జనజీవనం కకావికలం – కొబ్బరి సీమకు శాపం

Date:

కోనసీమ తుపాను మిగిల్చిన విషాదం
వార్తాసేకరణలో ఎన్నెన్నో ఇక్కట్లు
ఈనాడు – నేను: 25
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)


ఆరోజు అంటే నవంబర్ నాలుగో తేదీ సాయంత్రం రాజమండ్రిలో ఈనాడు కార్యాలయానికి వెళ్లే సమయానికి ఆకాశం కొద్దిగా మబ్బు పట్టినట్లు ఉంది. వాతావరణం చల్లగా ఉంది. శీతాకాలం కదా… చలి ప్రభావం అయి ఉంటుందనుకున్నాను.
కానీ అది చలి ప్రభావం కాదని తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు.
వాతావరణ సూచనలు అందుకోడానికి అప్పట్లో రేడియోలు మాత్రమే సాధనం. గంటగంటకు సూచనలు వస్తున్నాయి. వాటి ఆధారంగానే, మా డెస్క్ ఇంచార్జి శర్మగారు కంట్రిబ్యూటర్లకు సలహాలు ఇస్తున్నారు. సాయంత్రం ఐదు గంటలయ్యేసరికి ఈదురు గాలులు మొదలయ్యాయి. ఆఫీసు దగ్గరే ఇల్లు కాబట్టి, అందరం రాత్రి ఇంటికి వెళ్లి భోజనాలు చేసి వచ్చేవాళ్ళం. ఆ రోజు కాలు బయటపెట్టే అవకాశమే లేదు. కాంటీన్ కు వెళ్లి టీ తాగే వీలు కూడా లేదు.


ఎక్కడ చూసినా భీతావహ దృశ్యాలు
ఫోన్ లైన్లు డిస్కనెక్ట్ అయిపోయాయి. ఏమి జరుగుతోందో తెలిస్తే కదా వార్తలు రాయగలిగేది. ఒక్క రిపోర్టర్ కూడా అందుబాటులో లేరు. అమలాపురం ఆఫీసులో ఉన్న రామకృష్ణ తుపాను తీవ్ర ప్రభావం చూపుతున్న మండల రిపోర్టర్ల నుంచి సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నారు. తీవ్ర వేగంతో వీస్తున్న గాలులకు కొబ్బరి చెట్లు తలలు వాలుస్తున్నాయి. ఆ వేగానికి కొబ్బరి చెట్ల మొవ్వు ధ్వంసం అయిపోయింది. ఆ మొవ్వు ఉంటేనే చెట్టు కాయలు కాస్తుంది. కొన్ని లక్షల చెట్లు కోనసీమ అంతటా నేల కూలాయి. చెట్లు కూలుతున్న దృశ్యాలను వాటి యజమానులు, కంట నీరు కుక్కుకుని చూడ్డం తప్ప ఏమీ చేయలేకపోయారు. ఒక్క కొబ్బరి చెట్టు ఉంటే చాలు… ఒక కుటుంబం హాయిగా జీవించేది. కొబ్బరి కాయలు, కొబ్బరి ఆకులు, కాయల నుంచి పీచు ఇలా ప్రతి ఒక్కటీ ఉపయోగకరమైనవే. కోనసీమ అంతటా లక్షల కుటుంబాలు కొబ్బరి చెట్లను నమ్ముకుని హాయిగా జీవించాయి. ఇప్పటికీ జీవిస్తున్నాయి. ఆఖరుకు కొబ్బరి చెట్టు కాండం మీద ఆవు, గేదె పేడతో పిడకలు ఎండ పెట్టుకుని కూడా జీవనం సాగించేవారు. ఇలా కొబ్బరి కోనసీమ రైతుకు కొంగుబంగారమై నిలుస్తోంది.
ఇది నా స్వానుభవం
ఇక్కడ నేను మా మేనత్త గారి గురించి చెప్పాలి. అమలాపురంలో సుబ్బారాయుడు గుడిపక్కనే ఉన్న ఇల్లు మా మేనత్త గారిది. నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి మా నాన్నగారు మా మేనత్తగారి ఇంటికి ఆరునెలలకు ఒకసారైనా పంపేవారు. ఒక వారం రోజుల పాటు వారి పిల్లలతో కొబ్బరి చెట్ల కింద ఆటలాడుకునే వాళ్ళం. భోజనంలో తప్పనిసరిగా కొబ్బరితో ఒక వంటకం ఉండేది. కొబ్బరి పచ్చడి, కొబ్బరి, చింతకాయ, మామిడికాయ, కాలాన్ని బట్టి కాంబినేషన్తో పచ్చళ్ళు చేసేవారు. ఒక్కోసారి కొబ్బరి సెనగ పప్పు, పెసర పప్పు, కొబ్బరి పులుసు…. ఇలా ఎన్నెన్నో రకాలు చేసి పెట్టేవారు. కొబ్బరి తురుముతో అన్నం, కొబ్బరి పులుసు. మధ్యాహ్నం అయితే కొబ్బరితో స్వీట్లు చేసి పెట్టేవారు. తిరిగి మా ఊరు రాజమండ్రి వెళ్లే రోజున కాయలు దింపే కార్మికుడిని పిలిచేవారు. కాయలు దింపించి, కొన్ని మాకు ఇచ్చి, డబ్బులు చేతిలో పెట్టేవారు. అంతకంటే ఏంకావాలి ఆ వయసులో. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకటి. ఇంటికి ఎవరొచ్చినా ఆ కొబ్బరి చెట్లు అమ్మలా ఆదుకునేవి. డబ్బు కావాలంటే కాయలు దింపించుకు అమ్మితే చాలు. గండం గడిచేది. నేను ఇంకా చాల తక్కువ చెప్పాను. కోనసీమవాసులకు కొబ్బరి చెట్టు ఒక కల్పవృక్షం లాంటిదన్నమాట.


