక్కుంటున్నరు. ఇయ్యాల ఇంటికో బండి వాడకో కారున్నది. అటువంటప్పుడు గతంలోలా రోడ్లు ఖాళీగా వుంటలేవు. రోడ్లు నిరంతరం వత్తిడికి గురవుతున్న నేపథ్యంలో వాటి నిర్వహణను ఛాలెంజ్ గా తీసుకోవాల్సిన అవసరమున్నది. పల్లె పట్టణం అనే బేధం లేకుండా రోడ్ల మీద వాహనాల రద్దీ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో రాత్రి పగలు వాహనాల రవాణాతో తాకిడికి గురయ్యే రోడ్లను పటిష్టంగా ఉంచుకోవాల్సిన బాధ్యత, ప్రజలకు రవాణాను నిరంతరం సౌకర్యవంతంగా వుండేలా చూసుకోవాల్సిన బాధ్యత ఆర్ అండ్ బీ పంచాయితీ రాజ్ శాఖలదే’’ నని సిఎం స్పష్టం చేశారు.


రోడ్లు మరమ్మత్తు వో నిరంతర ప్రక్రియగా భావించాలన్నారు. ఇంజనీర్లు ఎక్కడికక్కడ రోడ్లను దూరాల వారిగా విభజించుకుని పని విభజన చేసుకోవాలన్నారు. అందుకు నివేదికలు రూపొందించుకోవాలన్నారు. ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని, ఎప్పటికప్పుడు వర్క్ షాపులను నిర్వహించుకోవాలన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వి.శ్రీనివాస్ గౌడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాల్క సుమన్, పైలట్ రోహిత్ రెడ్డి, దానం నాగేందర్, మైనంపల్లి హన్మంతరావులతోపాటు, సీఎస్ సోమేశ్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎం సెక్రటరీలు భూపాల్ రెడ్డి, స్మితా సభర్వాల్, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, కమిషనర్ హన్మంతరావు, సంజీవరావు, ఆర్ అండ్ సెక్రటరీ శ్రీనివాసరాజు, రవీందర్ రావు, ఫైనాన్స్ సెక్రటరీ రోనాల్డ్ రాస్, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, సత్యనారాయణ రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సూపర్ స్పెషాలిటీల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలి ..
రోడ్లు భవనాల శాఖ ఆద్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానలను పటిష్టంగా నిర్మించాలని సిఎం తెలిపారు. ప్రజల సౌకర్యార్దం వరంగల్ హైద్రాబాద్ లలో నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానాలో ఈ ఎన్ టీ, డెంటల్ ఆప్తమాలజీ, విభాగాలకోసం వొక ఫ్లోర్ ను కేటాయించాలని సిఎం తెలిపారు. ఈ సందర్భంగా సిఎం దవాఖానాల నిర్మాణాల నమూనాలను పరిశీలించారు. ఎత్తయిన అంతస్తులతో అన్ని విభాగాలకు ప్రత్యేకంగా వసతులను ఏర్పాటు చేస్తూ నిర్మాణాలు చేపట్టాలన్నారు. సూచించిన విధంగా నమూనాలను రూపొందించుకుని రావాలని ఆర్ అండ్ బీ శాఖ అధికారులను సిఎం ఆదేశించారు. నూతన దవాఖానాలను అటు మెడికల్ విద్యార్థులకు ఇ ప్రజల వైద్య సేవలకు అనుగుణంగా నిర్మించాలని సి ఎం అన్నారు. కర్పోరేట్ దవాఖానలకు ధీటుగా వరంగల్ లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానా నిర్మాణం కావాలని సిఎం ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Can BJP make a mark in Tamil Nadu?

(Dr Pentapati Pullarao)  There is much discussion whether BJP...

2024 is not 2004 wait till 4th June

(Dr Pentapati Pullarao) 2024 is not 2004 There are many...

Typical ceremonies in Indian Tradition

My experience at the 'Dhoti (boy) and Half-saree (girl)...

ఉషశ్రీరామనవమి

(డా. పురాణపండ వైజయంతి) శ్రీరామనవమి అంటే…అందరికీ రాములవారి కల్యాణం.. శ్రీరామనవమిగానే తెలుసు.కాని మాకు...