భారతీయుల డి.ఎన్.ఏ.

0
97

భారత దేశీయులందరిదీ ఒకే డి.ఎన్.ఏ.
విదేశీ మతాల్ని వ్యతిరేకించిన అంబేడ్కర్
ఆయనను నమ్ముతూ ఆ మతాల్ని ఎందుకు అనుసరిస్తున్నారు?

(రోచిష్మా‌న్, 9444012279)

“నా మతం, నా మతం” అని చెప్పుకునే విదేశీ మతోన్మాదీ, సరిగ్గా ఆలోచించు. నీ వంశ మూలం ఏ విదేశీమతందీ కాదు కదా? ఒక వేళ విదేశీ మూలాలు కల వంశమైనా 500‌‌ ఏళ్లు ఒక‌ ప్రదేశానికీ,‌‌ ఒక వాతావరణానికీ, ఒక ఆహార విధానానికీ అలవాటు పడితే జీన్స్ మారిపోతాయి. ఇది విజ్ఞానం.

పుట్టిన ఒక బిడ్డకు తల్లి వైపునుంచీ, తండ్రి వైపు నించీ 8 తరాల జీన్స్ సంక్రమిస్తాయి.‌ ఇదీ విజ్ఞానమే. జీన్స్ ప్రకారంగా ఇక్కడ ఎవరూ సహజంగానూ, పుట్టుకతోనూ విదేశీ మతస్థుడవడం ఉండదు. ఓ ఈ దేశవాసీ, నువ్వు వైజ్ఞానికంగా ఎప్పటికీ విదేశీ మతస్థుడివి అవవు, కాలేవు. ఎవరైనా తమను తాము విదేశీ మతస్థులుగా అనుకోవడమూ, ప్రకటించుకోవడమూ అన్నవి బుద్ధిలేని తనం, చెడ్డతనం, భ్రష్టత్వం.

ఈ దేశంలో ముస్లీం, క్రిస్టిఅన్, బ్రాహ్మణ-దళిత, ఆర్య- ద్రావిడ వర్గాలూ, ఈ విభేదాలూ వాస్తవాలు కావు. సహజంగా ఏర్పడినవి కావు.DNA ఆధారంగా అందఱూ ఒకటే.‌ ఇంగ్లిష్ పాలకులు రాజకీయ అవసరాల కోసం కల్పించి, పెంచి,‌పోషించిన‌ కుట్ర ఇది. ఆర్యవాదం అన్న అబద్ధం ముస్లీమ్ పాలన కాలంలో లేదు.

విదేశీమతోన్మాదంతో మృగాలుగా బతికింది‌ చాలు. మూర్ఖత్వంతో మన మట్టిని‌, మన సంఘాన్ని ధ్వంసం చేసుకున్నది చాలు. తెలివిడి కావాలి. తెలివిడితో వాస్తవాలను తెలుసుకుని‌ విద్వేషాల నుంచి విడివడి భారతీయులమై బతుకుదాం రండి.

అంబేడ్కర్ ఇస్లామ్, క్రిస్టియానిటి, వంటి విదేశీమతాల్ని తీవ్రంగా నిరసించాడు. మఱి ఆయన పేరు చెప్పుకుని బతుకుతున్న‌ వాళ్లు ఆయన్ను అనుసరించక పోవడం ఏమిటి?‌ చెడ్డతనం అంటే ఇదే. ఇలా చెడిపోయి బతుకుతూ సభ్యత,‌ సంస్కారమూ లేకుండా సాటి మనిషిపై, ఉంటున్న‌ సమాజంపై, సొంత దేశంపై విద్వేషంతో దాడిచేసే వాళ్లు అసాంఘీక శక్తులు, చీడపురుగులు, సంఘద్రోహులు, దేశద్రోహులు.

“ఆ మతం వాళ్లం,‌ ఈ మతం వాళ్లం” అని సిగ్గులేకుండా చెప్పుకునే వాళ్లు ఎప్పుడు‌ ఆ‌ విదేశీ మతాలవాళ్లు అయ్యారు? కొన్ని తరాల క్రితమో, ఈ తరంలోనో వీళ్లు మతం మారారు. మతం మారడం అంటే ఏమిటి? ఏవో ప్రలోభాలకో, మతి చెడో, బలవంతంగానో , బలహీనులుగానో, సరైన ఆలోచనలేకో, ఆదాయం కోసమో, అవసరాల కోసమో మతం మారడం జరుగుతుంది. మతం మారడం అన్నది స్వాభావికమైనదో, సహజమైనదో కాదు‌ కదా? కృత్రిమం, వక్రం ఈ‌ మతం మారడం అన్నది. అదిగో అందుకే విదేశీ మతంలోకి మారిన వాళ్లు స్వదేశానికీ, స్వసమాజానికీ, సాటిమనిషికీ హానికరంగా పరిణమిస్తూంటారు. సరిగ్గా ఈ విషయాన్నే అంబేడ్కర్ ఎప్పుడో‌ చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే విదేశీ మతోన్మాదులవల్లా, మతి‌ చెడిన కులోన్మాదులవల్లా మన దేశవాసులకూ, మన దేశానికీ భయంకరమైన కీడు జరుగుతోంది.

