వెయ్యి రోజుల రేవంత్ ప్రజాపాలన..
ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ 1వ తేదీ నాటికి విజయవంతంగా 1000 రోజుల మైలురాయిని చేరుకుంది.
ప్రజల ఆకాంక్షలను పాలనకు కేంద్రబిందువుగా చేసుకుని, సంక్షేమం–అభివృద్ధి–సామాజిక న్యాయాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లిన వెయ్యి రోజుల ప్రజాపాలన తెలంగాణ ప్రగతిలో కొత్త అధ్యాయాన్ని నమోదు చేసింది. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, కార్మికులు, పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ప్రత్యక్ష లబ్ధి చేకూర్చే పథకాల అమలుతో పాటు కొత్త చట్టాలు, కొత్త విధానాలు, కొత్త సంస్థలు, కీలక పరిపాలనా సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
వ్యవసాయం నుంచి పరిశ్రమల వరకు, విద్య నుంచి వైద్యం వరకు, మహిళా సాధికారత నుంచి యువత ఉపాధి వరకు, సామాజిక న్యాయం నుంచి డిజిటల్ పాలన వరకు ప్రతి రంగంలో కొత్త నిర్ణయాలు తీసుకుంది. భారీ పెట్టుబడులను ఆకర్షించడం, ఉద్యోగ అవకాశాలను విస్తరించడం, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలకు బాటలు వేయడం, భవిష్యత్తు తెలంగాణకు దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశను నిర్దేశించింది.
వెయ్యి రోజుల ప్రజాపాలనలో అమలు చేసిన ప్రధాన పథకాలు, తీసుకున్న కీలక నిర్ణయాలు, చేసిన కొత్త చట్టాలు, సాధించిన విజయాలు
- 2025-26లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరిక; దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే దాదాపు 91 శాతం అధికం.
- రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ; 25 లక్షలకుపైగా రైతు కుటుంబాలకు రుణభారం నుంచి విముక్తి.
- రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లకుపైగా పెట్టుబడి సాయం; ఒకే విడతలో 9 రోజుల్లో దాదాపు రూ.9 వేల కోట్ల జమ.
- సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ అమలు.
- వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, రైతు బీమా, పంట నష్టపరిహారంతో రైతులకు భరోసా.
- 32 నెలల లెక్కల ప్రకారం వ్యవసాయం, రైతు సంక్షేమానికి దాదాపు రూ.1.68 లక్షల కోట్ల వ్యయం.
- వరి సాగు, ఉత్పత్తిలో పంజాబ్‌ను అధిగమించి దేశంలో నంబర్–1గా తెలంగాణ.
- గత యాసంగిలో 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా 81.12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు; 13.37 లక్షల రైతులకు రూ.18,929 కోట్ల చెల్లింపు.
- రెండు సీజన్లలో 1.47 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు; రైతులకు రూ.35,077 కోట్ల చెల్లింపు.
- తెలంగాణ బియ్యానికి అంతర్జాతీయ మార్కెట్ విస్తరణ; ఫిలిప్పీన్స్‌కు 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతికి ఒప్పందం.
- ఇందిరా సౌర గిరిజల వికాసం కింద 2.10 లక్షల గిరిజన రైతులకు ప్రయోజనం కల్పిస్తూ 6 లక్షల ఎకరాల పోడు భూములకు సాగునీటి లక్ష్యంతో రూ.12,600 కోట్ల కార్యక్రమం.
- కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ న్యాయమైన వాటాల సాధనకు ప్రత్యేక కార్యాచరణ; తుమ్మడిహెట్టి నుంచి పాలమూరు వరకు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం.
- మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం; 335 కోట్లకుపైగా ఉచిత ప్రయాణాలు, దాదాపు రూ.11 వేల కోట్ల ప్రయాణ వ్యయం ఆదా.
- గృహజ్యోతి కింద 53 లక్షలకుపైగా కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు; 10 కోట్లకుపైగా జీరో బిల్లులు.
- దాదాపు 43 లక్షల కుటుంబాలకు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్.
- కల్యాణలక్ష్మి ద్వారా 1.68 లక్షల మంది ఆడబిడ్డలకు రూ.4,709 కోట్ల సహాయం.
- 4.54 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.60,487 కోట్ల బ్యాంకు లింకేజీ; రూ.1,900 కోట్ల వడ్డీ రాయితీ.
- మహిళా సంఘాలకు పాఠశాల యూనిఫాంలు, చీరల తయారీ, పెట్రోలు బంకుల నిర్వహణ, ఆర్టీసీ బస్సుల యాజమాన్యం వంటి ఆదాయ వనరుల కల్పన.
