తెలంగాణ‌కు మోకాలడ్డుతున్న కేంద్రం

Date:

కృష్ణా జ‌లాల్లో వాటా ఇంత‌వ‌ర‌కూ తేల్చ‌ని బీజేపీ ప్ర‌భుత్వం
మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ స‌భ‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైర్‌
మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, డిసెంబ‌ర్ 4:
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్ర‌భుత్వం అడుగ‌డుగునా అడ్డంకులు సృష్టిస్తోంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం స‌వ్యంగా ప‌నిచేయడం లేద‌నీ, చేసుంటే జీఎస్టీ ఆదాయం ఇంకా ఎక్కువ ఉండేద‌న్నారు. కృష్ణా జ‌లాల్లో వాటా ఇంత‌వ‌ర‌కూ తేల్చ‌లేక‌పోయింద‌ని విమ‌ర్శించారు. మహబూబునగర్‌లో కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన అనంత‌రం ఏర్పాటైన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగించారు. ఆయ‌న ప్ర‌సంగం ఆయ‌న మాట‌ల‌లోనే… అద్భుత‌మైన పరిపాలన భవనాన్ని నిర్మించుకొని నాచేతుల మీదుగా ప్రారంభింపజేసుకున్నందుకు జిల్లా ప్రజాప్రతినిధులను, జిల్లా ప్రజలందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. పరిపాలన సంస్కరణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 23 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకొని అన్ని జిల్లాలో కూడా అద్భుతమైన కలెక్టరేట్ల నిర్మాణం చేసుకుంటున్నాం. ఇంకా అనేక నిర్మాణాలు కూడా చేసుకుంటు ఉన్నాం ఇదంతా కూడా ఇంత గొప్పగా చేయగలుగుతున్నాం అంటే ఆనాడు మనం పోరాటం చేసి మన రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం కాబట్టి స్వపరిపాలన సాధ్యం అయింది కాబట్టే ఇంత అద్భుతమైన నిర్మాణాలు ఇవన్నీ కూడా మనం చేసుకోగలుగుతావున్నాం. మీఅందరికీ ఆ విషయాలు అన్ని తెలుసు. అన్నీటిని మించి తెలంగాణ ఉద్యమం రెండవ దఫా ప్రారంభమై కొనసాగే సందర్భంలో నేను పాలమూరు ఎంపీగా ఉంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విషయం కూడా మీ అందరకి తెలుసు. ఏ నాటికైనా పాలమూరు జిల్లాకే ఆ గౌరవం, ఆ కీర్తి దక్కతుందని నేను మీఅందరికీ సగౌరవంగా తెలియజేస్తవున్నా. ఒకనాడు ఉద్యమ సందర్భంలో పాలమూరు జిల్లాకి వస్తే వేదనలు, రోదనలు , బాధలు, వలసలు పోయే బిడ్డలను బొంబాయి బస్సుల కాడా సాగనంపి, ఏడ్చే తల్లుల రోదనలు చాలా భయంకరమైన దుస్థితి, ఆత్మహత్యలు, ఆకలి చావులు, గంజి కేంద్రాలు, పాలమూరు జిల్లా అంటేనే ఒక భయంకరమైన కరువు జిల్లా ఇంతముందే మిత్రుడు శ్రీనివాసు గౌడ్ అన్నట్టు 30 ఎకరాలు, 50 ఎకరాలు ఉండే రైతులు కూడా హైదరాబాద్ లో కూలి చేసే పరిస్థితి ఆ బాధ పోవాలని మన రాష్ట్రం మనకు వస్తే బాగుపడుతామని ఎన్నో కలలు కని మనం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం.


ఆ రోజు ఏం పాడినామంటే…
సాధించుకున్న తరువాత అనేక రకాల కార్యక్రమాలు మనం తీసుకున్నాం వాటి ఫలితాలు మీ కండ్లముందు ఉన్నయి. దళితబంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు నేను, కవి మిత్రులు గోరేటి వెంకన్న గారు , మన సాయిచందు గారు ఇతర రచయితలు పాటలు రాస్తుంటే , నేను రాయమని చెప్పిన పల్లె పల్లెలో పల్లెర్లు మొలిసే పాలమూరులోనా ఆ రోజు పాడినం, ఈ రోజు పల్లేర్లు మాయమైనవి, బొంబాయి బస్సులు కూడా బంద్ అయిపోతున్నయి, వలసబోయిన బిడ్డలంతా వాపస్ వస్తున్నరు అని వలసలతో వలవల విలపించు పాలమూరు, పెండిగ్ ప్రాజెక్టులన్నీ వడివడీగా పూర్తి జేసి చెరువులన్నీ నింపి , పన్నీటి జలకమాడి పాలమూరు తల్లి పచ్చపైట కప్పుకున్నది అని జెప్పి రాయమని చెప్పిన. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, దశాబ్దాల తరబడి పెండింగ్ బెట్టి కోయిల్ సాగర్ లాంటి చిన్న లిప్ట్ను కూడా పెండింగ్ బెట్టి ఎంత మొరపెట్టుకున్నా వినకుండా సమైఖ్య పాలకులు మనల్ని నిరాధారణకు గురి చేసినారు, కాని వెనువెంటనే స్థానిక మంత్రివర్యులు, నాయకులు ఎమ్మెల్యేలు అందరం కలిసి అధికారులు అవన్నీ కంప్లీట్ చేసుకున్నాం. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసుకున్నాం, మన ఎమ్మెల్యేల నాయకత్వంలో అద్భుతంగా అన్ని వాగుల మీద చెక్ డ్యాంలు కట్టుకున్నాం. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసుకుంటా వున్నాం. వీటన్నింటి కారణంగా ఈ రోజు బ్రహ్మాండంగా పాలమూరు అంటే కరువు జిల్లా కాదు పచ్చబడ్డ పచ్చని పంటల జిల్లా అని మనకు ఓ పేరు వస్తుంది. అనేక మంది వేరే ప్రాంతాల వాళ్ళు , అనేక మంది ఇతరులు వాళ్ళంతా కూడా నాకు చెప్తా వున్నరు. మహబూబు నగర్ పోయివచ్చినం సార్ , చాలా బ్రహ్మాండాగా ఉంది పరిస్థతి అంతా మారిపోయింది అని చేప్తే చాలా సంతోషంగా ఉంది.


