(సురేష్ కుమార్ ఎలిశెట్టి, 9948546286)
చేత పెన్ను..
కెమెరా కన్ను..
గట్టిగా రాసే వెన్ను..
దంచి కొట్టే గుండె దన్ను..
అవినీతిపై ఎక్కుపెట్టే గన్ను
సెటైర్ అయితే ఫన్ను..
యాజమాన్యాల నోట్లో జున్ను
రాసేవాడి నోట్లో నిత్యం మన్ను..
జీవితాన లేదు తీరుతెన్ను
కష్టాలకూ ఉండదు దరీతెన్ను..
జిందగీకే లేని దారీతెన్నూ..
గుండెనింపే మంచి వార్త…
మంచి వార్త రాస్తే గుండె నిండు
అక్రమం చూస్తే కడుపు మండు
వార్తే ఫుడ్డు..పేపరే బెడ్డు..
ఎవరినైనా ఏదైనా
అడగడానికి అహం అడ్డు..
బ్రతుకు సాగరంలో ఈదులాటకు
ఆత్మాభిమానమే తెడ్డు..
అందరి కంటే ముందే…
ముంచేసే హుదూదైనా
కాటేసే కరోనా అయినా..
ఇళ్లు కాలుతున్నా ..
ఎండ పేలుతున్నా..
అందరికంటే ముందు కెమెరా
జర్నలిస్టుగా నువ్వే
ముందు పహారా..
బాధితులతో వాయిస్ ఓవర్
నీ చానల్ కు నీ వార్తే టర్నోవర్
ఓ కితాబైనా ఇవ్వడు ఓనర్..
నీ కవరేజే
నిన్ను చేస్తుంది విన్నర్..!
అల్ప సంతోషి
బాగా రాసావు..
ఈ ఒక్క మాటతో
పొంగిపోయే అల్పసంతోషి..
అది చాలు ఆ రోజల్లా ఖుషి..
అన్నం లేకపోయినా బ్రతికేస్తాడు
నీలోని మనిషి..
వార్తను బ్రతికించి
తాను ఆకలితో
చచ్చిపోయే అక్షర రుషి..
రాత్రంతా కడుపులో
కాలు పెట్టి పడుకుని
మళ్లీ ఉదయాన్నే
వార్తల కోసం
పరుగులు తీసే
నిత్య అన్వేషి..
జాతీయ పత్రికా దినోత్సవం
సందర్భంగా జర్నలిస్టు సోదరులకు జోహార్లు అర్పిస్తూ
(కవిత రచన విజయనగరానికి చెంది సీనియర్ జర్నలిస్ట్)
జర్నలిస్టు బ్రతుకు “చిత్రం”!
Date: