రాకేష్ శర్మ తరవాత శుభాన్షు శుక్లా
(Kvs Subrahmanyam)
రాకేష్ శర్మ గుర్తున్నారా? నలభై ఒక్క ఏళ్ల క్రితం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లివచ్చిన వ్యోమగామి. ఇప్పుడు శుభాన్షు శుక్లా ఐ.ఎస్.ఎస్. కు వెళ్లనున్నారు. రేపు ఆయన అంతరిక్ష కేంద్రానికి ప్రయాణమవుతారు. శుక్లా తండ్రి శంభు దయాల్ శుక్లా ఈ విషయం చెబుతూ, ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి శుభాన్షుకు వ్యోమగామి కావడం ఇష్టమని తెలిపారు. పదహారేళ్ళ వయసులో అతను నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాడు. తన కుమారుడు ఎప్పుడూ ఆదుకోవడానికి కూడా ఇంటి నుంచి బయటకు వెళ్ళేవాడు కాదని తల్లి ఆశ శుక్లా చెప్పారు.

శుభాన్షు 1985 అక్టోబరులో లక్నోలో జన్మించారు. తరగతి గది నుంచే ఆయన ఆకాశంలోకి తన ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. కార్గిల్ యుద్ధంలో మన సైనికుల పోరాటం అతనికి ఇన్స్పిరేషన్ ఇచ్చింది. 2004 లో ఆయన ఎన్.డి.ఏ. నుంచి కంప్యూటర్ సైన్స్ లో బాచిలర్ పట్టా పొందారు. 2006 లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ప్రవేశించారు. 2019 లో ఇస్రో ఏరోస్పేస్ శిక్షణ కార్యక్రమానికి ఎన్నికయ్యారు. గగన్ యాన్ కు వెళ్లే నలుగురిలో శుక్లా పేరును ప్రధానమంత్రి మోడీ 2024 లో అధికారికంగా ప్రకటించారు.

అమెరికాకు చెంది ఆక్సియోమ్ స్పేస్ తన నాలుగో మిషన్ ను జూన్ పదోతేదీన సాయంత్రం 5 . 52 గంటలకు అంతరిక్షానికి పంపనుంది. ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎస్ రాకెట్ ఫాల్కన్ 9 లో శుక్లాతో పాటు నలుగురు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపనుంది. ఇప్పటికి ఈ మిషన్ మూడుసార్లు వివిధ కారణాల వల్ల వాయిదా పడింది.

ఇంతకుముందు 1984 లో రష్యన్ వ్యోమనౌక సూయజ్ లో rakesh sarma అంతరిక్షానికి వెళ్లారు. ఆ తరవాత అంతరిక్షానికి వెడుతున్న భారతీయుడు శుక్లా. అప్పట్లో రాకేష్ శర్మ అంతరిక్షం నుంచి అప్పటి ప్రధాని ఇందిరా గాంధీతో సంభాషించారు.