Tuesday, March 21, 2023
HomeAP Newsపీపుల్‌…ప్రోగ్రెస్‌…పాజిబిలిటీస్‌

పీపుల్‌…ప్రోగ్రెస్‌…పాజిబిలిటీస్‌

దావోస్‌లో ఏపీ పెవిలియ‌న్‌
ఇండస్ట్రియలైజేషన్‌ 4.0పై దృష్టి
కర్బన ఉద్గారాలు లేని ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు
భవిష్యత్‌ సవాళ్ల పరిష్కారంలో భాగస్వామి కానున్న రాష్ట్రం
కీలక రంగాల్లో ప్రగతిని ప్రపంచానికి వినిపించనున్న ఏపీ ప్రభుత్వం
సదస్సుకు అధికారయంత్రాంగం సమాయత్తం
రేపు రాత్రికి దావోస్‌ చేరుకోనున్న సీఎం
దావోస్‌, మే 19:
రెండేళ్ల కోవిడ్‌ విపత్తు తర్వాత వరల్డ్‌ఎకనామిక్‌ ఫోరం సదస్సు ప్రత్యక్షంగా సమావేశం కానుంది. మే 22 –26వరకూ జరగనున్న ఈ సదస్సులో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌తోపాటు, మంత్రులు, అధికారుల బృందం పాల్గోనున్నారు. కోవిడ్‌ లాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని దావోస్‌ వేదికగా వినిపించనుంది. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లకు పరిష్కారంకోసం ఈవేదికద్వారా ఏపీ భాగస్వామ్యం కానుంది. నాలుగో పారిశ్రామిక విప్లవం ( ఇండస్ట్రియలైజేషన్‌ 4.0) దిశగా వేయాల్సిన అడుగులపై దావోస్‌ వేదికగా సీఎం కీలక చర్చలు కూడా జరపనున్నారు. ఇందులో భాగంగా పెట్టుబడులకు ఉన్న అవకాశాలనుకూడా ఈ సదస్సులో ప్రధానంగా ప్రస్తావించనుంది.


కొవిడ్ నియంత్ర‌ణ‌లో వ్యూహంపై వివ‌ర‌ణ‌
కోవిడ్‌ నియంత్రణలో రాష్ట్రం అనుసరించిన వ్యూహాన్ని దావోస్‌ వేదికపై రాష్ట్రం వినిపించనుంది. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌ మెంట్‌ ద్వారా కోవిడ్‌ కట్టడికి చేసిన విశేష ప్రయత్నాలను వివరించనుంది. ప్రభుత్వ పాలనలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను, çసమగ్ర సాజికాభివృద్ధిలో భాగంగా నవరత్నాల అమలు, అధికార వికేంద్రీకరణ– సుపరిపాలన, ఉత్తమ భవిష్యత్త్‌ తరాల నిర్మాణంకోసం విద్య, వైద్యం, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను ఏపీ వివరించనుంది. వీటితోపాటు సంప్రదాయ ఇంధన వనరుల రంగం, పారిశ్రామిక వ్యర్థాల శుద్ధి తదితర అంశాలపైనా ఈ సదస్సులో ఏపీ దృష్టిసారించనుంది.
కర్బన ఉద్గారాలు లేని ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు
అన్నిటికంటే ముఖ్యంగా కాలుష్యంలేని పారిశ్రామిక, ఆర్థిక ప్రగతి దిశగా అడుగులు వేయడంపై ముఖ్యమంత్రి వైయస్‌. జగన్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. పారిశ్రామికీకరణలో నాలుగో విప్లవం దిశగా (ఇండస్ట్రియలైజేషన్‌ 4.0)
ప్రపంచం కదులుతున్న నేపథ్యంలో దీనిపై ఏపీకూడా దృష్టిపెట్టింది. ఎలాంటి కాలుష్యంలేని విధానాలతో ఉత్పత్తులు సాధించడం, అందుకు తగిన విధంగా వ్యవస్థలను రూపొదించుకోవడం దీంట్లో ప్రధాన ఉద్దేశం. సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యంలో భాగంగా ఇంటర్‌ కనెక్టివిటీ, రియల్‌టైం డేటా, యాంత్రీకరణ, ఆటోమేషన్‌ల పారిశ్రామికీకరణలో చోటు కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. దీనిపై దావోస్‌లో విస్తృతంగా జరిగేచర్చల్లో ముఖ్యమంత్రి, రాష్ట్ర బృందం పాల్గోనున్నారు.
ఇండస్ట్రియలైజేషన్‌ 4.0కు సరైన వేదికగా నిలిచేందుకు రాష్ట్రానికి ఉన్న వనరులు, అవకాశాలను కూడా ఈదస్సులో వివరించనున్నారు. ఈదిశగా కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను కూడా దావోస్‌ చర్చల్లో వివరించనున్నారు. విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు అదనంగా మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు, కాకినాడ ఎస్‌ఈజెడ్‌ పోర్టులు నిర్మాణం, కొత్తగా మూడు ఎయిర్‌పోర్టుల అభివృద్ధి, నిర్మాణం తదితర వాటి ద్వారా ఇండస్ట్రియలైజేషన్‌ 4.0కు ఏ రకంగా దోహదపడుతోందో వివరించనున్నారు. బెంగళూరు – హైదరాబాద్, చెన్నై – బెంగుళూరు, విశాఖపట్నం – చెన్నై కారిడార్లలో ఉన్న అవకాశాలను కూడా ఈ సదస్సు ద్వారా వివిధ పారిశ్రామిక సంస్థలు, వ్యాపారవేత్తలముందు ఉంచుతారు. సుశిక్షితులైన మానవవనరుల నైపుణ్యాలను అభివృద్ధిచేస్తున్న తీరునుకూడా వివరిస్తారు.


