పొలిటిక‌ల్ కార్టూనిస్ట్ పాపా క‌న్నుమూత‌

Date:

హైద‌రాబాద్‌, జూలై 23: ప్ర‌ముఖ కార్టూనిస్ట్ పాపా క‌న్నుమూశారు. శ‌నివారం మ‌ధ్యాహ్నం గుండెపోటు రావ‌డంతో ఆయ‌న‌ను హైద‌రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ ఆయ‌న తుది శ్వాస విడిచారు. ఈనాడు ప‌త్రిక‌లో ఆయ‌న రాజ‌కీయ కార్టూనిస్ట్‌గా త‌న ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు. ఆయ‌న మృతికి ప‌లువురు కార్టూనిస్టులూ, ప్ర‌ముఖులూ సంతాపం తెలిపారు. పాపా అస‌లు పేరు కొయ్య శివ‌రామిరెడ్డి. వ‌యో వృద్ధ పాత్రికేయ సంఘం ఆయ‌న మృతికి సంతాపాన్ని ప్ర‌క‌టించింది. ఆంధ్రప్రభ లో పాప రెగ్యులర్ గా పాకెట్ కార్టూన్లు వేసేవారు. ఈనాడు లో పాప కార్టూన్ లు తెగ పేలేవి. అప్పట్లో అంజయ్య సిఎం గా ఉండగా ఆయన అమాకత్వంపై పాప రోజూ ఒక కార్టూన్ పెల్చే వారు. అంజయ్య తను ప్రయాణించే ప్రభుత్వ హెలీకాప్టర్ కి యాదగిరి అని పేరు పెట్టుకున్నారు. అంజయ్య కార్టూన్ లో ఆయన కాలి బొటన వేలుకి ఒక హెలీకాప్టర్ బొమ్మ తాడు కట్టినట్టుగా వేసేవారు. అంజయ్య సిఎంగా రిజైన్ చేసినపుడు యాదగిరి రెండు కళ్లనుంచి కన్నీటి బొట్లు కారుస్తున్న పాప కార్టూన్ ఎవరూ మరచిపోలేరు. ఈనాడు తరువాత ఆంధ్రప్రభ కు వచ్చేరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పాత్రల్లో జీవించిన గొప్ప నటుడు రమణారెడ్డి

పుస్తకాన్ని ఆవిష్కరించిన డాక్టర్ బ్రహ్మానందంహైదరాబాద్: తిక్కవరపు రమణారెడ్డి ఎన్నో పాత్రల్లో జీవించిన...

ముంబైని వెంటాడే కాళరాత్రి

26/11 ప్రత్యక్షసాక్షుల జ్ఞాపకాలు(డా.వైజయంతి)ముంబై నగరం పైకి చూడటానికి ఎప్పటిలాగే అంతా ప్రశాంతంగా...

Who will be triumphing in MAHA elections?

Is it Mahayuti or Maha Vikas Aghadi? Among all parties...