Tuesday, March 28, 2023
Homeతెలంగాణ వార్త‌లుతెలంగాణ సంగీత‌, నాట‌క అకాడెమీ చైర్మ‌న్ దీపికారెడ్డి

తెలంగాణ సంగీత‌, నాట‌క అకాడెమీ చైర్మ‌న్ దీపికారెడ్డి

సీఎం కేసీఆర్ నిర్ణ‌యం…ఉత్త‌ర్వులు జారీ
హైద‌రాబాద్‌, జూలై 25:
ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, జాతీయ సంగీత నాటక అకాడెమీ అవార్డు గ్రహీత, దీపికారెడ్డిని రాష్ట్ర సంగీత నాటక అకాడెమీ చైర్మన్ గా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. సిఎం కెసిఆర్ నిర్ణయం మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దీపికా రెడ్డి గురించి

శ్రీమతి దీపికా రెడ్డి కూచిపూడి నాట్య కళా ప్రపంచం లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, గుర్తింపును సంపాదించుకున్న అద్భుత నృత్య కళాకారిణి, సృజనాత్మక నృత్య దర్శకురాలు. ప్రముఖ కూచిపూడి నాట్య గురువు పద్మ భూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం శిక్షణలో నాట్యకళను ఔపోసన పట్టిన విదుషీమణి శ్రీమతి దీపిక. బాల్యంలోనే నాట్యం పై అపారమైన అభిరుచితో ప్రవేశించిన ఆమె అంచెలంచలుగా ప్రావీణ్యాన్ని సముపార్జించారు. కూచిపూడి నాట్య రంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో వీరి నిర్విరామ కృషి, అంకిత భావం, అద్భుత ప్రతిభకు గుర్తింపు గా అనేక బిరుదులు, సత్కారాలు వీరిని వరించాయి. వాటిలో ప్రముఖమైనవి, భారత రాష్ట్రపతి ద్వారా అందుకున్న కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం, కళారత్న, చెన్నై కృష్ణ గాన సభ వారి నృత్య చూడామణి, అక్కినేని నాగేశ్వరరావు స్వర్ణ కంకణం మొదలైనవి అందుకున్నారు. శ్రీమతి దీపిక అనేక ప్రముఖ అంతర్జాతీయ నృత్యోత్సవాలలో అద్భుతంగా నాట్య ప్రదర్శన లిచ్చారు. వాటిలో ముఖ్యమైనవి, బర్లిన్ లో “Festival of India” ముగింపు ఉత్సవం, రాష్ట్రపతి భవన్, శ్రీలంక శాసనసభ, రష్యాలోని బొల్షోయి థియేటర్ లో జరిగిన “Year of India” ప్రారంభ నృత్యం వంటి ప్రతిష్టాత్మక వేదికలపై నాట్యకళా వైదుష్యాన్ని ప్రదర్శించి, రసజ్ఞుల మన్ననలందుకున్నారు. జపాన్ లోని హీరోషిమా లో ఇచ్చిన గొప్ప ప్రదర్శన కు మెచ్చి ఆ దేశం గౌరవ సభ్యత్వాన్ని బహుకరించింది. బ్యాంకాక్ అంత రాష్ట్రీయ ఉత్సవం, కొరియాలోని Jeonjhu Soru అంతర్ జాతీయ ఉత్సవం, ఫ్రాన్స్, సెర్బియా, టర్కి, సింగపూరు, ఇండోనేషియా,జర్మని, దుబాయ్, అమెరికా దేశాలలోను కూడా ఎన్నో నాట్య ప్రదర్శనలు ఇచ్చి అందరి అభిమానం పొ౦దారు. పండిత్ బిర్జు మహారాజ్ రూపొందించిన “ఋతు సంహార” నృత్య నాటికలోని కూచిపూడి నృత్య భాగానికి దీపికా రెడ్డి నృత్య రూపకల్పన చేశారు. శ్రీమతి దీపిక దూరదర్శన్ A- టాప్ గ్రేడ్, ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందారు. రాష్ట్ర చలన చిత్ర సెన్సార్ బోర్డ్ సభ్యురాలిగా, నంది అవార్డు లకు కమీటీ సభ్యురాలిగా, అంతర్జాతీయ బాలల చలన చిత్ర ఉత్సవాల్లో సాంస్కృతిక కమిటీ అధ్యక్షురాలి గా, విశేష సేవలందించారు. కూచిపూడి నాట్యాన్ని భావి తరాలకు అందించాలనే సదాశయంతో దీపాంజలి నృత్య శిక్షణా సంస్థను హైదరాబాద్ లో స్థాపించి వందలాది మంది శిష్యులను తీర్చి దిద్దుతున్నారు. దీపిక తన అభినయ కౌశల్యం తో ద్రౌపది, మండొదరి, సావిత్రి, సీత, దాక్షాయణి, కైకేయి, రుద్రమ వంటి పౌరాణిక, చారిత్రక ప్రాధాన్యత గల స్త్రీ పాత్రలకు జీవం పోసి ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందారు. నిరంతర తపనతో, నిర్విరామంగా కూచిపూడి నాట్యానికి సేవ చేస్తున్న దీపికా రెడ్డి కి నృత్యం అంటే తాదాత్మ్యంతో కూడిన దైవారాధన. మాజీ మంత్రి నూకల రామచంద్రారెడ్డి మనవరాలు అయిన దీపికా రెడ్డి ఆ కుటుంబంలో గొప్ప కళాకారిణిగా స్వయం కృషితో రూపొందడం విశేషం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