గాంధీ గారి కుర్చీ

Date:

(డా నాగసూరి వేణుగోపాల్, 9440732392)
2024 సెప్టెంబర్ 9వ తేదీన నేను మద్రాసులో టి. నగర్ లోని దక్షిణ భారత హిందీ ప్రచార సభ వెళ్ళొచ్చాను. 1918 లో గాంధీజీ చివరి కుమారుడు దేవదాస్ గాంధీ ఓ శిక్షణ తరగతి నిర్వహించడంతో ఈ సంస్థకు అంకురార్పణ చేశారు. వందేళ్ళ పైచిలుకు చరిత్ర ఉన్న ఈ సంస్థ సెక్రెటరీ జి. సెల్వరాజన్ ని కలిసి, గాంధీజీ సంబంధించిన నాలుగు పుస్తకాలను వారి లైబ్రరీకి ఇచ్చిన విషయం ఇదివరకే రాశాను. ఈ సంస్థకు ఉత్సవాలు 1946 జనవరి 20 నుంచి పది రోజులు పాటు జరిగినప్పుడు, గాంధీజీ అతిథిగా వచ్చి ఈ భవనంలోనే ఉన్నారు.


ఆయన వాడిన మంచం ఇక్కడ ఉంది. దాని పక్కనే ఓ కుర్చీ కూడా ఉంది. ఆ కుర్చీ ఇక్కడికి ఎలా వచ్చింది? ఈ అంశం అందరికీ తెలియజేజడానికే రెండు మాటలు. 1933 డిసెంబర్ 26న గాంధీజీ ఆంధ్రప్రదేశ్ లోని తాళ్లపూడి గ్రామానికి వచ్చారు. అలా వచ్చినప్పుడు అక్కడి వారిని ఉద్దేశించి ప్రసంగించినప్పుడు ఓ కుర్చీని వినియోగించారు. ఆ పూట నుంచి ఆ కుర్చీని గౌరవంగా జాగ్రత్త చేశారు. గోకవరపు రాజారావు అనే మిత్రుడు ఆ కుర్చీని దక్షిణ భారత హిందీ ప్రచార సభకు బహుకరించగా, సభ ఆ కుర్చీని సందర్శనార్థం ఇలా ఉంచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Maharashtra: A battle between individuals

(Dr Pentapati Pullarao) Maharashtra is the second largest and richest...

Hurricane claims 50 lives in Florida

Washington: At least 50 people were killed, many injured,...

మన మౌనం ధర్మ వినాశనానికి దారివ్వకూడదు: పవన్ కళ్యాణ్

విజయవాడ, సెప్టెంబర్ 24 : తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రం అయిన...

తిరుపతి లడ్డు వివాదం ..సమాధానం చెప్పవలసింది ఎవరు?

అపరిమిత అధికారాలిచ్చిన ఫలితం ఇది…(శివ రాచర్ల)సీఎం చంద్రబాబు గారు ఆరోపణలు చేశారు....