మరపునకు సాక్షి

Date:

అధినేత మనసెరుగని స్వామి భక్తి
చారిత్రక పురుషుడు….యుగానికి ఒక్కడు…రాజకీయాల్లో మేరునగధీరుడు…ఆయన ముందు…వెనుక కూడా ఆయనే. ఆయన సరసన నిలిచే స్థాయి ఉన్న రాజకీయ నాయకుడు లేరు. ఇది అతిశయోక్తి ఎంతమాత్రమూ కాదు. సినీ రంగ ప్రవేశం నుంచి నిష్క్రమణ వరకూ సంచలనాలే. ఆహార్యం…ఆంగికం..
న భూతో న భవిష్యతి. రాజకీయాల్లో ఆయన ప్రవేశమే పెను సంచలనం. అన్న మాట నిలబెట్టుకున్నారు. ఇచ్చిన హామీలను తు.చ. తప్పకుండా పాటించారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే… దానికి కట్టుబడ్డారు. జాతీయ రాజకీయాల్లోనైనా… రాష్ట్ర రాజకీయాల్లోనైనా తిరుగులేని శక్తి ఆయన. ఆయన ఎవరో కాదు. ఎన్టీఆర్. ఎన్టీఆర్ శత జయంతి మే 28, ఆదివారం. కాబట్టి సాధారణంగా పాఠకుల కళ్ళు పత్రికలు ఇచ్చే మ్యాగజైన్లపై ఉంటాయి. చూసిన వారికి ఒకింత ఆశ్చర్యమూ కలిగింది. ముఖ్యంగా సాక్షి ఫన్ డే చూసిన వారు. కళ్ళ నీరు పెట్టుకున్నారు. ఒక పక్కన ఆ పత్రిక అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ పేరు మీద ఒక జిల్లాను ఏర్పాటు చేశారు. ఆ మాత్రం బుద్ధి సాక్షి ఫన్ డే కి లేకపోయింది. మెయిన్ ఎడిషన్లో వారి పాలసీకి అనుగుణంగా ఒక వ్యాసాన్ని ఇచ్చారు తప్ప. ఫన్ డేలో ఎన్టీఆర్ అనే పేరు కూడా లేకుండా జాగ్రత్త పడ్డారు.


ఈనాడు ఆదివారం మ్యాగజీన్ అద్భుతంగా ఉంది. ప్రత్యేక సందర్భాలలో ఎప్పుడూ ఈనాడు తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటుంది. ఆంధ్ర జ్యోతి కూడా ఈనాడుతో పోటీ పడింది. వెలుగు దినపత్రికలోనూ ప్రత్యేక కథనాన్ని ఇచ్చారు. నమస్తే తెలంగాణ సాక్షి దారిలో నడిచింది. వీరిద్దరికీ ఏమైంది? ఒక పక్క ఆ పత్రిక అధినేత రాజకీయ నిర్ణయాల ద్వారా ఎన్టీఆర్ అభిమానులకు దగ్గరవుతుంటే… పత్రిక మాత్రం దూరం చేస్తోంది. ఇది యాజమాన్య లోపమా? ఇంచార్జి లోపమా? కనీసం బుర్ర పెట్టి కూడా ఆలోచించరా? ఎందుకు ఎన్టీఆర్ ను విస్మరించారు. తమ సత్తా చాటుకోవడానికి ఎంత సదవకాశమిది? ఎన్టీఆర్ గురించి రాస్తే ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని భయపడ్డారా? ఎంతసేపు ప్రత్యర్థి పార్టీని తూర్పార పడుతూ అధినేత దృక్కులలో పడాలని అనుకుంటారు తప్ప. సందర్భానుసారం కథనాలను ఇస్తూ… పత్రికకు మంచి పేరు తేవాలనే ఇంగితం పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు లోపించింది అనే అంశాన్ని ఇది తెలియచెబుతోంది. ఏడాది తిరిగేసరికో లేదా ఎన్నికల ముందో ఎంత జీతం పెంచుతారా… అని ఎదురు చూసే ఈ ఉద్యోగులు ఒక చారిత్రక సందర్భాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చునో ఆలోచనే లేదని అర్థమవుతోంది. అన్ని సందర్భాలనూ అందుకుంటేనే కదా పత్రికకు మంచి పేరు. అలాగని పత్రికలో పదుల సంఖ్యలో కలం బలం ఉన్న పాత్రికేయులున్నారు. ఇంచార్జికి ఆ చేవ లేకపోతే, వారితోనైనా రాయించుకోవాలి కదా. ఎన్టీఆర్ మీద ప్రత్యేక సంచిక వేస్తామంటే సంబంధితులు వద్దంటారా. ఒక వేళ అలా అని ఉంటె యజమానికి ద్రోహం చేసినట్టే. సంవత్సర చందాదారునిగా ఇది నా ఆక్రోశం. అంత పెట్టి ఎందుకు పత్రిక కొనాలని ఆలోచన వస్తే… ఒక్కరితో ఆగితే పరవాలేదు. అలాంటి వారి సంఖ్య పెరిగితే పత్రిక మనుగడకే ముప్పు. ఇదంతా చూస్తుంటే అసలు ఎన్టీఆర్ అంటే తెలిసిన వారు సాక్షిలో ఉన్నారా అనే అనుమానమే కలుగక మానదు. కానీ అలా లేకపోయే అవకాశం తక్కువ. ఎందుకంటే… సాక్షి పాత్రికేయులతో యాభై శాతం ఈనాడు ప్రోడక్టులే. ఎన్టీఆర్ గురించి ప్రత్యేక సంచిక ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్నకు వారి వద్దే కాదు యాజమాన్యం వద్దా సమాధానం లేదు. డాక్టర్ వై.ఎస్.ఆర్. కూడా ఎన్టీఆర్ బొమ్మతో ప్రచారం చేయించారు. ఎన్టీఆర్ పథకాలను సొంతం చేసుకున్నారు. మరొక అంశం ఏమిటంటే శ్రీమతి లక్ష్మీపార్వతి విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్ అవార్డు కార్యక్రమంలో సైతం వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు కూడా పాల్గొన్న విషయాన్ని సైతం మరువకూడదు.
ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా సాక్షి పత్రికను పాఠకలోకం ముందు తలదించుకునేలా చేసింది ఎవరో వారే నిర్ణయించుకోవాలి. ఉద్యోగుల స్వామి భక్తి సాక్షి మనుగడకే ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ఒక ఐదేళ్ల క్రితం బాలీవుడ్ క్లాసిక్స్ అంటూ హిందీ సినిమాలపై ఫుల్ పేజీల వ్యాసాలు గుమ్మరించారు. అలా ఆలోచించినా ఎన్టీఆర్ క్లాసిక్స్ పేరుతో మంచి మంచి సినిమాలపై వ్యాసాలు రాసి ఉండే వారు. కాదనగలరా ఎవరైనా. రాజకీయంగా రాసుకోవడం సాక్షి నామోషీ అనిపిస్తే కనీసం ఇలాగైనా వ్యాసాలు వేసి ఉండాల్సింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పుష్కర శ్లోకాలు… అన్వేషణ

