సమన్వయకర్తలతో సీఎం వై ఎస్ జగన్
అమరావతి: పార్టీ సమన్వయకర్తలే తనకు టాప్ క్యాడర్ అని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ సమన్వయకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.
- ఎన్నికలకు సంవత్సరం మాత్రమే సమయం ఉంది.
- పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లుగా మీరు ఓనర్‌షిప్ తీసుకోవాలి.
- మీకు అప్పగించిన వివిధ జిల్లాల్లో పార్టీనేతలను బలోపేతం చేయాల్సిన బాధ్యత మీదే.
- ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే.. వాటిని సరిదిద్ది అందర్నీ ఒక్కతాటిపైకి తీసుకురావాలి.
- అంతిమంగా మన అభ్యర్థులకు మంచి మెజార్టీలు రావాలి.
- ఆ లక్ష్యంతోనే మీరు సంకల్పంతో పనిచేయాలి.
- పార్టీ సమన్వయ కర్తలుగా మీరు నాతో ఏ విషయాన్నైనా చర్చించండి.
- ఎప్పుడైనా నన్ను కలవవచ్చు. పార్టీ పరంగా మీరు నాకు టాప్ టీం.
- సచివాలయ కన్వీనర్ల రూపంలో, గృహసారథుల రూపంలో కింద చక్కటి యంత్రాంగం ఉంది. వాలంటీర్లను వారితో మమేకం చేయాలి.
- ఈ యంత్రాంగాన్ని చురుగ్గా పనిచేయించడానికి, క్రియాశీలకంగా ఉండడానికి కార్యక్రమాలను నిర్దేశించాం.
- ఆ కార్యక్రమాలన్నీ సజావుగా, సమర్థవంగా ఆయా నియోజకవర్గాల్లో నడిచేలా మీరు పర్యవేక్షణ, సమన్వయ బాధ్యతలు స్వీకరించండి.
- మీరు, నేను, పార్టీ యంత్రాంగం అంతా కలిసి ముందుకుసాగాలి.