ఎస్ఎఎస్ ఎగ్జిట్ పోల్‌లో వెల్లడి
హైదరాబాద్, నవంబర్ 3: ఎంతో కాలంగా పార్టీలను ఊరించిన మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. ఇక ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందనేదే కదా సందేహం. ఎలాంటి సందేహం లేదు టీఆర్ఎస్‌దే విజయం అని ఢంకా బజాయించి చెబుతోంది ఎస్ఎఎస్ సంస్థ. నవంబరు 3న ఉప ఎన్నిక పోలింగ్ సమయంలో చేపట్టిన ఎగ్జిట్ పోల్‌లో టీఆర్ఎస్‌దే ఆధిక్యమని ఆ సంస్థ ఎగ్జిట్ పోల్ తేల్చి చెప్పింది. ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ వచ్చిందో కూడా ఈ సంస్థ అంచనా వేసింది.
టీఆర్ఎస్‌కు 41 నుంచి 42 శాతం ఓట్లు, బీజేపీకి 35 నుంచి 36 శాతం, కాంగ్రెస్‌కు 16.5 నుంచి 17.5 శాతం, బీఎస్‌పీకి 4 నుంచి 5 శాతం, ఇతరులకు 1.5 నుంచి 2 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. ఈ సంస్థ రెండు రకాలుగా అంచనా వేసింది. మొదటి దాని ప్రకారం పోలింగ్ శాతం 85-85 మధ్య ఉంటే 10, 500 నుంచి 11వేల ఆధిక్యంతోనూ, 87 నుంచి 88 శాతం ఓట్లు పోలయితే 12 వేల నుంచి 12వేల 500 ఆధిక్యతతో బీజేపీపై టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని సర్వే పేర్కొంది. 88శాతం పైన ఓట్లు పోలయితే టీఆర్ఎస్ ఆధిక్యం 16వేలు ఉంటుందని అంచనా వేసింది. ఎగ్జిట్ పోల్‌ను నవంబర్ 3 వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకూ 36పోలింగ్ బూత్‌లలో నిర్వహించారు. ఇందులో వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.