మన దేశంలోని విదేశీ మతాల మూలాలు ఎక్కడున్నాయి? ఆ మతాల మూల పురుషులు ఎవరు? ఆ మూల పురుషుల జన్మమతాలు ఏమిటి? ఆ మతాల మూల పురుషులే ఆ మతాల‌వాళ్లు కాదు! మఱి వాళ్ల సొంత మతాలే అవి కానప్పుడు వాటిని అనుసరించే మిగతా వాళ్లు ఏ మతాల వారౌతారు? ఈ దేశాన్నీ ‍, ఈ సంఘాన్నీ , హింసిస్తున్న మతోన్మాదీ, సరిగ్గా ఆలోచించు. ఈ దేశానికీ, ఈ సంఘానికీ, సాటి మనిషికీ కీడు చెయ్యకు.

ఈ దేశంలో DNA ప్రకారం బ్రాహ్మణ, దళిత తేడాలు కూడా లేవు. అందఱిదీ ఒకే DNA నే‌.

రాజ్యాంగ పరంగా ఈ దేశాన్ని మత‌రహిత దేశం అని చేసి కులరహిత దేశం అని ఎందుకు చెయ్యలేదు? 78 ఏళ్ల క్రితం ఆధికారికంగా కుల ప్రస్తావన్ని తీసేసి ఉంటే ఇవాళ దేశంలో కుల భేదాలు ఉండేవి కావు. అంటే కుల నిర్మూలన చెయ్యగలిగీ కూడా స్వతంత్రం వచ్చాక తొలిదశ ప్రభుత్వం ఆ పని చెయ్యలేదు. దారుణం ఇది. ఈ‌ దేశంలో కుల చిచ్చు రగులుతూండాలనేది ఒక రాజకీయ కుట్ర. దీనికి మూలం ఇంగ్లిష్ ప్రభుత్వ కాలంలో రిస్లే అన్న వాడి ఆలోచన, ప్రణాళిక. వాడే ఈ దేశంలో ఆధికారికంగా కులాల్ని పాలన పరంగా మనపై రుద్దాడు. అప్పటికి ఏదో ఒక శాతం మాత్రం ఉండే S.C. అన్న వర్గాన్ని కుట్రపూరితంగా ఇతర వర్గాల్ని (కలిపేసి) 10 శాతం చేసింది ఆ రిస్లే నీచుడే. ఆ రిస్లే కుట్లకు మనదేశ పౌరులు ఇంకా బలౌతునే ఉన్నారు.

మానసిక దౌర్బల్యంతో బానిస‌కొడుకులై ఇవాళ “కులం కులం” అంటూ అసాంఘీక శక్తులు పేట్రేగిపోతున్నారు.

కులం‌ అనేది పుట్టుకతో వచ్చేది కాదు. మానసిక స్థితి, బుద్ధి, ప్రవర్తనల పర్యవసానం. కుటుంబ అలవాట్లు, కుటుంబ తీరు తెన్నులకు అతీతంతా ఎవరికి వారు తమ స్థాయిని‌ పెంచుకోవచ్చు. చదువు, సంస్కారం, జీవన విధానం, ఆలోచనా సరళి, ప్రవర్తన ఇవే ఒక మనిషి సామాజిక స్థాయిని, ఉన్నతిని నిర్ధారించేవి‌.

బానిసత్వం కాదు సరైన జ్ఞానం కావాలి. జ్ఞానంవల్ల వచ్చే స్వేచ్ఛ కావాలి మనకు. ఈ దేశంలోని మతోన్మాదీ, కులోన్మాదీ నీకు బానిసత్వం కాదు సరైన జ్ఞానంతో స్వేచ్ఛ కావాలి.

మతపరమైన, కులపరమైన అవలక్షణాలను సరైన చింతనతో సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశానికి ఇప్పుడు అది ఎంతో అవసరం.

విదేశీ బానిస భావజాలంతో, విదేశీమతాల డబ్బుతో మన సమాజానికి పెనుహాని జరిగింది, జరుగుతోంది. జరిగిన తప్పు తెలుసుకుని దిద్దుకుని మనం పునర్నిర్మాణం కావాలి.

ఈ దేశం మనది. మనం భారతీయులం; మనం భారతీయులంగా బతుకుదాం.

“మన జాతీయత భారతీయత; భారతీయతతో బతకడం మన బాధ్యత”.

(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here