ఒక్క ప్రాజెక్టు పూర్త‌వ్వాలి..
ఒకేఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ కావలిసిన అవసరం ఉంది. ఇందాక ఎమ్మెల్యేలు నేను అధికారులంతా కూర్చున్నాం పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కేంద్రం సహకారం మనకు చేయడం లేదు. నీటి వాటా తెల్చమంటే తేల్చడం లేదు దాని కాల్వల పనులు నారాయణ పేట, మక్తల్ వైపు వరంగల్ పోయేటువంటి కాల్వలు త్వరలోనే ప్రారంభం చేసుకోబోతావున్నాం అవన్నీ అయిపోతే పాతవి కొత్తవి కరెంట్ అన్నీ కలిసి 25 నుంచి 30 లక్షల ఎకరాల్లో పాలమూరులో బ్రహ్మాండంగా మనకు పంటలు పండే రోజు రాబోతావుంది అని నేను మీ అందరికీ సంతోషంగా తెలియజేస్తవున్నా. అనేకకమైనటువంటి కార్యక్రమాలు చేసుకున్నాం ., సంక్షేమంలో మనకేవరూ సాటిలేరు , పోటి కూడా లేరు కార్యక్రమాలు జరిగేటువంటి అన్నీ మీ కండ్ల ముందే ఉన్నయి. ఏ వర్గం కులం, మతం అనే జాతి బేదం, లేకుండా లింగ బేదం లేకుండా అందరినీ కూడా కడుపులో పెట్టుకొని ఆదరిస్తూ మనం ముందుకు పోతున్నం.


అద్భుతంగా పాలమూరు హెడ్ క్వార్టల్ లో ఉన్నుటువంటి మహాబూబు నగర్ లో మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వం లో అనేక మంచి కార్యక్రమాలు జరిగినయి ఆ విషయాలు అన్ని మీకు తెలుసు. ఏ విధంగా పాలమూరు మహబూబ్ నగర్ నియోజకవర్గం ఒక పారిశ్రామిక హబ్ గా తయారవుతావుందో ఈ మద్యనే ఐటీ సెంటర్ రావడం కాని, 300 ఎకరాలలో ఫుడ్ పార్క్ రావడం కాని , రెండువేల ఎకరాలలో అర్బన్ పార్కు ఏర్పడటం కాని అదేవిధంగా నిన్నగాక మొన్న 9500 కోట్ల పెట్టుబడి తో అమర్రాజ బ్యాటరీల ఫ్యాక్టరీ కూడా పాలమూరు కే రావడం అనేది చాల సంతోష విషయం అనేది నేను తెలియజేస్తావున్నా , ఎన్నో రోజులుగా కావలని కోరిన బైపాస్ రోడ్ పూర్తయింది. మహబూబునగర్ టౌన్ లో నేను వస్తావుంటే అంతముందు చాలా ఇరుకైన రోడ్డు ఉండేది , ఈ రోజు నాలుగు లేన్ల రోడ్డుతోని చాలా అందంగా కనపడుతావుంది, కలెక్టరేట్ నుండి ఇక్కడికి రావడానికి మునుపయితే ఊరంత తిరిగి రావాల్సిన అవసరం ఉండేది కానీ కేవలం నిమిషం , రెండు నిమిషాలలోనే నేను ఇక్కడికి చేరుకోగలిగిన అని నేను మనవిజేస్తావున్నా , అదే విధంగా నేను మాట్లాడే ఈ కాళాశాల గ్రౌండ్ లో గతంలో మనం ఉద్యమ సందర్భంలో కూడా సమావేశాలు పెట్టినం ఆ రోజు కూడా ఇట్లాగే భారీ సంఖ్యలో ప్రజలంతా వచ్చినారు. ఇక్కడ స్పోర్ట్స్ ఆడిటోరియం కావలని చెప్పి శ్రీనివాస్ గౌడు గారు అడిగినారు , వెంటనే రేపే జీ.ఓ విడుదల చేయిస్తా , దాన్ని మంజేరు చేపిస్తాం అని మనవి చేస్తావున్నా.


