టీం ఇండియా @1000

Date:

వెస్టిండీస్ సిరీస్‌తో వెయ్యి మ్యాచుల రికార్డు
(శ్రీధర్ వాడవల్లి, 9989855445)
విమర్శలు వచ్చినా ముందుకు వెళ్లే సాహసం చేయడంతో క్రికెట్ కొత్త పుంతలు తొక్కింది. కొత్త ఎప్పుడూ ‘తప్పు కాదు. ప్రయోగం విఫలం కావచ్చు… కానీ ప్రయత్నం చేయాల్సిందే. ప్రతిదీ విజయవంతం అవుతుందన్న గ్యారంటీ ఎక్కడా లేదు. 1971లో వర్షం వల్ల టెస్టులో నాలుగు రోజుల ఆట రద్దయ్యాక… చివరి రోజు ప్రయోగాత్మకంగా 40 ఓవర్ల మ్యాచ్ ఆడటం వల్ల క్రికెట్లో మరో ప్రత్యామ్నాయంగా వన్డేలు ఆవతరించాయి. అందరిని అలరిస్తున్నాయి. 1980లలో కెర్రీ ప్యాకర్ కొత్త తరహాలో ఆటను అందించి ప్రయోగం చేసినప్పుడు ‘పైజామా క్రికెట్’ అన్న‌ విమర్శను ఎదుర్కొన్నా రాను రాను రంగుల దుస్తులతో విద్యుత్ దీపకాంతుల మిరిమిట్లు కొలుపుతూ కార్పోరేట్ క్రీడగా రాజసాన్ని సంతరించుకొని ఆటగాళ్ళకు ఆండగా నిలిచే వాళ్ళకు కాసుల వర్షం కురిపిస్తోంది. రంగు బంతినుంచి తెల్లబంతివరకూ వివిధ వినూత్న నియమాలతో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ పరిణతి చెందిన సుదీర్ఘపయనం. క్రికెట్ ఆటగాళ్ళు దేవుళ్ళు. భారత్‌లో క్రికెట్ ఓ మతం వంటిది. మిగతా దేశాల పరిస్థితి ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం క్రికెట్ ను ప్రజల రోజూవారీ జీవితాల నుంచి విడదీయలేం. క్రికెట్ పుట్టినిల్లు బ్రిటన్ లో కూడా లేని ఆదరణ. మనకు ఉంది. ఆ క్రమంలో ఇండియాలో కూడా ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉద్భవించారు. తాజాగా టీమిండియా ప్రపంచ క్రికెట్ లో మరో అరుదైన ఘనతను సాధించబోతున్నది.

