ఏఐ హబ్ గా హైదరాబాద్: రేవంత్

Date:

రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్ లో సీఎం
వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు
హైదరాబాద్, సెప్టెంబర్ 05 :
సాంకేతికత, ఆవిష్కరణ లేకుండా సమాజంలో ఏ మార్పు చోటు చేసుకోదని తెలంగాణ ముఖ్యం మంత్రి ఏ. రేవంత్ రెడ్డి చెప్పారు. మొదటి రైలు, ఇంజిన్ ఆవిష్కరణ తరువాత ప్రపంచం పూర్తిగా మారిందన్నారు. విమానం ఆవిష్కరణతో ప్రపంచ స్వరూపమే మారిపోయిందన్నారు.
ఇదే క్రమంలో కరెంటు, బల్బు, టీవీ, కెమెరా, కంప్యూటర్ – ఇవన్నీ ప్రపంచ గతిని మార్చడంలో కీలక పాత్ర పోషించాయని రేవంత్ చెప్పారు. హైదరాబాద్ లోని హైటెక్స్ లో మేకింగ్ ఏఐ వర్క్ ఫర్ ఎవ్రి వన్ థీమ్ తో ఏర్పాటైన అంతర్జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు.


వివిధ దేశాల నుంచి సదస్సుకు 2వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. రెండు రోజులపాటు AI గ్లోబల్ సమ్మిట్ సాగనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో J-PAL గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇక్బాల్ సింగ్ దలివాల్ భేటీ అయ్యారు.

ఏఐ రంగం అభివృద్ధిపై చర్చించారు. IBM వైస్ ప్రెసిడెంట్ డానియల్ కాంబ్ కూడా సీఎం తో సమావేశమై AI లో భవిష్యత్తు అవకాశాలు, కొత్త ఆవిష్కరణల గురించి చర్చించారు. Yotta infrastructure solution LLP సీఈవో సునీల్ గుప్తా హైదరాబాద్ లో జీపీయూ ఆధారిత AI క్లౌడ్ ఏర్పాటులో భాగస్వామ్యం గురించి మాట్లాడారు. గ్లోబల్ సమ్మిట్ లో సీఎం రేవంత్ AI రోడ్ మ్యాప్ విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిని రూపొందించింది. రోడ్ మ్యాప్ లో 25 కార్యక్రమాలను ప్రభుత్వం పొందుపరిచింది. అనంతరం AI స్టాల్స్ ను రేవంత్ సందర్శించారు. ఈ సందర్భంగా రేవంత్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే…


టెలివిజన్, కంప్యూటర్లు, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ చూడటం మన తరం చేసుకున్న అదృష్టం.
ఇవాళ ప్రపంచ సాంకేతికరంగంలో వచ్చిన అత్యుత్తమ ఆవిష్కరణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడల్లా కొంత భయం నెలకొంటుంది.
అది మన జీవితాన్ని ఎలా మెరుగుపరుస్తుంది.. అదే సమయంలో ఉద్యోగాలు పోతాయా భయం ఉండటం సహజం.
దేశ చరిత్రను పరిశీలిస్తే.. గతంలో వచ్చిన పారిశ్రామిక విప్లవాన్ని సరిగ్గా అనుసరించలేకపోయాం.
భారతదేశ భవిష్యత్తు గురించి మనం ఆలోచిస్తే.. హైదరాబాద్‌ సిటీలా మరీ సిటీ పరిశ్రమల ఏర్పాటుకు సంపూర్ణంగా సిద్ధంగా లేదు. ఇందుకు సంబంధించిన సవాళ్ళను స్వీకరించడమే కాదు… భవిష్యత్తును సృష్టిస్తాం..


ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు.
ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం చాలా చర్యలు తీసుకున్నాం.
ఈ రంగంలో మన భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటున్నాం.
తెలంగాణ AI మిషన్, లేదా NASSCOM భాగస్వామ్యంతో T-AIM తెలంగాణలో AI ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేయడంలో మాకు సహకరిస్తాయి.


ఇండస్ట్రీ నిపుణులతో కలిసి ఆవిష్కరణలను ప్రభుత్వం ముందుకు తీసుకెళుతుంది.
హైదరాబాద్ ను AI హబ్ గా తీర్చిదిద్దబోతున్నామనేందుకు ఈ సదస్సు నిదర్శనం.
సిటీ ఆఫ్ ది ఫ్యూచర్‌కి మీ అందరికి స్వాగతం. మనమందరం కలిసి ఫ్యూచర్ సిటీని ఒక గొప్ప AI హబ్ గా తీర్చిదిద్ధే సంకల్పంతో మీరంతా భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నానని సీఎం తన ప్రసంగం ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

సింగ‌రేణి కార్మికుల‌కు బోన‌స్‌…. ఒక్కొక్కరికి రూ. 1 .90 లక్షలు

ద‌స‌రాకు ముందే కార్మికుల కుటుంబాల్లో పండ‌గ‌కార్మిక కుటుంబాల‌కు అంద‌నున్న‌ రూ.796 కోట్లుతొలిసారిగా...

లడ్డూపై లడాయి

నాటి నుంచి నేటి వరకూ లడ్డూ ప్రసాదం కథ కమామిషు(వాడవల్లి శ్రీధర్)కలియుగ...

అందరమొకటై చేయి చేయి కలిపి… జై జై గణేశ

శిల్ప కాలనీలో ఘనంగా గణేశ ఉత్సవాలు67 వేలకు పెద్ద లడ్డూ, 17...

Young India Skill university a role model for country

CM Revanth Appeals to Industrialists to play a key...