స‌మ‌స్య‌ల‌కు చెల్లుచీటి
మంచి నీటి సమస్య తీరింది, కరెంట్ కొరత తీరింది , సాగు నీటి సమస్య చాలవరకు తీరింది ఇంకా తీరాల్సిన అవసరం ఉంది. మనం రస్తాలో ఉన్నాం దానిని కంప్లీట్ చేసుకుంటాం. పేద సాదల యొక్క బాగోగులు చూసుకుంటూ ఉన్నాం , దళితబంధు కార్యక్రమాన్ని తీసుకున్నాం. గొర్రెల కార్యక్రమం తీసుకున్నాం, అనేక ఇతర కార్యక్రమాలు చేనేత, గీత ఒక వర్గం అని కాదు ఉన్నంతలో అందరినీ ఆదుకొని కార్యక్రమాలు చేస్తువున్నాం. కేసీఆర్ కిట్ కావొచ్చు, ఇంకా ఇతర పథకాలు ఒకటి కావొచ్చు ప్రతి రోజు మీ గ్రామంలో మీ కండ్ల ముందు అవి అమలు జరుగుతావున్నాయి, మీ అందరికీ దానిని మళ్ళీ చెప్పి మీకు బోర్ కూడా కొట్టియ్యదలుచుకోలేదు. ఒక్క విషయం మాత్రం దయచేసి మీరందరూ మీ ఇండ్ల కి పోయిన తరువాత నేను చెప్పే విషయాలు చర్చ చేయాలని నేను కోరుతావున్నా. ఆనాడు పదునాలుగు సంవత్సరాలు, ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ వస్తే చాలా బ్రహ్మండంగా బాగుపడుతాం అని చెప్పినా.. అది మీ కండ్ల ముందే జరుగుతావుంది మీరు చూస్తవున్నారు. మంచి మేలు అయిన రైతులు ఎక్కడ ఉన్నరు. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉన్నరు ఒక్క తెలంగాణ రాష్ట్రం లో ఉన్నరు అని దేశం మాట్లాడుతా ఉన్నది,. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో రాయచూరు ప్రజలు అక్కడ సర్పంచ్ లు ఏక గ్రీవ తీర్మాణాలు చేసి మమ్మల్ని తెలంగాణలో కలపండి అని మాట్లాడుతా వున్నరు. పక్కన మహారాష్ట్ర వాళ్ళు మమ్మల్ని తెలంగాణలో కలపండి అని మాట్లాడుతా ఉన్నరు,

రైతుబంధు ఎవలన్నా అనుకున్నారా.. ఒక రైతు చనిపోతే గతంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన నాయకులు మీరు చూసినారు ., కేసీఆర్ తో మూడంతల దొడ్డు నాలుగంతల ఎత్తు ఉన్నవాళ్ళను చూసినరు ఆపద్భందు అని పెట్టి యాబై వేలు ఇస్తాం అని చెప్తే, ఆరు నెలలు చెప్పులు అరిగేట్లు తిరిగితే ఐదు పదివేలు కూడా చేతికి రాని పరిస్థితి. ఇయాల పొరపాటున కూడా ఒక రైతు చనిపోతే , యాక్సిడెంటే కానక్కర్లేదు , ఏకారణం చేత చనిపోయినా ఐదు లక్షల రూపాయాలు వాళ్ళ కుటుంబానికి టంచన్ గా వచ్చే విషయం కూడా మీరు చూస్తవున్నారు. రైతులు పండించే పంట అద్భుతంగా ఈ రోజు మీమీ గ్రామాలలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకొని ఒక గింజ కూడా లేకుండా ప్రభుత్వమే కొనే పరిస్థతి మీ కండ్లార చూస్తున్నరు. అదే విధంగా ఇంకా అనేక విషయాలు , అనేక కార్యక్రమాలు మీరు చూస్తావున్నరు, ఎన్నడైనా అనుకున్నమా .. తెలంగాణ రాకముందు మహబూబునగర్ జిల్లాలో మెడికల్ కాలేజ్ వస్తుంది అని మనం ఊహించినమా .. ఈ రోజు పాలమూరు జిల్లాలో గర్వంగా ప్రకటిస్తావున్నా ఐదు మెడికల్ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసింది. మూడు ఇప్పడికే ప్రారంభమైనయి. నారాయణపేట గద్వాలలో కూడా వచ్చే జూన్ నుంచి అడ్మీషన్లు తీసుకొని ఐదు మెడికల్ కాలేజీలు మీ జిల్లాలో పనిచేయబోతావున్నాయి.


దళిత కుటుంబాలకు తరతరాలుగా అణిగి నలిగి పోయిర్రు కాబట్టి పది లక్షల రూపాయలు ఇచ్చి మీ ఇష్టం ఉన్న పథకం పెట్టుకోవచ్చు, ఇష్టం ఉన్న వ్యాపరం చేసుకోవచ్చు, ఇలాంటిది ఇండియాలో ఎప్పుడన్నా చూసినమా ఇన్నామా చరిత్రలో.. మెడికల్ షాపులలో, ఫెర్టిలైజర్ షాపులలో, బార్ వైన్ షాపులలో ప్రభుత్వం ఇతర లైసెన్సులు ఇచ్చే షాపులలో లాభాసాటి వ్యాపారులలో, కాంట్రాక్ట్ లలో దళితులకు రిజర్వేషన్లు ఇచ్చింది ఎప్పుడన్నా చూశినామా.. గౌడ సోదరులకు పదిహేను శాతం బార్ వైన్స్ లో రిజర్వేషన్ ఇచ్చిన రాష్ట్రం ఇండియాలో ఎక్కడైనా ఉన్నదా ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా చెప్పొచ్చు , నేను ఒక్క మాట సీరియస్ గా మనవి చేస్తా వున్నా ఇంతకు ముందే కలెక్టరేట్ సభలో చీఫ్ సెక్రెటరీ గారు చెప్పినారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు మన బడ్జెట్ 62 వేల కోట్లు ఇయ్యాల మన బడ్జెట్ రెండున్నర లక్షల కోట్లు , మన జీఎస్డీపీ ఐదు లక్షల కోట్లు ఉంటే ఇయ్యాల పదకొండున్నర లక్షల కోట్లు ఉన్నది. కష్టపడి అవినీతి రహితంగా క్రమశిక్షణతోని రాత్రింబవళ్ళు పని చేస్తే ఇది సాధ్యం అయితది తప్పా , మాటలు చెప్పితే , డైలాగ్ లు చెప్పితే కాదు , డైలాగ్ లు కొడితే కాదు, ఊరికే ఉత్త మాటలు చెప్పితే కాదు, అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని ప్రజా విశ్వాసంతోని అధికారులు, మంత్రులు, శాసనసభ్యులు, అందరు పని చేస్తే ఈ రకమైన ఫలితాలు రాబట్టగలిగినం.


