భారత ప్రజల ప్రతిబింబం
నూతన పార్లమెంట్ భవన ప్రారంభంలో ప్రధాని
న్యూ ఢిల్లీ, మే 28 : నూతన పార్లమెంట్ భవనం నూట నలభై కోట్ల జనాభా ఆశలకు ప్రతిబింబమని ప్రధాన మంత్రి నరేద్ర మోడీ తెలిపారు. ప్రజాస్వామ్యానికి ఇది కొత్త దేవాలయమని చెప్పారు. ఈ భవనం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన డెబ్భై ఐదు ఏళ్ల తరవాత కొత్త భవనాన్ని నిర్మించుకున్నామన్నారు. చోళ సామ్రాజ్యం నాటి నుచి వస్తున్నా సెంగోలును కొత్త పార్లమెంట్ భవనంలో ప్రతిష్టించుకోవడం ఆనందకరమైన అంశమన్నారు. ఈ చారిత్రాత్మక ఘటనలో ప్రజలు భాగస్వాములయ్యారని తెలిపారు మోడీ. భారత దేశానికే ప్రస్తుతం అమృత కాలమని మోడీ చెప్పారు. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లిలాంటిదని ప్రధాని తెలిపారు. కొత్త భారత్ కు కొత్త పార్లమెంట్ భవనం కొత్త జోష్ తెచ్చిందన్నారు. భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచం అభివృద్ధి చెందుతుందని మోడీ తెలిపారు.
ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయం
RELATED ARTICLES