అమెరికా అధ్యక్షుని అధికార నివాసం వైట్ హౌస్ లో కోనసీమ యువకునికి అత్యున్నత స్థాయి ఉద్యోగం లభించింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కోనసీమలోని కేసనకుర్రుకు చెందిన గొట్టిముక్కల మధు వైట్ హౌస్ సైబర్ సెక్యూరిటీ మౌలిక సదుపాయాల భద్రతా సంస్థ డిప్యూటీ డైరక్టరుగా నియమితులయ్యారు. మే నెల 19 న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన ప్రస్తుతం సౌత్ డకోటా స్టేట్ బ్యూరో ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెలీకమ్యూనికేషన్ కమిషనరుగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు వ్యూస్ ఛానెలు, వెబ్ సైట్ శుభాకాంక్షలు అందజేస్తున్నాయి. మధు కాకినాడలో ఇంటర్ చదివి, ఏలూరులో ఇంజనీరింగ్ పూర్తిచేశారు.