కేంద్ర ప్ర‌భుత్వ వైఫ‌ల్యం
ఒక్క మాట దయచేసి చదువుకున్న వాళ్ళు, విద్యార్థులు, యువకులు, మేధావులు ఒక్కసారి ఆలోచన చేయాలి, నేను చాలా సీరియస్ మాట చెబుతావున్నా మనతోపాటే కేంద్రంలో ఇంకో పార్టీ గవర్నమెంట్ లోకి వచ్చింది. తెలంగాణ పనిచేసిన మందం , తెలంగాణ ఎంతమేరకు పని జరిగిందో ఆ పూర్తి పని కేంద్ర ప్రభుత్వం చేసి ఉంటే మన జీఎస్డీపీ పదకొండున్నర లక్షల కోట్లు కాదు , పద్నాలుగున్నర లక్షల కోట్లు ఉండేది. అంటే తెలంగాణ రాష్ట్రం ఒక అసమర్థ కేంద్ర ప్రభుత్వం వల్ల, చేతకాని కేంద్ర ప్రభుత్వం వలన ఒక్క తెలంగాణ రాష్ట్రమే మూడు లక్షల కోట్లు నష్టపోయింది. మాట్లాడండి, చర్చ చేయండి, ఏ విధంగా ఉన్నదో మీరు ఆలోచన చేయండి, నేను చెప్పే విషయాలు పేపర్లలో వస్తావున్నాయి. టీవీలలో వస్తావున్నాయి, మేధావులు రాస్తావున్నారు, చాలామంది చెబుతావున్నరు, దయచేసి సీరియస్ గా ఆలోచన చేయాలి. ఒక రాష్ట్రం మనం ఒక్కలం తిప్పల పడితే కాదు మనతో సరిసామానంగా కేంద్ర ప్రభుత్వం కూడా పనిచేస్తేనే ఈ దేశం అన్ని రకాలుగా బాగుపడుతుంది, కానీ ఆ పద్ధతి లేదు, సహకారం లేదు, ఒక్కటే ఒక్క మాట మీరు ఆలోచన చేయాలి ఆనాడు కాంగ్రెస్ నాయకులు , ఇప్పుడున్న ప్రధానమంత్రి నరేంద్రమోడి గారు ఇదే జిల్లాకు వచ్చి సభలు పెట్టి పాలమూరు హమ్ బనాయేంగే అంటే హమ్ బనాయింగే అని చెప్పిర్రు., ‘‘కిదర్ గయా బయి , క్యూ నయాయా … పైన పటారం లోన లొటారం చెప్పేది డంబాచారం.’’ ఒక్కటే ఒక్క మాట నేను అడుగుతావున్నా..

దండం పెట్టిన నేను కడుపులో తల పెట్టినా, నూటయాబై దరఖాస్తులు నేనే స్వయంగా ఇచ్చినా కరువు జిల్లా పాలమూరు జిల్లా , ఫ్లోరైడ్ జిల్లా నల్లగొండ జిల్లా, ఎండిపోయిన జిల్లా రంగారెడ్డి జిల్లా ఈ మూడు జిల్లాలు హక్కు కలిగివున్న నది కృష్ణా నది, కృష్ణా నదిలో మా వాటా తేల్చండి.. మీరే వచ్చి చెప్పిర్రు మైక్ లో సభలు పెట్టి , మీరు చెప్పిన మాటకు కట్టుబడి అయినా సరే తెలంగాణ వాట మాకు ఎన్ని ఇస్తరు .. నూరా..నూటయాబై హా, రెండు వందలా, నాలుగు వందలా చెప్పమంటే.. ఒక అద్భుతమైన ప్రచారాలు చేసుకునే ప్రధానమంత్రి కి , కేంద్ర ప్రభుత్వానికి ఏనిమిది సంవత్సారాల టైం చాలదా..? ఎనిమిదేండ్లా..? అంటే ఎక్కడ ఉంది ఈ దేశం.. నా వాటా చెప్పడానికే ఎనిమిదేండ్లు అయితే పర్మిషన్లు ఎప్పడు రావాలి , ప్రాజెక్ట్ ఎప్పడు కట్టాలి, నీళ్ళు ఎప్పుడు రావాలి.. మా మనుమండ్లా… మా ముని మనుమండ్లా లేకపోతే రానే రావా.. ఇట్లనే ఉండాలా భారతదేశం ఉండాల్నా.. మారాల్నా..? మన కండ్లముందు మన పాలమూరు లో ఈ పరిస్థతి ఉంది.


నేను ఎందుకు చెబుతున్నా ఈ మాట..? ఏం మాట్లాడుతున్నరు.? ఈ రోజు మీరు వింటున్నరు , మాకు చేతకాదు , వ్యవహారం చేయరాదు, దబ్బున నువు చేస్తే నీకు అడ్డం పడుతం, మీ కాళ్ళల్ల కట్టె పెడుతం .. ఇదే జరుగుతాంది కదా.. మీరు చూస్తలేరా.. ఇంకా చాలా విచిత్రమైన పద్ధతులు ప్రజాస్వామ్యంలో ప్రజలు శ్రామికులుగా ఉండే దేశంలో ఎవలికి అధికారం ఇస్తే వాళ్ళు పని చేయాలి ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోశించాలి. అపొజిషన్ లో ఉండమంటే అపోజిషన్ లో ఉండాలి , గెలిచిన వాళ్ళను ఐదేండ్లు పని చేయనియాలి మంచో, చెడ్డనో తేల్తది మల్లా ప్రజా కోర్టులో న్యాయస్థానం నిర్ణయిస్తది, ప్రజలు నిర్ణయం తీసుకుంటరు. కానీ ఏం జరుగుతావుంది.. మాకు చేతకాదు, మేము చెయ్యము, చేశేటోల్లను చేయ్యనియ్యము, ఎవలయితే చేస్తరో , వాల్లను చేయనియ్యము, ఎందుకు మా దొంగ తనం బయట పడుతది. మాతెలివి తక్కువతనం భయట పడుతది, మా డొల్లతనం బయట పడుతది,