- 15 లక్షలకుపైగా కొత్త రేషన్ కార్డుల జారీ.
- కొత్త రేషన్ కార్డులు, సభ్యుల చేరికల ద్వారా లక్షలాది మందిని అదనంగా ఆహార భద్రత పరిధిలోకి తీసుకురావడం.
- రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం.
- దాదాపు 3.38 కోట్ల మందికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార భద్రత.
- రేషన్ కార్డుదారులకు నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ; ప్రజా పంపిణీ వ్యవస్థలో కొత్త విధానానికి శ్రీకారం.
- తొలి దశలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం; ఒక్కో అర్హ కుటుంబానికి రూ.5 లక్షల సహాయం.
- హైదరాబాద్ క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇండ్ల టవర్ల నిర్మాణానికి నిర్ణయం.
- 43.01 లక్షల మందికి సామాజిక భద్రతా పింఛన్లు; డిసెంబర్ 2023 నుంచి జూలై 2026 వరకు రూ.30,089 కోట్ల వ్యయం.
- సామాజిక భద్రతను మరింత విస్తరిస్తూ కొత్తగా 2.25 లక్షల మందికి పింఛన్లు.
- రాష్ట్రవ్యాప్తంగా 1.12 కోట్లకుపైగా కుటుంబాలను కవర్ చేస్తూ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే పూర్తి.
- సర్వే ఆధారంగా కులాల వారీ సామాజిక, ఆర్థిక స్థితిగతుల వెల్లడి.
- సుప్రీంకోర్టు తీర్పు అనంతరం 59 ఎస్సీ ఉపకులాలను మూడు గ్రూపులుగా వర్గీకరణ.
- ఎస్సీ ఉపకులాల వర్గీకరణను అమలు చేసిన దేశంలోని తొలి రాష్ట్రంగా తెలంగాణ.
- బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు శాసనసభ ఆమోదం; కేంద్రానికి పంపింపు.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమానికి రాష్ట్ర మొత్తం వ్యయంలో 12.4 శాతం కేటాయింపు.
- 12 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కనీస వేతనాల సవరణ; దాదాపు కోటి 11 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం.
- నైపుణ్యం లేని కార్మికులకు రూ.16 వేలు, సెమీ స్కిల్డ్‌కు రూ.17 వేలు, స్కిల్డ్‌కు రూ.18,500, హైలీ స్కిల్డ్‌కు రూ.20 వేల కనీస నెలవారీ వేతనం.
- గిగ్ కార్మికులకు చట్టబద్ధ గుర్తింపు, సంక్షేమ బోర్డు, సంక్షేమ నిధి, సామాజిక భద్రత కల్పించే ప్రత్యేక చట్టం.
- వృద్ధ తల్లిదండ్రులు నిరాదరణకు గురికాకుండా కుటుంబ బాధ్యతను బలోపేతం చేసే ప్రత్యేక చట్టం.
- ఉన్నత విద్యాసంస్థల్లో వివక్షను అరికట్టేందుకు రోహిత్ వేముల తెలంగాణ బిల్లుకు రూపకల్పన.
- పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్‌లో తెలంగాణ 28వ స్థానం నుంచి 18వ స్థానానికి పురోగతి.
- ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ లక్ష్యంతో 105 స్కూళ్ల మంజూరు.
- యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 84కు అనుమతులు ఇచ్చి నిర్మాణ ప్రక్రియ వేగవంతం.
- ప్రభుత్వ పాఠశాలల్లో తొలిసారిగా ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభం.
- తెలంగాణ పబ్లిక్ స్కూళ్లతో ప్రభుత్వ విద్యకు కొత్త నమూనా.
- ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు 22 లక్షలకుపైగా విద్యార్థులకు అల్పాహారం, పాలు, పోషకాహారం; రూ.720 కోట్ల కేటాయింపు.
- ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం.
- సంక్షేమ హాస్టళ్లలో డైట్ ఛార్జీలు 40 శాతం, కాస్మొటిక్ ఛార్జీలు 212 శాతం పెంపు.
- మెగా డీఎస్సీ ద్వారా 10,006 మంది ఉపాధ్యాయుల నియామకం.
- దాదాపు 11 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్.
- ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను యాజమాన్యాల ప్రమేయం లేకుండా నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానం.
- ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ.1,000 కోట్ల కేటాయింపు.
- ప్రజా ప్రభుత్వ హయాంలో 72 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు.
- గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4, డీఎస్సీ సహా కీలక నియామక ప్రక్రియల పూర్తి.