వెన్ను వంచి… మొవ్వును విరిచి…
ఈ అనుభవం వల్లనేమో ఆ తుపానుకు నేల వాలిన కొబ్బరి చెట్ల దృశ్యాలు నా మనసును వికలం చేశాయి. మొవ్వు విరిగిన చెట్లు ఎప్పటికి సజీవమవుతాయో. మళ్ళీ కోనసీమ కొబ్బరి రైతుకు పునర్వైభవం ఎప్పటికి వస్తుందో లాంటి ఆలోచనలు ముప్పిరిగొన్నాయి. నాకే ఇలా ఉంటే రైతు సంగతేమిటి? ఇలాంటి ప్రశ్నలు యావత్తు రాష్ట్రాన్ని కన్నీటిపర్యంతం చేశాయి.


అందుబాటులో లేని మేనేజర్
ఆ రాత్రికి ఇక ఆఫీసులోనే కాలక్షేపం. పత్రిక ప్రింటింగ్ అయ్యింది కానీ, చాలా తక్కువ మందికి చేరింది. ఇలాంటి సందర్భాలలోనే, అందుబాటులో లేకపోతే, తిట్లు తప్పవు. అది బాయ్ అయినా మేనేజర్ అయినా మినహాయింపు లేదు. విశాఖపట్నం యూనిట్ మేనేజర్ గా ఉన్న ఆయన స్వస్థలం అమలాపురం. ఏదో పని మీద ఆయన అక్కడికి వెళ్లారు. తుపాను కారణంగా అమలాపురంలో చిక్కుకుపోయారు. అలాగే, రాజమండ్రి యూనిట్ మేనేజర్ కూడా అందుబాటులో లేకపోయారు. ఆ సమయంలో వార్తల క్రోడీకరణ, రిపోర్టర్లతో సమన్వయం బాధ్యతలను, బ్యూరో చీఫ్ నవీన్ గారితో పాటు, డెస్క్ ఇంఛార్జులే చూసుకున్నారు. ఉపసంపాదకులు కూడా ఒక కొమ్ము కాశారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు వాన కాస్త తెరిపివ్వడంతో కాలినడకన ఇళ్లకు బయలుదేరాం. రోడ్ల మీద మహా వృక్షాలు కూకటి వేళ్ళతో పడిపోయిన దృశ్యాలు మా మనసులను కూడా కూల్చేశాయి. మళ్ళీ ఉదయం పదకొండు గంటలకు ఆఫీసుకు హాజరు.