ఇది కదా ఈ రోజు దేశంలో జరుగుతున్నది., మీరు చెవుల నిండా వింటున్నరు , కండ్లతోటి టీవీలలో చూస్తున్నరు, దయచేసి ఆలోచన చేయాలి నేను చెప్పెది , ఇది చిన్న విషయం కాదు, ఆనాడు తెలంగాణ విషయంలో నేను చెప్పిన ప్రతి మాట నిజమైంది. ఇప్పుడు దేశంలో ఏం జరుగుతుందో మనం చేయాలి. యువకులు, మేదావులు, పెద్దలు, చదువుకున్నవాళ్ళు, మన చుట్టు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి , స్పందించాలి తెలియని వాళ్ళు తెలియజెప్పాలి, చైతన్యవంతమైన సమాజం ఉంటేనే అద్భుతమైన ఫలితాలు వస్తయి. నాకెందుకులే.. నీకెందుకులే అనుకుంటే కాదు, కాబట్టి దయచేసి మీరు పోయిన తరువాత మీ గ్రామాలలో చర్చ పెట్టాలి, చర్చ జరగాలి , మీ ఇంటితో పాటు , మీరుండే బస్తీలో, మీరు ఉండే ఊరిలో ఈ చర్చ పెట్టాలి.


కోట‌లు దాటుతున్న మాట‌లు
దేశంలో మాటలు ఏమో కోటలు దాటుతయి తెలగాంణ గరీబ్ గడ్డా , ఒకనాడు బాదపడ్డం , స్వంత రాష్ట్రం అయిన తరువాత నేనే చెప్పినా.. ఐదేండ్లలోపల మిషన్ భగీరథ పూర్తి చేసి ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్ళు ఇయ్యకపోతే వచ్చే ఎలక్షన్ లో ఓట్లే అడగను అని చెప్పినా, నిలబడను అని చెప్పినా.. 24 గంటల కరెంట్ రెండేండ్ల లోపల ఇచ్చి తీరుతాం అని చెప్పినం , ఆనాడు ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి జానారెడ్డి గారు లేచి రెండేండ్ల లోపల నువు 24 గంటల కరెంట్ ఇస్తే నీను కూడా నీ గులాబీ కండువ కప్పుకుంటా అని నాతో అసెంబ్లీలో చాలెంజ్ చేసిండు. ఇయ్యాల 24 గంటల కరెంట్ వస్తుందా.. బ్రహ్మాండంగా ఉందా , రైతు ఇవరైనా వచ్చి కోనాయ్ అని ఎవరైనా అడుగుతున్నారా.. నువు ఎన్ని పెట్టినవ్ , ఎన్ని మోటర్లు పెట్టినవ్ అని ఎవడైనా అడుగుతున్నాడా.. ఫ్రీగా చేసుకోమని చెప్పినం వ్యవసాయం , తెలగాంణ రైతాంగం కరువుకు కాటకాలకు గురై, దు:ఖానికి గురై, చెట్టుకోలం, గుట్టంకోలం అయినం, బతుకు లేక వలసలు పోయినం, వాళ్ళు జర బాగుపడాలి, జరంత మోహాలు తెల్లపడాలి , అప్పులు కట్టాలి వాళ్ళ సొంత పెట్టుబడి వాళ్ళు పెట్టుకోవాలి అని ఆలోచన చేసి ఇచ్చే పథకం రైతుబందు, ఇచ్చే పథకం రైతబీమా, ఇచ్చే పథకం ఉచిత కరెంట్.. చిల్లర రాజకీయాల కోసమో.. చిల్లర ఓట్ల కోసమో కాదు..

నా తెలగాంణ రైతు భారతదేశంలోనే కాలర్ ఎగరేసుకొని దర్జాగా బ్రహ్మాండంగా అప్పులు లేకుండా ఉండాలి .. తెలంగాణ లో రైతాంగం అప్పులు లేకుండా ఉంటేనే గదీ.. అసలైన బంగారు తెలంగాణ నమ్మీ ఆ పని మేము చేస్తా వున్నాం .. ధాన్యం కొనుగోలు చేస్తావున్నాం, సంవత్సరానికి వెయ్యో, రెండు వేల కోట్లో నష్టం వచ్చినా.. మారైతుల కోసమేగా అని చెప్పి ప్రభుత్వం చేస్తా వుంది .. మీ కండ్లతో చూస్తున్నరు.. కానీ మీరు గమనించాల్సింది ఏంటి .. ఏం జరుగుతాంది ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో గుజరాత్ లో కూడా తాగడానికి నీళ్ళు లేవు.. ఒక్కోక్క మాట యాదికొస్తే మనది మనకే భయమైతది ఎరువు బస్తాలు కావాలంటే కూడా ఇయ్యలే ఆరోజు పోలీస్ స్టేషన్ లో పెట్టి అమ్మినారు మనం కండ్లారా చూసినం అన్ని పరిస్థితులు అదిగమించి అద్భుతంగా మనం ముందుకు పోతావున్నాం.


