మీరే నా టాప్ క్యాడర్

Date:

సమన్వయకర్తలతో సీఎం వై ఎస్ జగన్
అమరావతి:
పార్టీ సమన్వయకర్తలే తనకు టాప్ క్యాడర్ అని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ సమన్వయకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.

  • ఎన్నికలకు సంవత్సరం మాత్రమే సమయం ఉంది.
  • పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లుగా మీరు ఓనర్‌షిప్‌ తీసుకోవాలి.
  • మీకు అప్పగించిన వివిధ జిల్లాల్లో పార్టీనేతలను బలోపేతం చేయాల్సిన బాధ్యత మీదే.
  • ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే.. వాటిని సరిదిద్ది అందర్నీ ఒక్కతాటిపైకి తీసుకురావాలి.
  • అంతిమంగా మన అభ్యర్థులకు మంచి మెజార్టీలు రావాలి.
  • ఆ లక్ష్యంతోనే మీరు సంకల్పంతో పనిచేయాలి.
  • పార్టీ సమన్వయ కర్తలుగా మీరు నాతో ఏ విషయాన్నైనా చర్చించండి.
  • ఎప్పుడైనా నన్ను కలవవచ్చు. పార్టీ పరంగా మీరు నాకు టాప్‌ టీం.
  • సచివాలయ కన్వీనర్ల రూపంలో, గృహసారథుల రూపంలో కింద చక్కటి యంత్రాంగం ఉంది. వాలంటీర్లను వారితో మమేకం చేయాలి.
  • ఈ యంత్రాంగాన్ని చురుగ్గా పనిచేయించడానికి, క్రియాశీలకంగా ఉండడానికి కార్యక్రమాలను నిర్దేశించాం.
  • ఆ కార్యక్రమాలన్నీ సజావుగా, సమర్థవంగా ఆయా నియోజకవర్గాల్లో నడిచేలా మీరు పర్యవేక్షణ, సమన్వయ బాధ్యతలు స్వీకరించండి.
  • మీరు, నేను, పార్టీ యంత్రాంగం అంతా కలిసి ముందుకుసాగాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అధికారం పోయిందనే అక్కసులో కె.సి.ఆర్.: రేవంత్

చిల్లరగాళ్లను ఉసిగొల్పుతున్న మాజీ సీఎంకాలకేయ ముఠాలా తెలంగాణాపైకి చిల్లరగాళ్ళురాజీవ్ విగ్రహావిష్కరణలో రేవంత్...

Anti- defection laws need a review

(Dr Pentapati Pullarao) There is much news when MLAs or...

Onam the festival of Colors and Flowers

(Shankar Raj) Kerala in many ways is a strange state....

మీది ఉద్యోగం కాదు… భావోద్వేగం

ఎస్.ఐ.ల పాసింగ్ అవుట్ పెరేడ్లో సీఎం రేవంత్కాస్మటిక్ పోలీసింగ్ కాదు... కాంక్రీట్...