అబ్దుల్ కలామ్ – ఇళైయరాజా

0
161

(రోచిష్మాన్, 9444012279)

కులం, మతం రొచ్చు నుండి బయటకు వచ్చి చదువు, ప్రతిభ, ప్రజ్ఞ, పనితనం, పనిచెయ్యడం, విజయం వీటితో విజేతలు అయ్యారు అబ్దుల్ కలామ్, ఇళైయరాజా (ఇళయరాజా కాదు).

మారుమూల ప్రాంతాల్లో కడు బీదరికంలో పుట్టి, స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతితో అత్యంత విజయవంతమయ్యారు అబ్దుల్ కలామ్, ఇళైయరాజా.

కులాతీత, మతాతీత వ్యక్తులై విశ్వవిఖ్యాతమయ్యారు అబ్దుల్ కలామ్, ఇళైయారాజా.

‘రిజర్వేషన్ బతుకు కాదు మనిషికి గొప్ప బతుకు కావాలి’. రిజర్వేషన్లకు అతీతంగా అత్యంత గొప్పగా బతికారు అబ్దుల్ కలామ్, ఇళైయరాజా.

మతం బతుకు, కులం బతుకు వెరసి ‘మలం బతుకు’ కాదు మనిషి విలువైన బతుకు, ఫలవంతమైన బతుకు బతకాలి. అందుకు అబ్దుల్ కలామ్, ఇళైయరాజా నిలువెత్తు ఆదర్శాలు.

ఏ కులోన్మాదీ, ఏ మతోన్మాదీ మనదేశంలో అబ్దుల్ కలామ్, ఇళైయరాజా స్థాయికి ఎదగలేదు; విజేత అవలేదు.

కులం, మతం అంటూ ఆగం చేసే ఏ వ్యక్తైనా,
ఏ రిజర్వేషన్ వ్యక్తైనా మనదేశంలో అబ్దుల్ కలామ్ వంటి, ఇళైయరాజా వంటి విజేత అయ్యాడా? ఏ వ్యక్తైనా కులంతో, మతంతో, రిజర్వేషన్ తో మనదేశంలో అబ్దుల్ కలామ్ లాగా, ఇళైయారాజా లాగా విజయవంతమయ్యాడా? మతోన్మాదివల్లా, కులోన్మాదివల్లా, రిజర్వేషన్ వ్యక్తివల్లా మనదేశానికి జరిగిన మేలు ఏదైనా ఉందా? ఏ మాత్రమైనా ఉందా?

మనదేశానికి అతి హానికరంగా పరిణమిస్తున్న కులోన్మాదులు, విదేశీ మతోన్మాదులు మామూలు మనుషులై అబ్దుల్ కలామ్, ఇళైయరాజా స్థాయి వ్యక్తులై దేశానికి, సమాజానికి మేలు చెయ్యాలి; కనీసం హాని చెయ్యకుండా ఐనా ఉండాలి.


(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here