వృత్తిపరమైన గౌరవాన్ని ఇనుమడించుకోవాలి

Date:

జె.ఎన్.జె. సొసైటీకి భూమి అప్పగింత
సభ్యులలో ఆనందోత్సాహాలు
సీఎంకు జేజేలు చెప్పిన సొసైటీ కుటుంబీకులు
హైదరాబాద్, సెప్టెంబర్ 08 :
దాదాపు పద్దెనిమిదేళ్ల నిరీక్షణకు తెర పడింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నమాట మీద నిలబడి జె.ఎన్.జె. హౌసింగ్ సొసైటీకి పెట్ బషీరా బాద్ లోని 38 ఎకరాలను అప్పగిస్తూ ధ్రువ పత్రాన్ని అందించడంతో వెయ్యిమంది జర్నలిస్టు సభ్యుల కుటుంబాలలో ఆనందం తాండవించింది. ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్నంత సేపు సొసైటీ సభ్యుల కరతాళ ధ్వనులతో రవీంద్ర భారతి ప్రాంగణం మార్మోగిపోయింది. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ… గీతాలాపనతో ప్రారంభమైన సభ సొసైటీ సభ్యుల కుటుంబీకులతో కిటకిటలాడిపోయింది. ఈ కార్యక్రమంలో ఐ అండ్ పి.ఆర్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే రంగారెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జి.హెచ్.ఎం.సి. మేయర్ గద్వాల విజయలక్ష్మి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హాజరైన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి తొలుత చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.లక్ష చెక్కులను పంపిణీ చేసారు.


అనంతరం జే.ఎన్. జే. హెచ్.ఎస్ బోర్డు అధ్యక్షుడు కిరణ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ రవికాంత్ రెడ్డి, సెక్రటరీ వంశి శ్రీనివాస్, డైరెక్టర్లు రమణారావు, అశోక్ రెడ్డిలకు పెట్ బషీరాబాద్ భూమికి సంబంధించిన స్వాధీన పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ జర్నలిస్టులను సమాజానికి చికిత్స చేసే డాక్టర్లుగా అభివర్ణించారు. వారి సంక్షేమం కోరుతూ ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆనాడు వైఎస్ఆర్ నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేసారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి తమకు ఎలాంటి శశబిషలు లేవని స్పష్టం చేశారు. మీ సమస్యకు మా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోందని చెప్పారు.
వృత్తిపరమైన గౌరవాన్ని మనకు మనమే పెంచుకోవాలని జర్నలిస్టులకు ఆయన హితవు చెప్పారు. రాజకీయ నాయకులకు కూడా ఇది వర్తిస్తుందన్నారు. ప్రజాభిప్రాయం, జర్నలిస్టుల సూచనలతో ప్రజా ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. వ్యవస్థలపై నమ్మకం పెంచాలన్నదే మా ప్రభుత్వ విధానమని రేవంత్ స్పష్టం చేశారు.


జర్నలిజం కూడా వ్యవస్థల్లో ఒక భాగమేనని గుర్తెరిగి మెలగాలని సూచించారు.
ఒకనాడు రాజకీయ పార్టీలు సిద్ధాంత భావజాల వ్యాప్తి కోసమే పత్రికలు ఏర్పాటు చేసుకునేవనీ, కానీ ఈరోజుల్లో ఉన్మాద ధోరణితో వ్యవహరించే పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కొందరి చేష్టలతో జర్నలిస్టులందరికీ చెడ్డపేరు వస్తోందన్నారు. కొంతమంది జర్నలిస్టు పదం అర్ధాన్నే మార్చేలా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిని నియంత్రించే బాధ్యత జర్నలిస్టులపైనే ఉందని పేర్కొన్నారు. నిజమైన జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వానిదని భరోసా ఇచ్చారు.


భాష విషయంలోనూ కొన్ని పత్రికలు గీత దాటుతున్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి హోదానూ అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారని ఆయన చురక వేశారు.


రాజకీయ పార్టీల యజమానులను రక్షించేందుకు మాత్రమే వారు ప్రాధాన్యతనిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిపై తీసుకునే చర్యలను నిజమైన జర్నలిస్టులు అది తమపైనే తీసుకున్నట్టు భావించవద్దని సూచించారు. నిజమైన జర్నలిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందన్నారు.
ఆరోగ్య భద్రత కార్డులు, అక్రిడేషన్ ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం మీడియా అకాడమీ కొత్త విధి విధానాలు తయారు చేయాలని సీఎం ఆదేశించారు. వాటికి కేబినెట్ ఆమోదం తెలిపే బాధ్యత తమదేనని చెప్పారు. తెలంగాణకు టూరిజం, ఎనర్జీ, స్పోర్ట్స్ పాలసీలు లేవని చెప్పారు. ఆ మాటకొస్తే గత పదేళ్లుగా తెలంగాణకు అసలు పాలసీలే లేకుండా పోయాయని గత ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.


మీడియా అకాడమీకి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూ.10కోట్లు ఇస్తున్నానని ప్రకటించారు. ఇళ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దనీ, అర్హులైన వారిని ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేస్తామని రేవంత్ చెప్పడంతో సభా ప్రాంగణం హర్షధ్వానాలతో మార్మోగి పోయింది. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో మనందరం భాగస్వాములమవుదామని పిలుపునిస్తూ రేవంత్ తన ప్రసంగాన్ని ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

జర్నలిస్టులంటే ఎవరు…

అసెంబ్లీలో ప్రశ్నించిన సీఎం రేవంత్హైదరాబాద్, మార్చి 15 : తెలంగాణ సీఎం...

New challenges to Modi government

(Dr Pentapati Pullarao) Narendra Modi is a good political fire-fighter....

Cong Groping for A Winning Strategy

(Anita Saluja) Three successive defeats in the General Elections, has...

డాక్టర్ నోరి జీవనయానం

మంటాడా నుంచి మన్ హటన్ దాకావిజయవాడ: ప్రముఖ వైద్యులు డాక్టర్ నోరి...