హైదరాబాద్ నుంచి అమలాపురానికి…
ఈలోగా, టెలిఫోన్ లైన్లను పునరుద్ధరించారు. అమలాపురం ఆఫీసుతో సమాచార సేకరణకు మార్గం సుగమమైంది. హైదరాబాద్ నుంచి ఒక టీం అమలాపురానికి వచ్చింది. వచ్చిన వాళ్లంతా హేమాహేమీలు. వారందరికీ ఒక ఆదేశం. అందరూ అక్కడున్న రిపోర్టర్ రామకృష్ణ ఏమి చెబితే అది చెయ్యాలని. న్యూస్ టుడే ఎం.డి. రమేష్ బాబు, చైర్మన్ రామోజీ రావు స్వయంగా ఇచ్చిన ఆదేశాలు అవి. వచ్చిన బృందానికి ఎక్కడికి వెళ్లాలో గైడ్ చెయ్యాల్సిన బాధ్యత రామకృష్ణది. మొదట్లో వారు అతని మాట వినేవారు కాదు. వారికి నచ్చిన ప్రదేశానికి వెళ్లేవారు. తిరిగి వచ్చిన తరవాత అమలాపురంలో ఏర్పాటు చేసిన భోజనం చేసి, వార్తలు ఇచ్చి విశ్రమించేవారు. ఒకరోజు వారికి వార్తలు రాయడానికి అవసరమైన సమాచారం దొరకలేదు. అప్పుడు రామకృష్ణ వారికి చెప్పారు…

అక్కడకు వెళ్ళద్దని నేను నిన్ననే చెప్పినా వినలేదు. ఎవరికి తోచిన విధంగా వారు, ఎక్కడికనుకుంటే అక్కడకు వెళ్ళారు. అందుకే ఇలా జరిగింది అని అనడంతో, ఆ టీం సభ్యులు అతడిపై కోపగించుకున్నారు. విషయం మేనేజర్ జి.వి. రావు గారికి చేరడం, ఆయన ఎం.డి. గారికి చెప్పడం… వెంటనే ఎం.డి. వారికి తలంటడం జరిగిపోయాయి. అప్పటి నుంచి అంతా సజావుగా సాగింది. ఎటువైపు వెడితే ఏ ప్రాంతం వస్తుంది.. ఎక్కడ అవసరమైన సమాచారం దొరుకుతుంది అనే విషయం చెప్పేవారు రామకృష్ణ. అందరూ తలోప్రాంతానికి వెళ్లడంతో, నష్టాల వివరాల, మానవీయ కథనాలు, రైతుల కన్నీటి గాథలు, ఉప్పెనతో (ఇప్పుడు సునామీ అంటున్నాం) దెబ్బతిన్న గ్రామాలూ, ఇలా అనేక కోణాలలో వార్తలు వచ్చేవి. ఈ వార్తలు అన్నీ ఒక ఎత్తయితే… రాజమండ్రి ఫోటోగ్రాఫర్ సుంకర వెంకటేశ్వరరావు తీసిన ఫోటో ఒక ఎత్తు. ఈ ప్రాంతానికి వచ్చిన ఈనాడు చీఫ్ ఫోటోగ్రాఫర్ కు కూడా అలాంటి ఫోటో దొరకలేదు. హైదరాబాద్ నుంచి వచ్చిన టీం వెంట పెద్ద కెమెరాలు, టీవీ కెమెరాలు వెళ్ళేవి. లోకల్ రిపోర్టర్లు డబ్బా కెమెరాలతో తంటాలు పడేవారు. సుంకర వెంకటేశ్వరావు తీసింది ఈ డబ్బా కెమెరాతోనే. కాట్రేనికోన మండలం గోడితిప్ప వద్ద దొరికింది ఆ ఫోటో. అతనికి ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డును రాష్ట్ర స్థాయిలో తెచ్చిపెట్టింది.
ఆ ఫోటో ఏమిటంటే….
తలుచుకుంటేనే ఇప్పటికీ ఒళ్ళు జలదరిస్తుంది….
శవాన్ని పీకుతున్న కుక్క
ఇదీ ఫోటో. సముద్రపు ఒడ్డున ఉన్న ఆ శవం కాలిన ఒక శునకం పట్టుకుని పీకుతున్న ఫోటో మరుసటి రోజు ప్రధాన పత్రికలో అత్యంత ప్రాధాన్యతనిచ్చి ప్రచురించారు. ఎంతో సంచలనాన్ని సృష్టించిన ఈ ఫోటో చెప్పిన పాఠం ఒక్కటే…. గుర్తింపు పొందాలంటే పెద్ద కెమెరాలు అవసరం లేదు. డబ్బా కెమెరా అయినా చాలు అనేదే ఆ పాఠం. ఒక్క ఫోటో వేయి వార్తల పెట్టు అని నిరూపించిన ఫోటో అది. ఈనాడు రాజమండ్రిని జాతీయ స్థాయిలో నిలిపింది.
కొడుకు మరణించినా ఏమి చేయలేని స్థితిలో ఒక కుటుంబం
కళ్లెదురుగుండా ఇంటి దూలం కూలి కొడుకు మీద పడి చనిపోయినా కదలలేక గుండెలవిసేలా, కళ్ళు ఎండిపోయేలా ఏడ్చిన ఒక తండ్రి దీన గాథ.. పశువులను కోల్పోయిన రైతుల వ్యథ, కన్నపిల్లల్లా సాకిన కొబ్బరి చెట్లు నిట్టనిలువునా నేలకూలుతున్నా ఏమీ చేయలేని యజమానుల బాధ… ఇలా ఎన్నని చెప్పగలం… ఒక పదిరోజుల పాటు పత్రిక నిండా దీన గాథలే… గుండెలు పిండేసే కథనాలే.. ప్రకృతి మహోగ్ర రూపాన్ని కళ్లారా చూసిన కోనసీమ గుండె నిండా అలాంటి భయ విహ్వల సన్నివేశాలు ఇప్పటికీ చిరంజీవులు. అసలు ఇంత బీభత్సం జరగడానికి కారణం ఏమిటి? అక్టోబర్ నెలలోనే, ఏర్పడిన ఆ తుపాను అటూ ఇటూ తిరుగుతూ దోబూచులాడింది. కాకినాడ సమీపంలోకి వచ్చి మరీ సముద్రంలోకి వెళ్లి పోయింది.
వెనక్కు వెళ్ళినట్టే వెళ్లి….
ముప్పు తప్పిందనుకున్న తరుణంలో ఉరుము లేని పిడుగులా ఒక్కసారిగా రెట్టించిన వేగంతో ప్రళయకాల రుద్రునిలాగా అమలాపురం – యానాం నడుమ తీర ప్రాంతాలతో పాటు, వందల గ్రామాలను విలవిలాడించింది. ఇప్పటికైనా అందరూ అదే గుర్తుచేసుకుంటారు. లోపలికి వెళ్లిన తుపాను… మళ్ళీ అదే ప్రాంతానికి రావడం అంటే ప్రళయ సదృశమని చెబుతారు. అందుకే… తూర్పు గోదావరి వాసులు తుపాను అంటే వణికిపోతారు.