వేద పండితుల నుంచి సన్నిధానం వరకూగౌతమి గ్రంధాలయం గొప్పదనం….ఈనాడు - నేను:...

రామోజీ వర్కింగ్ స్టైల్ అలా ఉంటుంది…

నాకు ఆయన నుంచి వచ్చిన తొలి ప్రశంస?నేను - ఈనాడు: 15(సుబ్రహ్మణ్యం...

రామోజీ కామెంట్స్ కోసం చకోర పక్షుల్లా….

టీం వర్క్ కు నిదర్శనం సైక్లోన్ వార్తల కవరేజ్ఈనాడు - నేను:...

కర్ఫ్యూలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే….

విజయవాడ ఉలికిపాటుకు కారణం?ఈనాడు - నేను: 13(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)పని పూర్తయింది....
slothttps://www.rajschool.com/slot onlinehttps://sai-ban.com/https://britoli.com/https://www.anabias.com/https://bcrbltd.com/https://s2aconsultingfze.com/https://rock-poker.com/https://koinhoki88.org/https://koinhoki88.net/https://rawsolla.com/https://koinhoki888.com/https://koinhoki88.com/https://infomedan.net/qqplazaslot gacorslot gacor koinhoki88slot gacor terbaru koinhoki88koinhoki88koinhoki88slot777https://usfinancehelp.com/https://collectingdiecasttoystoday.com/https://nyonyaguru.com/https://topindo-pulsa.com/https://gojekonline.com/https://dafrastar.com/https://www.reliantholdings.net/https://www.opalcitysview.com/https://lumarca.info/https://alt-qqaxioo.com/https://www.capuletlondon.com/https://www.tithaimart.com/https://www.trungvuongus.com/https://tropicalbioenergy.com/https://www.capitol-peak.com/https://pisswife.com/https://gamvipvn.com/https://www.elfutbolesnuestro.com/https://ampdsmart.com/https://schiffsilver.com/https://theicemall.com/https://shebenik.com/https://popvoxawards.com/https://www.adwebconsultancy.com/https://www.technotchsolutions.com/https://threekookaburras.com/https://marcjacobsonsale.com/https://www.forexrehberim.net/https://dreamlifefactory.com/https://www.videosocialcreative.com/https://www.oregonwetlands.net/https://www.americaneve.com/https://www.iamthelongtail.com/https://www.privatelivesbroadway.com/https://travelamateurs.com/https://sustaintheline.com/https://geekforcefive.com/https://galaksinews.com/https://sejutateknologi.com/https://harimausumateranews.com/https://diarysaham.com/https://lacakonline.com/https://undangansah.com/https://kottakkalayurvedapharmacy.com/https://kabforums.org/https://bhootmedia.com/https://erectie-goedkoop.com/https://heylink.me/Bandargaming-/https://qqcrownbos.com/https://bbqburgersmore.com/https://bjwentkers.com/https://mareksmarcoisland.com/https://safepaw.com/https://www.caretuner.com/https://myvetshop.co.za/https://rtxinc.com/https://voice-amplifier.co.uk/https://shamswood.com/