అణువణువునా అడ్డంకులే…
దీన్ని చూసి స్పందించడం పోయి , దీనిమీద కన్నెర్ర పెట్టుకొని ఇక్కడ కట్టె పెట్టాలి, అడ్డం పడాలి వచ్చే పైసలు రాకుండా చేయాలి నిధులు ఆపాలి, ఎఫ్ఆర్బీఎం మీద కోతలు పెట్టాలి , ప్రగతిని అడ్డుకోవాలి.. ఎవలైనా చేస్తారా.. ఇది మంచిదేనా, ఇది చేయదగ్గదేనా .. నేను మాట్లాడుతా వుంటా మా మంత్రులతో, మా ఎమ్మెల్యేలతో మాట్లాడుతుంటే సందర్భం వస్తావుంటే నేను చెపుతావుంటా ఇడ కాదు ఆయన గాడపోయి గద్వాల కాడ పెడుతాడంట , గద్వాల మనది కాదా .., అలంపూర్ మనది కాదా , అచ్చంపేట మనది కాదా , తెలంగాణ లో ఏ ఇంచు అయినా మనదే ఎక్కడ వచ్చనా మనదే కదా అని నేను మాట్లడుతాం ప్రతి ఇంచూ మనదే కదా , ప్రతి మనిషి మనవాళ్ళే కదా , కాని ఒక రాష్ట్రం బాగుపడితే దానికి అడ్డం పడుతరా దేశ ప్రధాని చేయవలిసిన పనేనా , కేంద్ర ప్రభుత్వం చేయవలిసిన పనేనా పనికిమాలిన అడ్డం కాలు పెట్టి మేం పని చేయ్యం , మిమ్మల్ని చేయనియం దబ్బునా ఎవరైనా మాట్లాడితే మీ రాష్ట్ర ప్రభుత్వాలు కూలగొడుతాం ఇదా.. ఇదేనా పద్దతి ప్రధాన మంత్రి స్వయంగా కేసీఆర్ నీ ప్రభుత్వాన్ని కూలగొడుతా .. అంటే ఎమన్నట్టు, ఏం అర్ధం చేసుకోవాలి, నువు ఎట్లా గెలిచనవో మేము అట్లా గెలువలేదా.. మాకు ప్రజలు ఓట్లు వేయకుండానే గెలిచినామా .. ఏం కారణం చేత కూలగొడుతం , బెంగాళ్ కు పోయి మమతా బెనర్జి నీ పార్టీ 40 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నరు అని ప్రధాన మంత్రి చెప్పొచ్చునా..

ఇదేనా దేశం ఈ దేశమేనా మనం కోరుకున్నది దయచేసి యువకులు విద్యావంతులు ఎక్కడివాళ్ళు అక్కడా ఆలోచించకపోతే మనం చాలా దెబ్బ తింటాం ఆగమైపోతాం నేను ఒక్కటే మాట మనవి చేస్తావున్నా .. ఎవలో చిల్లర గాళ్ళు రాజకీయాల కోసం అవలంబించే చిల్లర ఎత్తుగడలు చాలా అప్రమత్తంగా ఉండకుంటే అది గమనించకపోతే అర్ధం అయి కూడా మనం అర్థం కానట్టు ఉంటే అర్థం అయినా కాని మనం సీరియస్ తీసుకోకపోతే అందరి బతుకుల ఆగం అయితయి ఇది ఒక వ్యక్తి కోసం కాదు నేను చెప్పేది , ఒక పార్టీ కోసం కాదు , ఒక ఎన్నిక గెలవడం కోసం.. ఈ భారత సమాజం యొక్క జాతి జీవన నాడి ఇయాల కలుషితం చేయబడుతావుంది ., చిల్లర రాజకీయ లక్ష్యాల కోసం ఉన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల మద్య చీలికలు తెచ్చి విద్వేశాలు రెచ్చగొట్టి బావోద్వేగాలు రెచ్చ గొట్టి ఒక మంచి మేలైన నాయకులను ఇబ్బంది పెట్టి దాడులు చేయించి ఒక దౌర్జన్య పూరిత దుర్మార్గపూరితమైన విధానం జరుగుతున్నది,

మనం కండ్లారా చూస్తున్నాం .. ఎక్కడనో ఒక్కాడ దీనికి ఒక బెబ్బులి లాగా పంజా లేవాలి దెబ్బ కొట్టాలి .. మొన్న హైదరాబాద్ కి వచ్చిర్రు దొంగలు , టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చీల్చి ఇడ పుల్లపెట్టి దీన్ని అస్థిర పరిచి మేము కిందిమీదికి చేస్తం అని వస్తే అణగపట్టి దొరకపట్టి జైళ్ళ యేసినం.. కరెక్టే కదా .. ఎక్కడి నుండి తిరుగుబాటు దేశంలో ప్రారంభం కావాలి ఆ తిరుగుబాటు చేయకపోతే , ప్రతి ఘటించకపోతే , ఆనాడు మనం కొట్లాడకపోతే , తెగించకపోతే మనకు తెలంగాణ కూడా రాకపోవు , మన గతి గట్లనే వుంటుండే , ఒకనాడు మహాత్మగాంధీ నాయకత్వం లో వేల మంది లక్షల మంది స్వతంత్ర్య సమరయోధులు పోరాటం చేసి ఉండక పోతే ఇయ్యాల కూడా మనం బానిసలుగా ఉందుము.. కాబట్టి నాకెందుకులే అనేది కరెక్ట్ కాదు చుట్టూ ఏం జరుగుతా వుంది , దేశంలో ఏం జరగుతా వుంది మనం తెలుసుకోవాలి, తెలుసుకొని ముందుకుపోవాలి ..