వెన్నుదన్నుగా కంట్రిబ్యూటర్ వ్యవస్థ
ఈ మొత్తం ఉదంతంలో ఈనాడు న్యూస్ కంట్రిబ్యూటర్ వ్యవస్థను ఎంత ఎక్కువ పొగిడినా తక్కువే. ప్రాణాలను సైతం వారు పణంగా పెట్టి పనిచేశారు. రాసిన వార్తలను, తీసిన ఫోటోలను వారు అంచెలవారీగా రాజమండ్రిలోని డెస్కుకు చేరడానికి సహకరించారు. అప్పట్లో ఈనాడు బ్యూరో చీఫ్ గా ఉన్న పెద్దాడ నవీన్ గారు, ఎప్పటికప్పుడు కంట్రిబ్యూటర్లకూ, డెస్కుకూ కూడా సలహాలు ఇస్తూ నడిపించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన టీం ప్రత్యేక కథనాలు, మానవీయ కథనాలు, జరిగిన నష్టాలు వంటి వాటిపై దృష్టి కేంద్రీకరించేవారు. వార్తలు, ఫోటోలు అన్నింటినీ హైద్రాబాదుకు పంపి రాష్ట్రవ్యాప్తంగా ప్రచురితమయ్యేలా ఒక ప్రత్యేక డెస్క్ ఏర్పడింది. అవసరమైన సమయాలలో ఎలా పనిచేయాలో పరిస్థితులు నేర్పుతాయి. ఇలాంటి సందర్భాలలోనే పని ప్రాధాన్యత తెలుస్తుంది. వెరసి టీం వర్క్ రిజల్ట్ కనిపిస్తుంది. అప్పుడు వచ్చే ఆనందం అనిర్వచనీయం. ఆ ఆనందాన్ని మొత్తం రాజమండ్రి యూనిట్ చవిచూసింది. తప్పులు, మందలింపులు మామూలే… మనకి ఇస్తున్న జీతానికి పనిచేస్తున్నాం అని ఎవరూ అనుకోలేదు. అదేదో మా సొంత పనిలా భావించి చేశాం. డెస్క్ ఇంచార్జి శర్మ గారు, బ్యూరో చీఫ్ నవీన్ గారు, జనరల్ డెస్క్ ఇంచార్జి మల్లికార్జున రావు గారు, కోనసీమ రిపోర్టింగ్ బృందం, హైదరాబాద్ నుంచి వచ్చిన బృందం, ఇంకా ఎంతోమంది శ్రమ ఇందులో ఉంది. పొద్దున్న పత్రిక చూడగానే, శ్రమను మరిచిపోయేవారం. అది ఈనాడు సంస్కృతి.. అది ఈనాడు సమర్థత. అప్పటి కోనసీమ రిపోర్టర్లు రామకృష్ణ, సుబ్బారావు, భగత్ సింగ్ ఇలా ఎందరో ఈ వార్తల క్రతువు సమర్థంగా పూర్తికావడానికి తోడ్పడ్డారు. ఈ కవరేజ్ రామకృష్ణకు ప్రమోషన్ తెచ్చింది. అప్పటిదాకా న్యూస్ కంట్రిబ్యూటర్ గా ఉన్న అతడిని స్టాఫర్ గా అందలం ఎక్కేలా చేసింది.