ఇటీవలే పరిమిత ఓవర్ల క్రికెట్ లో కొత్త సారథిగా ఎంపికైన రోహిత్ శర్మ పాలు పంచుకోనుండటం గమనార్హం. వెస్టిండీస్ తో ఫిబ్రవరి 6న మోతేరా స్టేడియం వేదికగా జరుగబోయే తొలి వన్డే భారత్ కు 1,000వ వన్డే. ఈ అరుదైన వన్డేకు హిట్ మ్యాన్ సారథిగా వ్యవహరించనున్నాడు . క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ తో పాటు ఏ జట్టు కూడా ఇంతవరకు అంతర్జాతీయ క్రికెట్ లో వెయ్యి వన్డేలు ఆడలేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా క్రికెట్ కూడా కొత్త పుంతలు తొక్కుతున్న కాలమది. టెస్టు క్రికెట్ పట్ల జనాలకు ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 1971 జనవరి 5 న తొలి వన్డే నిర్వహించింది. ప్రపంచ అగ్రశ్రేణి క్రికెట్ జట్లైన ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య ఆ మ్యాచ్ జరిగింది. ఇక భారత్ విషయానికొస్తే.. క్రికెట్ లో తొలి వన్డే జరిగిన నాలుగేళ్లకు మనం మొదటి వన్డే ఆడాం. 1974లో భారత జట్టు.. ఇంగ్లాండ్ తో హెడింగ్లీ వేదికగా తొలి వన్డే ఆడింది. టీమ్ఇండియా ఇప్పటి వరకు 999 వన్డేలు ఆడింది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఇన్ని మ్యాచులు ఆడిన జట్టు మరొకటి లేదు. వెయ్యో మ్యాచ్ ఆడబోతున్న తొలి దేశంగా భారత్ చరిత్రలో నిలిచిపోనుంది. 1974లో అజిత్ వాడేకర్ నాయకత్వంలో ఇంగ్లాండ్పై టీమ్ఇండియా తొలి వన్డే ఆడింది. అక్కడి నుంచి మనం వెనుదిరిగి చూసిందే లేదు. రెండు ప్రపంచ కప్‌లు సాధించాం. అత్యుత్త‌మ జట్టుగా ఎదిగాం. విలువైన క్రికెటర్లను ప్రపంచానికి అందించాం. భారత వందో వన్డేకు కపిల్‌దేవ్ సారథ్యం వహించాడు. ఈ మ్యాచ్ ఆస్ట్రేలియాపై జరిగింది. 200 వన్డేకు మహ్మద్ అజహరుద్దీన్, 300 మ్యాచుకు సచిన్ తెందూల్కర్, 400 వన్డేకు మహ్మద్ అజహరుద్దీన్ నాయకత్వం వహించారు. కీలకమైన 500వ వన్డేకు సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ చేశాడు. ఈ మ్యాచ్ కూడా ఇంగ్లాండ్‌పైనే జరిగింది. ఇక 700, 800, 900 వన్డేలకు ‘మిస్టర్ కూల్’ ఎంఎస్ ధోనీ నేతృత్వం వహించాడు. ముచ్చటగా 1000 వన్డేలో రోహిత్ శర్మ టీమ్ఇండియాను ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం మొతేరాలో నడిపించనున్నాడు. మన తర్వాతే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేకు అజిత్ వాడేకర్ సారథిగా వ్యవహరించాడు. అప్పుడు మొదలైన భారత ప్రస్థానం.. 42 ఏండ్లుగా నిరాటంకంగా కొనసాగుతున్నది. భారత జట్టు ఇప్పటివరకు 1974 నుంచి మొన్న దక్షిణాఫ్రికా తో ముగిసిన వన్డే సిరీస్ (1974-2022) వరకు 999 వన్డేలు ఆడింది. మన తర్వాత జాబితాలో ఆస్ట్రేలియా (958), పాకిస్థాన్ (936), శ్రీలంక (870), వెస్టిండీస్ (834), న్యూజిలాండ్ (775), ఇంగ్లాండ్ (761), సౌతాఫ్రికా (638), జింబాబ్వే (541), బంగ్లాదేశ్ (388) ఉన్నాయి.
• టీమ్ఇండియా అరుదైన గణాంకాలు
• ఆడిన వన్డే లు : 999
• గెలిచిన మ్యాచులు : 518 (51.85%)
• ఓడిన మ్యాచులు : 431 (43.14%)
• టై అయిన మ్యాచులు : 9
• ఫలితం తేలని మ్యాచులు : 41
• ఆడిన క్రికెటర్లు : 242
• అత్యధిక వ్యక్తిగత స్కోరు : 264 (రోహిత్ శర్మ)
• అత్యధిక పరుగుల క్రికెటర్ : 18,426 (సచిన్ తెందూల్కర్)
• అత్యుత్తమ బ్యాటింగ్ సగటు : 58.78 (విరాట్ కోహ్లీ)
• అత్యు్త్తమ బౌలింగ్ : 6/4 (స్టువర్ట్ బిన్నీ)
• అత్యధిక వికెట్లు : 334 (అనిల్ కుంబ్లే)
• ఎక్కువ డిస్మిసల్స్ : 438 (ఎంఎస్ ధోనీ, స్టంపులు, క్యాచులు కలిసి)
• అత్యధిక జట్టు స్కోరు : 418-5 (వెస్టిండీస్పై)
• అత్యల్ప జట్టు స్కోరు : 54 (శ్రీలంక చేతిలో)
ఆటగాళ్ళు క్రీడాస్పూర్తితో మెలిగి ఆంకితభావంతో దేశం కోసం ఆడాలి. ఆదరించేవాళ్ళు ప్రేక్షకులు దీనిని క్రీడగా చూసి అస్పాదించాలి బెట్టింగ్ క్రీనీడ పడకుండా ప్రతిఒక్కరు వ్యవహరించిన నాడు క్రికెట్ నిజంగా జంటిల్ మ్యాన్ అట గా మనగలుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

BJP’s southern strategy

(Dr Pentapati Pullarao) In the six southern states of Karnataka,...

తెలంగాణాలో మూడు ఫార్మా విలేజెస్

లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్బయో ఆసియా సదస్సులో సీఎం రేవంత్ ప్రకటనహైదరాబాద్,...

I.N.D.I.A. Alliance unity going ahead  

(Dr Pentapati Pullarao) After losing the 2014 and 2019 parliament...

షావుకారు పోస్టరు వెనుక కధ

(డా. పురాణపండ వైజయంతి) మన సినిమాలలో కథానాయకుడికే ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా కథానాయకుడు...