ఏం చేస్తున్నామంటే…
కృష్ణా నీళ్ళు ఇయ్యడం చేతకాదు , పాలమూరు జిల్లా లో పాపం వాల్మికి బోయలు ఉన్నరు ఎప్పటి నుండో అడుగుతున్నరు మమ్మల్ని ఎస్టీలో కలపమని.. అసెంబ్లీ లో తీర్మానం చేసినం , పంపినం ఏడు యేండ్లు గడిచి పోతావున్నయ్ హరి శివ లేదు ., కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ తిర్మాణం చేస్తాం రాబోయే అసెంబ్లీ లో , మళ్ళ కూడా తీర్మాణం చేస్తం , కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తం అని మనవి చేస్తావున్నా.. అదేవిధంగా పాలమూరు జిల్లా వెనకబడ్డ జిల్లా ఇప్పుడిప్పుడే బాగా కొంచం తేటపడుతున్న జిల్లా అన్నిరకాలుగా అభివృద్ధి కావలిసిన అవసరం ఉంది. తప్పకుండా అన్ని రకాలుగా పాలమూరును ఆదుకోవలిసిన అవసరం ఉన్నది . పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు దగ్గర దగ్గర తొంబై శాతం పూర్తయినయి కొన్న చిన్న చిన్న ఆటంకాలు ఈ జిల్లాలో పుట్టినవాళ్ళే దరిద్రులు కొంత మంది కల్పిస్తావున్నరు విటిని అదిగమించే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తావున్నాం. తప్పకుండా వాటిని వెంటనే అమలు చేసి , కాల్వల పనులు కూడా మొదలు పెడుతాం అని మనవి చేస్తావున్నా ..

అదేవిధంగా ఏ జిల్లాకు పోయిన ఎమ్మేల్యేలు కోరికలు కోరుతరు ప్రతి నియోజక వర్గానికి మాకోక 10కోట్ల రూపాయలు నిధులు ఇవ్వమని అడిగారు కాని పాలమూరు నన్ను ఎం.పి గెలిపించి, నేను ఎం.పి గా ఉన్నప్పుడే తెలంగాణ సాధించినము కాబట్టి ప్రత్యేకమైన అభిమానంతోని 14 అసెంబ్లీ నియోజక వర్గాలకు , ఈ నియోజకవర్గం , ఆనియోజకవర్గం అని తేడా లేకుండా మీయొక్క ఏసీడీపీ నిదులు నియోజకవర్గ అభివృద్ది నిదులు ఇదువరకు ఇచ్చిన ఐదు కోట్లు కాకుండా మరోక 15 కోట్లు 220 కోట్లు మంజూరు చేస్తావున్నాం అని మనవిచేస్తావున్నా.. గౌరవ శాసన సభ్యులు మంత్రి వర్యులు అందరూ కూడా దయచేసి ముందుకుపోవాలి , దళితబందు అమలు చేసుకోవాలి , ఎమ్మెల్యలే ఆధ్వర్యంలో సెలక్షన్ చేయమన్నాం . ఆవిధంగానే ముందుకు పోదాం , కాలీ జాగాలు ఎవలికైతే ఉన్నయో మూడు లక్షలు ఇచ్చి ఇండ్లు కట్టిస్తాం అని చెప్పినం వాటిని కూడా వెంటనే రాబోయే పదిపదిహేను రోజులలో గౌరవ శాసన సభ్యుల నాయకత్వంలో ఇండ్లు కూడా మంజూరు చేస్తాం.. పాలమూరు జిల్లాకు ప్రత్యేకంగా నియోజకవర్గానికి ఒక వెయ్యి ఇండ్లు చొప్పున అదనంగా కూడా మంజూరు చేస్తాం అని మనవి చేస్తవున్నా..

మీరు. … జై అంటున్నారు కానీ .. పాలమూరు జిల్లా వెనుకబడిపోయిన జిల్లా కాబట్టి మనం ఎవలి ఎనుకబడం దరిద్రం వెనుకబడుతం , వెనుకబాటుతనం వెనుకబడుతాం , దాన్ని తరిమేద్దాం అందరం కలిసి అద్భుతమైన పాలమూరును నిర్మించుకుందాం పచ్చని పంట పొలాలతోటి , ఐదు మెడికలు కాలేజీలతోని , ఇంకా అనేక వసతులతోని అద్భుతమైన పాలమూరు తయారు కావాలి , గొర్రెల పంపిణీ కార్యక్రమం కొనసాగతది, యాదవ సోదరులకు నీను హామీ ఇస్తావున్నా ఆ విధంగా ఆ కార్యక్రమం కూడా కొనసాగుతది అన్ని కార్యక్రమాలు చేసుకొని అందరినీ కడుపులో పెట్టుకొని ముందుకు పోదాం, ఇంకా చెక్ డ్యాం లు కట్టాలి , చాలా బ్రహ్మండంగా అందరు ఎమ్మెల్యేలు కట్టినారు మాయొక్క దేవరకద్ర ఎమ్మెల్యే అయితే చాలా బ్రహ్మండంగా కట్టినాడు , అధ్భుతమైన భూగర్బజలాలు పెరిగినాయి , మొన్న పేపర్ లో వార్త చూసి నీను గర్వ పడ్డ అని సంతోషపడ్డా ఇగో ఈ పనులు కావాలి ఇది పాలమూరు చేయాలి నిరంజన్ రెడ్డి పేరు నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టినం ఇది కావాలి తెలంగాణకు ఈ నాయకులు కావాలి వీళ్ళ ఆద్శర్యంలో కావాలి, త్వరలో అచ్చంపేట్ నియోజకవర్గానికి పర్యటన శ్రీకారం చుడుతావున్నాం. ఆ పక్కనుంచి అది కూడా చేసుకుంట వస్తాం . అన్ని పనులు చేసుకుందాం , నేను మీతో ఉంటాను , మీరు కూడా నాతో ఉండాలి , ఆశీర్వదించాలి అందరం కలిసి అద్భుతమైనటువంటి పాలమూరు నిర్మాణం చేసుకోవాలి.


