ఇస్తాంబుల్, మే 19: ప్రపంచ బాక్సింగ్‌లో భారత్‌కు ఐదో స్వర్ణ పతకం లభించింది. తెలంగాణ రాష్ట్రం నిజమాబాద్‌కు చెందిన యువతి ప్రపంచ బాక్సింగ్‌లో చరిత్ర సృష్టించింది. విజేతగా నిలిచి, భారతావనికే గర్వకారణంగా నిలిచింది. 52 కేజీల మహిళా విభాగంలో ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ విజేతగా నిలిచింది. మేరీ కోమ్ సరసన నిలిచింది. టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ చరిత్రకు వేదికైంది. నిఖత్ విజయంతో ప్రపంచ బాక్సింగ్‌లో ఐదు గోల్డ్ మెడల్స్ వచ్చినట్లయ్యింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ బంగారు పతకం సాధించడానికి 12 ఏళ్ళు వేచి ఉండాల్సి వచ్చింది. ఇంతకుముందు మేరీకోమ్, సరితాదేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖ కె.సి. బంగారు పతకాలను సాధించారు.
సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
ప్రతిష్టాత్మక ‘ ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్’ పోటీల్లో నిజామాబాద్ కు చెందిన నిఖత్ జరీన్ విశ్వ విజేతగా నిలవడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. బంగారు పతకాన్ని సాధించిన జరీన్ కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. భారత కీర్తి పతాకాన్ని విశ్వ క్రీడావేదిక మీద ఎగరేసిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ ను సీఎం కేసిఆర్ మనస్ఫూర్తిగా అభినందించారు. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని నిఖత్ జరీన్ బాక్సింగ్ క్రీడలో విశ్వ విజేతగా నిలవడం గర్వించదగిన విషయమని సీఎం అన్నారు.
క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నదని,. తెలంగాణలోని ప్రతీ గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటుచేసి, యువ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని సీఎం కేసిఆర్ ఈ సందర్భంగా తెలిపారు.