అప్పటిదాకా ప్రశాంతం… అంతలోనే ఉత్పాతం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Kejriwal ‘s battle for survival

(Dr Pentapati Pullarao) Delhi will have its state elections in...

నాలుగు కిలోమీటర్లలో 68 శవాలు

చంద్రబాబు సమర్థతకు తొలి పరీక్ష ఈ సైక్లోన్ఉరుము లేని పిడుగు తరువాత….ఎక్కడ...

ఆర్జీవీపై అసాధారణ రచన ఈ కావ్యం

ఒక అభిమాని సమర్పించిన అక్షర శరం(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)ఒక్కొక్క సాయంత్రానికి ఒక్కొక్క...

అప్పటిదాకా ప్రశాంతం… అంతలోనే ఉత్పాతం

తుపాను ముందు ప్రశాంతతను చూశాం ఈనాడు-నేను: 24 (సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి) అది 1996 నవంబర్...
slothttps://www.rajschool.com/slot onlinehttps://sai-ban.com/https://britoli.com/https://www.anabias.com/https://bcrbltd.com/https://s2aconsultingfze.com/https://rock-poker.com/https://koinhoki88.org/https://koinhoki88.net/https://rawsolla.com/https://koinhoki888.com/https://koinhoki88.com/https://infomedan.net/qqplazaslot gacorslot gacor koinhoki88slot gacor terbaru koinhoki88koinhoki88koinhoki88slot777https://usfinancehelp.com/https://collectingdiecasttoystoday.com/https://nyonyaguru.com/https://topindo-pulsa.com/https://gojekonline.com/https://dafrastar.com/https://www.reliantholdings.net/https://www.opalcitysview.com/https://lumarca.info/https://alt-qqaxioo.com/https://www.capuletlondon.com/https://www.tithaimart.com/https://www.trungvuongus.com/https://tropicalbioenergy.com/https://www.capitol-peak.com/https://pisswife.com/https://gamvipvn.com/https://www.elfutbolesnuestro.com/https://ampdsmart.com/https://schiffsilver.com/https://theicemall.com/https://shebenik.com/https://popvoxawards.com/https://www.adwebconsultancy.com/https://www.technotchsolutions.com/https://threekookaburras.com/https://marcjacobsonsale.com/https://www.forexrehberim.net/https://dreamlifefactory.com/https://www.videosocialcreative.com/https://www.oregonwetlands.net/https://www.americaneve.com/https://www.iamthelongtail.com/https://www.privatelivesbroadway.com/https://travelamateurs.com/https://sustaintheline.com/https://geekforcefive.com/https://galaksinews.com/https://sejutateknologi.com/https://harimausumateranews.com/https://diarysaham.com/https://lacakonline.com/https://undangansah.com/https://kottakkalayurvedapharmacy.com/https://kabforums.org/https://bhootmedia.com/https://erectie-goedkoop.com/https://heylink.me/Bandargaming-/https://qqcrownbos.com/https://eastofanfield.com/https://nyonyabesar.com/https://direktoriwisata.com/https://bbqburgersmore.com/https://bjwentkers.com/https://mareksmarcoisland.com/https://richmondhardware.com/https://technostrix.com/