- టీజీపీఎస్సీ ద్వారా మరో 456 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.
- పోలీసు నియామక బోర్డు ద్వారా 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.
- యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు.
- యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో 1,190 మంది అధునాతన నైపుణ్య శిక్షణ పూర్తి; 838 మందికి ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు.
- 65 ప్రభుత్వ ఐటీఐలు, 57 పాలిటెక్నిక్ కాలేజీలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దడం.
- టీ-హబ్, టీ-వర్క్స్, టాస్క్, వీ-హబ్ ద్వారా 90 వేలకుపైగా యువతకు నైపుణ్య శిక్షణ.
- డీట్ జాబ్స్ ప్లాట్‌ఫాంలో 1.43 లక్షల మంది ఉద్యోగార్థుల నమోదు.
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో జాబ్‌మేళాల ద్వారా 40 వేల మంది యువత నమోదు; 5,700 నియామక పత్రాలు.
- యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు.
- గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్‌తో క్రీడా మౌలిక సదుపాయాల విస్తరణ.
- రాజీవ్ ఆరోగ్యశ్రీ చికిత్స పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు.
- గోషామహల్‌లో రూ.2,700 కోట్లతో 2,000 పడకల నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం.
- సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభం. అల్వాల్, ఎల్బీనగర్‌లో టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటు.
- తొమ్మిది కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రారంభం; మరో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం.
- నిమ్స్‌లో 2,000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల మైలురాయి; దాదాపు 1,900 మందికి ఉచిత చికిత్స.
- ప్రభుత్వ వైద్యరంగంలో దక్షిణ భారత తొలి రోబోటిక్ రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ నిమ్స్‌లో నిర్వహణ.
- ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 5,18,186 మందికి రూ.2,526.12 కోట్ల సహాయం.
- సీఎంఆర్‌ఎఫ్ వైద్య రీయింబర్స్‌మెంట్ ద్వారా 4,78,789 మంది పేద రోగులకు రూ.1,635.34 కోట్ల సహాయం; 39,712 మందికి రూ.798.41 కోట్ల ఎల్‌ఓసీలు.
- వివిధ విపత్తులు, ఆపద పరిస్థితుల్లో చిక్కుకున్న 225 మందికి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.92.37 కోట్ల ప్రత్యేక సాయం.
- ఆహార కల్తీ, డ్రగ్స్ ముప్పును సమగ్రంగా ఎదుర్కొనేందుకు కొత్తగా టీ సేఫ్ ఏర్పాటు.
- ఆహార కల్తీ నియంత్రణ, డ్రగ్స్ నియంత్రణను ఒకే వ్యవస్థ కిందకు తీసుకొచ్చి విస్తృత తనిఖీలు, దాడులు నిర్వహించేలా టీ సేఫ్‌కు ప్రత్యేక అధికారాలు.
- టీ సేఫ్‌కు ప్రత్యేక లీగల్, ల్యాబొరేటరీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాల ఏర్పాటు; కల్తీదారులు, డ్రగ్స్ నేరస్థులపై కఠిన చర్యలకు సమగ్ర వ్యవస్థ.
- మాదకద్రవ్యాలపై ప్రత్యేకంగా ఈగల్ వ్యవస్థ ఏర్పాటు చేసి డ్రగ్ నెట్‌వర్క్‌లపై కఠిన చర్యలు.
- పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో యాంటీ డ్రగ్ అండ్ సేఫ్టీ కమిటీలను తప్పనిసరి చేసే నిర్ణయం.
- విద్యాసంస్థల్లో క్యాంపస్ కోఆర్డినేటర్లు, స్పాటర్లను నియమించి విద్యార్థుల్లో ప్రవర్తనా మార్పులను ముందుగానే గుర్తించే వ్యవస్థ.
- డ్రగ్స్ నియంత్రణలో బాధ్యత వహించని విద్యాసంస్థల గుర్తింపుపై చర్యలు తీసుకునే విధానం.
- సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక పోలీసింగ్, 1930 స్పందన వ్యవస్థ బలోపేతం.
- షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లతో మహిళలు, పిల్లల భద్రతకు ప్రత్యేక చర్యలు.
- భరోసా ప్రాజెక్టు ద్వారా బాలల అనుకూల న్యాయస్థానాల ఏర్పాటులో తెలంగాణ ముందడుగు.
- పట్టణ ట్రాఫిక్ రద్దీ, రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కొత్తగా టీజీ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు.
- హైవేలు, ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రత్యేక పెట్రోలింగ్, ప్రమాదాల నివారణకు కొత్త వ్యవస్థ.
