అహ్మదాబాద్ లో ప్లేన్ క్రాష్
విమానంలో ఉన్నవారంతా దుర్మరణం
అహ్మదాబాద్ విమానాశ్రయంలో టేక్ ఆఫ్ అయిన వెంటనే ఎయిర్ ఇండియా విమానం బిజె మెడికల్ కాలేజిపై కూలిపోయింది. ఈ ఘటనలో 242మంది మరణించినట్లు తెలుస్తోంది. విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు. వారిలో 165 మంది భారతీయులు. లండన్ కు మధ్యాహ్నం 1 38 గంటలకు బయలుదేరి 1 43 గంటలకు కూలిపోయింది. ప్రమాదానికి ముందు డి.జి.సి.ఏ.కు అత్యవసర సందేశం అందింది. వెంటనే సంప్రతించిన ఏ.టి.సి.కి ఎటువంటి సమాధానం లేదు. ఈ విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఉన్నారు.

నలభై మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ విమానం ఢిల్లీ నుంచి వచ్చింది.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే, హోమ్ మంత్రి అమిత్ షా అహ్మదాబాద్ బయలుదేరి వెళ్లారు. ప్రధాని మోడీ విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ విమానంలో 53 బ్రిటిషర్లు, ఏడుగురు పోర్చుగీసు, ఒకరు కెనడాకు చెందిన వారు. విమానం పైలట్ కు ఎనిమిది వేల గంటలు పైగా విమానాలను నడిపిన అనుభవం ఉంది. సుమిత్ సబర్ వాల్, క్లైవ్ కుందర్ విమానానికి పైలట్లుగా వ్యవహరించారు. ప్రమాద సమయంలో విమానం నిముషానికి 475 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
విమానం కూలిపోయే ముందు పైలట్ మే డే సందేశం వచ్చింది. ఇది అత్యవసర సమయంలో ఇచ్చే సందేశం. 825 అడుగుల ఎత్తు నుంచి విమానం కూలిపోయింది. ఇద్దరు పైలట్లతో సహా పన్నెండు మంది సిబ్బంది విమానంలో ఉన్నారు. ఈ విమానంలో మూడు వందలమంది వరకూ ప్రయాణించే అవకాశం ఉంది. ఈ ప్రమాదంలో 20 మంది వైద్య విద్యార్థులు కూడా మరణించారు. ఇద్దరు పైలట్లు అనుభవజ్ఞులై కావడంతో ప్రమాదం మిస్టరీ వీడితేనే గానీ కారణం తెలిసే అవకాశం లేదు.
క్రాష్ అయిన వెంటనే విమానంలో మంటలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో విజయ్ రూపాని తీవ్రంగా గాయపడ్డారని అంటున్నారు. ఇలాంటి ప్రమాదాలలో సాధారణంగా ఎవరు బతికి బట్టకట్టే అవకాశం ఉండదు. ఏ.ఐ.171 బోయింగ్ 787 డ్రీం లైనర్ ఢిల్లీ నుంచి వచ్చింది. ఈ విమానాన్ని కొనుగోలు చేసి పదేళ్లు కూడా కాలేదు. బ్లాక్ బాక్స్ దొరికితే తప్ప ప్రమాదానికి కారణం తెలిసే అవకాశం లేదు.
మరింత సమాచారం అందించడానికి 1800 5691 444 తో ప్రత్యేక ప్రయాణీకుల హాట్‌లైన్ నంబర్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు ఎయిరిండియా సంస్థ తెలిపింది.
బోయింగ్ 787 విమానం కూలిపోవడం ఇదే ప్రధమం.

