రామాయపట్నం పోర్టు పనుల ప్రారంభానికి సిద్ధం

Date:

20న ప్రారంభించనున్న సీఎం జ‌గ‌న్‌
అమరావతి, జూలై 19:
ఏపీలో మౌలిక సదుపాయాల రంగానికి కొత్త ఊపు రానుంది. ఇందుకు ఆలంబ‌న‌గా నిలిచే రామాయపట్నం పోర్టు పనులను ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బుధ‌వారం (ఈనెల 20న‌) ప్రారంభించ‌నున్నారు. ఈ ప‌నుల‌తో వెనకబడ్డ ప్రాంతంలో అభివృద్ధికి ఊతం ల‌భిస్తుంది. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం జాతీయరహదారికి కేవలం 4.5 కిలోమీటర్ల దూరంలో పోర్టు ఏర్పాటైంది. పోర్టు తొలిదశ పనులు 36 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణ‌యించుకున్నారు. రూ. 3736.14 కోట్లతో పోర్టు తొలిదశ పనులు చేప‌డ‌తారు. రాష్ట్ర ప్రభుత్వ సంçస్థ ఏపీ మారిటైం బోర్డు కింద ప్రాజెక్టును నిర్మించనున్నది. రామాయపట్నం పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌గా ప్రాజెక్టుకు పేరు పెట్టారు. తొలిదశలో మొత్తం నాలుగు బెర్తులను నిర్మిస్తారు. ఏడాదికి 25 మిలియన్‌ టన్నుల ఎగుమతులు అవుతాయి. కార్గో, బొగ్గు, కంటైనర్ల కోసం నాలుగు బెర్తులను నిర్మిస్తారు. రెండోదశలో 138.54 మిలియన్‌ టన్నులకు విస్త‌రిస్తారు. మొత్తం 15 బెర్తులను నిర్మిస్తారు. ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు సహా రాయలసీమలోని పలు జిల్లాలు, తెలంగాణలోని నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌ ప్రాంతాలకు సంబంధించి పారిశ్రామిక, వాణిజ, రవాణా సేవల్లో రామాయపట్నం పోర్టు కీలకం కానుంది.

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్,మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పలుప్రాంతాలకు వాణిజ్య, వ్యాపార, రవాణా సేవలు కూడా దీనివ‌ల్ల సుల‌భతరం కాగ‌ల‌వు. బొగ్గు, ఇనుప ఖనిజం, గ్రానైట్, ఆహార ధాన్యాలు, బియ్యం సహా ఇతర ధాన్యాలు, సిమెంటు, ఫెర్టిలైజర్స్, పొగాకు, మిర్చి, ఆక్వా ఉత్పత్తులు, కంటైనర్లు తదితర రవాణాలో పోర్టు కీలక పాత్ర పోషించ‌నుంది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యవసాయం, పరిశ్రమలు మరియు సేవారంగానికి పోర్టు ఊతం ఇస్తుంది. ఫుడ్‌ప్రాసింగ్, సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు, ఎలక్ట్రానిక్స్, విద్యుత్, టెక్స్‌టైల్, టూరిజం రంగాలకు పోర్టు ద్వారా మేలు చేకూరుతుంది. ఔషధాలు, రసాయనాలు, ప్లాస్టిక్, ఖనిజాలు, చేతి వృత్తులు, టెక్స్‌టైల్స్, లెదర్‌ తదితర ఎగుమతుల్లో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇదే పోర్టుతోపాటు మచిలీపట్నం, భావనపాడు పోర్టులను కూడా నిర్మించ‌నున్నారు. ప్రతి కోస్తా జిల్లాలకూ ఒక ఫిషింగ్‌ హార్బర్‌ ఉండేలా 9 హార్బర్లను ప్ర‌భుత్వం నిర్మిస్తోంది. మౌలిక సదుపాయాల కల్పనలో ఇది గొప్ప మార్పు. రూ.3500 కోట్లతో మొత్తంగా 9 షిఫింగ్‌ హార్బర్ల నిర్మిస్తారు. ఫేజ్‌–1లో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో తొలిదశలో ఫిషింగ్‌ హార్బర్ల నిర్మిస్తారు. రెండో దశ కింద బుడగట్ల పాలెం, పూడిమడక, బియ్యపు తిప్ప, వాడరేవు, కొత్తపట్నంల్లో షిఫింగ్‌ హార్బర్లను నిర్మిస్తారు. వీటిద్వారా 4.5 లక్షల టన్నుల అదనపు మత్స్య ఉత్పత్తలు సేకరణకు వీలు క‌లుగుతుంది. దీనివ‌ల్ల విస్తృతంగా ఉపాధి అవకాశాలు క‌లుగుతాయి. దాదాపు 85వేలమందికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉపాధి అవకాశాలు క‌లుగుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

US Elections vs Indian Polls

Plethora of similarities in campaigning style (Anita Saluja) As the US...

శిల్ప చేసిన భగీరథ విఫల యత్నం

త్వరలో సమస్య పరిష్కారానికి HMWSSB ఎం.డి. హామీ (కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)ఎవరికైనా వ్యక్తిగతంగా...

ఇండియన్ బ్రాండ్ అంబాసడర్ టాటా

ఉప్పు నుంచి ఉక్కు వరకూ…టీ నుంచి ట్రక్ వరకూఅప్రెంటిస్ నుంచి చైర్మన్...

Will China collapse after possible alliance of US with India?

An Analysis about Communist China’s 75th anniversary (Dr Pentapati Pullarao) On...