ఇద్దరు మెడికల్ డైరెక్టర్లు సహా ఆరుగురి సస్పెన్షన్

1
253

అర్హతలేకుండా వైద్యసేవలు: 6 గురు డాక్టర్ల సస్పెన్షన్
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఉత్తర్వులు
హైదరాబాద్, సెప్టెంబర్ 26 : తెలంగాణలోని ఐదు ప్రైవేటు ఆస్పత్రులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కొరడా ఝుళిపించింది. ఆ ఆస్పత్రుల వైద్యులను సస్పెండ్ చేసింది. సస్పెండైన వారిలో ఇద్దరు మెడికల్ డైరెక్టర్లు. వృత్తిపరంగానూ, నైతికంగానూ వీరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని కౌన్సిల్ పేర్కొంది. హైదరాబాద్ లోని ఇ.సి.ఐ.ఎల్. లో ఉన్న ఆక్సీ కేర్ ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఏ. చైతన్య రెడ్డి, కొత్తపేటలోని ఓమ్ని హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ గౌతమ్ రెడ్డి లను భువనగిరిలో నిర్వహించిన ఒక ఆరోగ్య శిబిరంలో అర్హతలేని వైద్యులకు అవకాశం ఇచ్చినందుకు ఆరునెలల పాటు సస్పెండ్ చేశారు.
వనస్థలిపురంలోని ఇవ్య ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ కె.వి. మల్లికార్జునరావు నిర్వహించిన శిబిరంలో అర్హత లేని వైద్యుల సేవలు వినియోగించుకున్నందుకు ఆరునెలలు సస్పెండ్ చేశారు.


జూబిలీ హిల్స్ లోని లివ్ యంగ్ ఆస్పత్రిలో అర్హతలు లేనప్పటికీ ఉన్నట్టు నమ్మించి కాస్మాటాలజిస్టుగానూ, హెయిర్ ఇంప్లాంట్ సర్జన్ గానూ కొనసాగుతున్న డాక్టర్ తాళ్లపల్లి కన్నయ్యను ఏడాదిపాటు సస్పెండ్ చేశారు.
సంగారెడ్డిలోని పద్మావతి న్యూరో అండ్ ముల్టీస్పెషలిటీ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ కె. ఉమామహేశ్వర్ ను ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు. లేని అర్హతలను తన నేమ్ బోర్డు పై రాసుకున్నందుకు ఈ చర్య తీసుకున్నారు.
ఈ మేరకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఒక ప్రకటన విడుదల చేసింది.

1 COMMENT

  1. 👌👌 అన్ని చోట్లా ఇలాంటి కలుపు మొక్కలు చాలా వున్నాయి. అవన్నీ ఏరివేస్తే వ్యవస్థ కొంతవరకైనా మార్పు చెందుతుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here