- భూ భారతి చట్టంతో భూ పరిపాలనలో సమగ్ర సంస్కరణలు.
- భూధార్ ద్వారా భూములకు ప్రత్యేక గుర్తింపు, ఏఐ ఆధారిత భూమిత్ర సేవల ప్రారంభం.
- 3.76 లక్షల కొత్త పట్టాదార్ పాస్‌బుక్స్ జారీ.
- ప్రజాపాలన–అభయహస్తం ద్వారా గ్రామాలు, వార్డుల్లోనే ఆరు గ్యారంటీలు, సంక్షేమ పథకాలకు దరఖాస్తుల స్వీకరణ.
- 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో 12,758 గ్రామసభలు, 3,175 వార్డుసభల నిర్వహణ.
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో 1,06,598 పెండింగ్ ప్రభుత్వ ఫైళ్ల పరిష్కారం.
- అదే కార్యక్రమంలో 76 వేలకుపైగా రైతులను సూక్ష్మ సాగునీటి పరిధిలోకి తీసుకురావడం.
- 8 వేల ఇంటిగ్రేటెడ్ మహిళా శక్తి భవనాలకు శ్రీకారం.
- రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయి ప్రజావాణి తర్వాత అన్ని ఎంపీడీవో కార్యాలయాలకు మండల ప్రజావాణి విస్తరణ.
- ప్రతి సోమవారం మండల స్థాయి అధికారులందరినీ ఒకేచోట ప్రజలకు అందుబాటులో ఉంచే మండల ప్రజావాణి వ్యవస్థ.
- రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా అర్జీలు నమోదు చేసుకునేందుకు ఆన్‌లైన్ ప్రజావాణి పోర్టల్ ఏర్పాటు నిర్ణయం.
- ప్రజావాణి అర్జీల పరిష్కార పురోగతిని ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షించేందుకు ప్రత్యేక డాష్‌బోర్డు ఏర్పాటు నిర్ణయం.
- ప్రభుత్వ, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించేలా ఆర్థిక క్రమశిక్షణ.
- కొన్నేళ్లుగా పేరుకుపోయిన రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల్లో వంద రోజుల్లో రూ.6,000 కోట్ల చెల్లింపు.
- ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ద్వారా క్యాష్‌లెస్ వైద్య సేవలు.
- 36 సచివాలయ శాఖల్లో 100 శాతం ఈ-ఆఫీస్ అమలు.
- దేశంలో తొలి పూర్తిస్థాయి డిజిటల్ కేబినెట్ నిర్వహణ.
- వాట్సాప్ ద్వారా 581కిపైగా ప్రభుత్వ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం.
- దేశంలో తొలి స్టేట్ ఏఐ డేటా ఎక్స్చేంజ్–టీజీడెక్స్ ఏర్పాటు; 21 రంగాల్లో 52 ఏఐ ప్రాజెక్టులకు మద్దతు.
- టీ-ఫైబర్ ద్వారా భారత్‌నెట్ రెండో దశలో 8,895 గ్రామ పంచాయతీలకు డిజిటల్ కనెక్టివిటీ.
- ప్రభుత్వ ఆదాయ లీకేజీలను అరికట్టేందుకు విజిలెన్స్, పౌరసరఫరాల శాఖల్లో ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాల ఏర్పాటు.
- పౌరసరఫరాలు, మైన్స్ అండ్ మినరల్స్, జీఎస్టీ తదితర రంగాల్లో ఆదాయ నష్టాలు, ఎగవేతలపై ప్రత్యేక నిఘా.
- హైదరాబాద్ చుట్టూ దాదాపు 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు.
- రాష్ట్రవ్యాప్తంగా 6,092 కిలోమీటర్ల హ్యామ్ రోడ్ల అభివృద్ధి.
- హైదరాబాద్ మెట్రో రెండో దశలో ఏడు కారిడార్లతో 122.9 కిలోమీటర్ల విస్తరణ ప్రణాళిక.
- హైదరాబాద్ చుట్టూ రేడియల్ రోడ్ల విస్తరణ.
- మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణ.
- ఆదిలాబాద్‌లో జాయింట్ యూజ్ ఎయిర్‌ఫీల్డ్ అభివృద్ధి.
- హైడ్రా ద్వారా చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ; 1,045 ఎకరాల భూముల స్వాధీనం, దాదాపు రూ.60 వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ.
- బతుకమ్మకుంట, నల్లచెరువు సహా పలు చెరువుల పునరుద్ధరణ.
- మూసీ పునరుజ్జీవనానికి 55 కిలోమీటర్ల సమగ్ర అభివృద్ధి ప్రణాళిక.
