(Sridhar vadavalli)
నమస్తే జీ7 శిఖరాగ్ర సమావేశానికి ఆతిధ్యం వహిస్తున్న జార్జియా మెలోని, ఇటలీ ప్రధాన మంత్రి ప్రముఖులను శిఖరాగ్ర సమావేశానికి స్వాగతిస్తున్నప్పుడు నమస్తే సంజ్ఞతో పలకరించడం కనిపించింది.
2024 జీ7 సమావేశాలకు ఇటలీ అధ్యక్షత వహిస్తోంది. అపులియా ప్రాంతంలోని బోర్గో ఎగ్నాజియా అనే రిసార్ట్‌లో జూన్ 13 నుంచి 15వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్, జపాన్ ప్రధాని ఫుమ్లో కిషిడా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలానీ తదితర అగ్రనేతలు హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే జీ 7 సదస్సును ఉద్దేశించి పోప్ ఫ్రాన్సిస్ ప్రసంగించనున్నారు. జీ 7 సదస్సులో మాట్లాడే మొదటి కాథలిక్ చర్చి అధిపతిగా పోప్ ఫ్రాన్సిస్ నిలుస్తున్నారు. సదస్సులో ఉక్రెయిన్ యుద్ధం, గాజా సంఘర్షణపై ప్రధానంగా చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సైతం ఓ సెషన్‌కు హాజరై తమ దేశంపై రష్యా దాడి గురించిన చర్చలో పాల్గొనే అవకాశం ఉంది. జీ-7 సదస్సులో ప్రధాని మోడీ పాల్గొనడం జీ-20 ఫలితాలను అనుసరించేందుకు ఉపకరిస్తుంది.

జీ7 అంటే ఏంటి?
జీ7 అనేది ప్రపంచంలోని అత్యంత ధనిక, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలున్న దేశాల కూటమి. ఈ దేశాలు ప్రపంచ వాణిజ్యం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ఆధిపత్యం ప్రదర్శిస్తాయి. జీ7 బృందంలో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యునైటెడ్ స్టేట్స్ సభ్య దేశాలు.1988లో రష్యా ఈ బృందంలో చేరడంతో జీ8గా మారింది. 2014లో క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకోవడంతో ఈ బృందం నుంచి రష్యాను తొలగించారు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో రెండో అత్యధిక జనాభా గల దేశమైనప్పటికీ చైనా ఎప్పుడూ ఈ బృందంలో సభ్యదేశంగా లేదు. జీ7 బృందంలోని దేశాలతో పోల్చినప్పుడు చైనా తలసరి ఆదాయం చాలా తక్కువ. కాబట్టి చైనాను అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా పరిగణించడంలేదు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలతో కూడిన జీ20 గ్రూపులో రష్యా, చైనాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈయూ, జీ7లో సభ్యదేశం కాదు. వార్షిక సమావేశానికి హాజరవుతుంది.
2024 జీ7 సమ్మిట్ ఎజెండా ఏమిటి?
ఇటలీలో జరగబోయే జీ7 సమ్మిట్ అనేక కారణాల వల్ల ప్రాముఖ్యతను సంతరించుకుంది. మొదటిది, ద్రవ్యోల్బణం మరియు వాణిజ్య ఉద్రిక్తతలపై ఆందోళనల మధ్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి ఆర్థిక విధానాలను సమన్వయం చేయడం దీని లక్ష్యం.
రెండవది, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి, స్థిరమైన ఇంధన వనరులను ప్రోత్సహించడానికి వ్యూహాలను చర్చించడం ద్వారా వాతావరణ మార్పులను పరిష్కరించడంపై శిఖరాగ్ర సమావేశం దృష్టి సారిస్తుంది. వాతావరణ రికార్డులు ఇటీవల దొర్లుతున్నందున, అటువంటి సమస్యలను పరిష్కరించడానికి సమష్టి చర్య కీలకం.
మూడవది, కోవిడ్-19 మహమ్మారి నుండి నేర్చుకున్న పాఠాల వెలుగులో , మహమ్మారి సంసిద్ధత మరియు వ్యాక్సిన్ పంపిణీతో సహా ప్రపంచ ఆరోగ్య కార్యక్రమాలకు g7 ప్రాధాన్యతనిస్తుంది. అదనంగా, చైనా, రష్యాతో సంబంధాలు, ప్రపంచ ప్రభావాలతో కొనసాగుతున్న వైరుధ్యాలతో సహా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను సమ్మిట్ ప్రస్తావిస్తుంది.

ప్రత్యేక అతిధిగా
కేంద్రంలో మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని తొలి విదేశీ పర్యటనకు బయల్దేరారు. ఢిల్లీ నుంచి ఇటలీకి ప్రత్యేక విమానంలో బయల్దేరారు. శుక్రవారం ఇటలీలో జరిగే జీ 7 శిఖరాగ్ర సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సదస్సుకు ప్రధాని మోడీ ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలువబడ్డారు. సదస్సులో భాగంగా అమెరికా, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా దేశాధినేతలతోపాటు సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, అబుధాబి రాజు షేక్ మోహమ్మద్ బిన్ జాయద్, మరి కొందరు అరబ్ రాజకుటుంబీకులను మోడీ కలుసుకోనున్నారు రానున్న కాలంలో వివిధ రంగాలలో శక్తి వంతమైన దేశంగా భారతదేశం ప్రపంచ దౌత్య, ఆర్దిక యవనికపై తనదైన ప్రాత పోషిస్తుంది అన్న దానికి సంకేతం రానున్న కాలంలో వివిధ రంగాలలో శక్తి వంతమైన దేశంగా భారతదేశం ప్రపంచ దౌత్య , ఆర్దిక యవనికపై తనదైన ప్రాత పోషిస్తుంది అన్న దానికి సంకేతం. ఈ సదస్సుకు ప్రధాని మోడీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆహ్వానించబడటం మోదీ దార్శనికతకు నిదర్శనం.