‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ టైటిల్ లుక్ రిలీజ్

Date:

యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సినిమాలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపుతున్నారు నేటితరం దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే ఓ యదార్థ సంఘటనను తీసుకొని ఎంతో ఆసక్తికరంగా మలిచారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. దీనికి ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ అనే టైటిల్ ఫిక్స్ చేసి యువత నచ్చేలా ఆ వాస్తవ కథకు తెరరూపమిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టారు మేకర్స్.
బ్లాక్ ఆంట్ పిక్చర్స్ బ్యానర్‌పై అన్ని హంగులు జోడించి రూపొందించిన ఈ సినిమాకు భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా వ్యవహరించారు. శరవణ వాసుదేవన్ సంగీతం సమకూర్చారు. నిఖిల్ సురేంద్రన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. వంశి ఉదయగిరి కో- డైరెక్టర్‌గా పని చేశారు. అన్ని వర్గాల ఆడియన్స్‌ని అలరించేలా ఈ సినిమా రూపొందించామని, ఈ సినిమాతో ప్రేక్షకులకు ఓ కొత్త ఫీల్ దొరుకుతుందని దర్శకనిర్మాతలు తెలిపారు.  
ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’  చిత్రంలో ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల ముఖ్యపాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.
నటీనటులు: ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల
సాంకేతిక వర్గం:బ్యానర్: బ్లాక్ ఆంట్ పిక్చర్స్కథ, దర్శకత్వం: శ్రీనాథ్ పులకురంనిర్మాత: భువన్ రెడ్డి కొవ్వూరిసంగీతం: శరవణ వాసుదేవన్ డి.ఒ.పి : నిఖిల్ సురేంద్రన్  కో- డైరెక్టర్: వంశి ఉదయగిరిపీఆర్ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అన్నమయ్యపై రెండు కీర్తనలు

(మాడభూషి శ్రీధర్)అన్నమయ్య రచించి, స్వర రచన చేసి, పాడిన అద్భుతమైన పాటలపై...

Golden Jubilee Marriage Celebration of a Vibrant Family

(Shankar Chatterjee) Marriage is a legal and socially sanctioned union,...

BJP’s problem is un-settled Maharashtra

(Dr Pentapati Pullarao) Maharashtra is one of the problem states...

Modi’s Kurukshetra of 4 states

(Dr Pentapati Pullarao) The great Mahabharat war between Pandavs...