- మూసీ పరిధిలో 39 కొత్త ఎస్టీపీల నిర్మాణం.
- గోదావరి నుంచి 2.5 టీఎంసీల స్వచ్ఛమైన నీటిని మూసీకి తరలించే ప్రణాళిక.
- హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ–2025 ద్వారా పాత పారిశ్రామిక ప్రాంతాల పునర్వ్యవస్థీకరణ.
- బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్–2024లో కీలక విభాగాల్లో తెలంగాణ టాప్ అచీవర్.
- టీజీ-ఐపాస్ ద్వారా 26,608 యూనిట్లకు రూ.1.29 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదాలు.
- టీజీఐఐసీ భూముల్లో రూ.92,281 కోట్ల పెట్టుబడులు; 78 వేలకుపైగా ఉద్యోగ అవకాశాలకు మార్గం.
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025లో 100 అవగాహన ఒప్పందాల ద్వారా రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు.
- హైదరాబాద్‌లో సాఫ్రాన్–సీఎఫ్‌ఎం విమాన ఇంజిన్ నిర్వహణ, మరమ్మతు కేంద్రానికి మార్గం.
- నెక్స్ట్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ–2026-30; రూ.73,360 కోట్ల పెట్టుబడులు, 3.5 లక్షల ఉద్యోగ అవకాశాల లక్ష్యం.
- ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి కొత్త విధానం.
- రూ.2,060 కోట్ల యూనిటీ మాల్ నిర్మాణ ప్రణాళిక.
- రూ.2,049 కోట్ల మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ అభివృద్ధి.
- 2026-27లో ఇప్పటివరకు రూ.12,350 కోట్ల ఎలక్ట్రానిక్స్ పెట్టుబడులు.
- సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్, అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్‌కు ప్రత్యేక ప్రోత్సాహం.
- ఫోటానిక్స్ వ్యాలీలో రూ.5,500 కోట్ల పెట్టుబడి పైప్‌లైన్.
- 2025-26లో తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.3.97 లక్షల కోట్లకు చేరిక; ప్రత్యక్ష ఐటీ ఉద్యోగాలు 12.14 లక్షలు.
- హైదరాబాద్‌లో 355కిపైగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు; 2026లోనే మరో 40 కొత్త కేంద్రాలు హైదరాబాద్‌ను ఎంచుకోవడం.
- డేటా సెంటర్లు, క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో దేశంలో వేగంగా ఎదుగుతున్న ప్రధాన కేంద్రంగా తెలంగాణ.
- అమెజాన్ నుంచి తెలంగాణకు అదనంగా 7 బిలియన్ డాలర్ల పెట్టుబడి.
- భారత్ ఫ్యూచర్ సిటీ, చందన్‌వెల్లి ప్రాంతాల్లో భారీ హైపర్‌స్కేల్, ఏఐ-రెడీ క్లౌడ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి.
- రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి సమగ్ర టూరిజం పాలసీ–2025 అమలు.
- ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యానికి మించి తొలి ఏడాదిలోనే రూ.23,174 కోట్ల పెట్టుబడి పైప్‌లైన్; 42 అవగాహన ఒప్పందాలు.
- యువ టూరిజం క్లబ్‌ల ఏర్పాటులో దేశంలో నంబర్–1గా తెలంగాణ.
- తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ 2025-26లో రూ.101.93 కోట్ల ఆదాయం, రూ.13.35 కోట్ల నికర లాభం.
- రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామపంచాయతీ ఆత్మనిర్భర్ పంచాయతీ స్పెషల్ అవార్డులో దేశంలో మొదటి స్థానం; రూ.1 కోటి పురస్కారం.
- ‘జయ జయహే తెలంగాణ’ గీతానికి అధికారిక గౌరవం.
- తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ.
- తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి, వారి కుటుంబాలకు సముచిత గౌరవం కల్పించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు.
- తెలంగాణ రైజింగ్–2047 కింద 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యం.
- దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచే దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యం.
- క్యూర్–కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, ప్యూర్–పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ, రేర్–రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ అనే మూడు అభివృద్ధి వలయాలతో రాష్ట్ర సమగ్ర ప్రణాళిక.
- భారత్ ఫ్యూచర్ సిటీని దేశంలో తొలి నెట్-జీరో స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసే నిర్ణయం.
- భారత్ ఫ్యూచర్ సిటీలో ఏఐ సిటీ, డేటా సెంటర్లు, అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్, పరిశోధన, ఆవిష్కరణలకు ప్రపంచస్థాయి కేంద్రం ఏర్పాటు.