మీరొక పర్మిషన్ ఇయ్యాలి తెలంగాణ ఎంతో కొంత మెల్లెమెలెగా బాగుపడే లైన్ పట్టినం, ఇప్పుడిప్పుడే కొద్దిగా గ్రామాలు, వలసపోయిన వాళ్ళంతా వాపసు వస్తున్నరు కొద్దిగ కుదుట పడుతున్నాం, రైతాంగం కొద్దిగ తేట పడుతున్నది. అన్ని వృత్తుల వాళ్ళను కాపాడుకుంటున్నాం మనం ఒక్కలం బాగు పడితే కాదు, దేశం కూడ బాగుపడాలి. అందుకోసం ఖచ్చితంగా తెలంగాణ తరుపున మనందరి తరపున జాతీయ రాజకీయాలలో కూడ చురుకైన పాత్ర వహించాలే..వహించుదామా వద్దా..? వహించుదామా..? బీ ఆర్ ఎస్ కి పోదామా..? ఖచ్చితంగా పోదామా..? ఇక్కడ మీరు గట్టిక చూసుకుంటామంటే అక్కడ నేను గట్టిగ చూస్తా..పోదాం గదా..? అందరం కలిసి పోదాం ఈ దేశం బాగుపడితేనే మనం కూడ బాగుపడుతాం కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ లాగ భారతదేశాన్ని కూడ తయారు చేయడానికి భగవంతుడిచ్చిన సర్వ శక్తులోడ్డి ముందుకు పోదాం జాతీయ రాజకీయాలను కూడ ప్రభావితం చేద్దాం అద్భుతమైన భారతదేశ నిర్మాణానికి తెలంగాణ గడ్డనుంచే పునాదులు వేసి మన పేరు బంగారు అక్షరాలతో రాసేవిధంగా ముందుకుపోదామని తెలియజేస్తూ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మీఅందరికి పేరుపేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా..
జై భారత్.. జై తెలంగాణ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

రిపోర్టర్ సలహా పాటించిన లోక్ సభ స్పీకర్

జిల్లాలో పూర్తైన కీలకమైన వంతెనవేదికపైకి పిలిచి చెప్పిన బాలయోగిఈనాడు - నేను:...

హాసం రాజా అమీన్ సయానీ

ఆపాతమధురం -2 పుస్తకావిష్కరణహైదరాబాద్, జనవరి 21 : ప్రముఖ పాత్రికేయులు, మ్యూజికాలజిస్ట్,...

ఒ.ఎన్.జి.సి. వెల్ రిగ్గింగ్ ఎలా చేస్తుందంటే…

ఒక మాజీ ఉద్యోగి కథనంపాశర్లపూడి వెల్ తవ్వింది మేడ్ ఇన్ ఇండియా...

నిజాయితీకి ఆహార్యం ఆ రిపోర్టర్

ఆయన పేరే బొబ్బిలి రాధాకృష్ణనేను - ఈనాడు: 31(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి) సంస్థకు...
slothttps://www.rajschool.com/slot onlinehttps://sai-ban.com/https://britoli.com/https://www.anabias.com/https://bcrbltd.com/https://s2aconsultingfze.com/https://rock-poker.com/https://koinhoki88.org/https://koinhoki88.net/https://rawsolla.com/https://koinhoki888.com/https://koinhoki88.com/https://infomedan.net/qqplazaslot gacorslot gacor koinhoki88slot gacor terbaru koinhoki88koinhoki88koinhoki88slot777https://usfinancehelp.com/https://collectingdiecasttoystoday.com/https://nyonyaguru.com/https://topindo-pulsa.com/https://gojekonline.com/https://dafrastar.com/https://www.reliantholdings.net/https://www.opalcitysview.com/https://lumarca.info/https://alt-qqaxioo.com/https://www.capuletlondon.com/https://www.tithaimart.com/https://www.trungvuongus.com/https://tropicalbioenergy.com/https://www.capitol-peak.com/https://pisswife.com/https://gamvipvn.com/https://www.elfutbolesnuestro.com/https://ampdsmart.com/https://schiffsilver.com/https://theicemall.com/https://shebenik.com/https://popvoxawards.com/https://www.adwebconsultancy.com/https://www.technotchsolutions.com/https://threekookaburras.com/https://marcjacobsonsale.com/https://www.forexrehberim.net/https://dreamlifefactory.com/https://www.videosocialcreative.com/https://www.oregonwetlands.net/https://www.americaneve.com/https://www.iamthelongtail.com/https://www.privatelivesbroadway.com/https://travelamateurs.com/https://sustaintheline.com/https://geekforcefive.com/https://galaksinews.com/https://sejutateknologi.com/https://harimausumateranews.com/https://diarysaham.com/https://lacakonline.com/https://undangansah.com/https://kottakkalayurvedapharmacy.com/https://kabforums.org/https://bhootmedia.com/https://erectie-goedkoop.com/https://heylink.me/Bandargaming-/https://qqcrownbos.com/https://eastofanfield.com/https://nyonyabesar.com/https://direktoriwisata.com/https://bbqburgersmore.com/https://bjwentkers.com/https://mareksmarcoisland.com/https://richmondhardware.com/https://technostrix.com/https://troostcoffeeandtea.com/https://malindoak.co.id/