పారిశ్రామిక వ్యూహాల్లో మార్పులు
పారిశ్రామిక వ్యూహాల్లో తీసుకురావాల్సిన మార్పులపైనా కూడా దావోస్‌వేదికగా ఏపీ దృష్టిసారించనుంది. నేరుగా ఇంటి గుమ్మవద్దకే ఉత్పత్తులు చేరవేసే విధానాన్ని మరింత బలోపేతంచేయడం, దీన్ని డిటిటలైజేషన్‌తో అనుసంధానం చేయడం, రాష్ట్రంలో ఉత్పత్తి రంగాన్ని మరింత వృద్ధిచేయడం, ఎగుమతులకు అవసరమైన నాణ్యతతో వస్తు ఉత్పత్తులు తయారుచేయడానికి తగిన నైపుణ్యాలను అభివృద్ధిచేయడం లాంటి అంశాలపై అత్యుత్తమ సంస్థల భాగస్వామ్యంపై కూడా దావోస్‌ సదస్సులో ఏపీ దృష్టిపెట్టనుంది.
ఈ అంశాలను వివరిస్తూ దావోస్‌లో ఏపీ పెవిలియన్‌ ఏర్పాటు చేసింది. పీపుల్‌ –ప్రోగ్రెస్‌ – పాజిబిలిటీస్‌ నినాదంతో ఈ పెవిలియన్‌ నిర్వహిస్తోంది.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా హాజరయ్యే ప్రతినిధులతో కూడిన దావోస్‌ కాంగ్రెస్‌ పలు కీలక అంశాలపై దృష్టిపెట్టనుంది. ఆహారం – వాతావరణ మార్పులు, సాంకేతిక రంగంలో వినూత్న ఆవిష్కరణలు, సుపరిపాలన, సైబర్‌ సెక్యూరిటీ, అంతర్జాతీయ సహకారం – పునర్‌ నిర్మాణం, ఆర్థిక వ్యవస్థలో సమతుల్యత, అందరికీ ఆరోగ్యంపై జరిగే చర్చల్లో ఏపీ భాగస్వామ్యం కానుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